Tiger Reserve Zones | తెలంగాణలో పులుల సంతానోత్పత్తి..! జనసంచారంపై నిషేధం..!!
Tiger Reserve Zones | తెలంగాణలోని టైగర్ రిజర్వ్ జోన్లలో( Tiger Reserve Zones ) పులులు తమ సంతానోత్పత్తిని పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూడు టైగర్ రిజర్వ్ జోన్ల పరిధిలో జులై 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జనసంచారంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించారు.
Tiger Reserve Zones | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలోని టైగర్ రిజర్వ్ జోన్లలో( Tiger Reserve Zones ) పులులు తమ సంతానోత్పత్తిని పెంచుకుంటున్నాయి. రాష్ట్రంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, నాగార్జున సాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ జోన్లలో పులులు( Tigers ) తమ సంఖ్యను పెంచుకుంటున్నాయి. అయితే పులుల సంతానోత్పత్తికి జులై నుంచి సెప్టెంబర్ మాసం వరకు అనుకూలం. ఈ క్రమంలోనే ఈ మూడు టైగర్ రిజర్వ్ జోన్ల పరిధిలో జులై 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జనసంచారంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించారు. అటవీశాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పులుల సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
ఆల్-ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (AITE) 2026 సర్వేలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ATR)లో పులుల సంఖ్య గణనీయంగా ఉన్నట్లు ఇటీవల విడుదలైన నివేదికలో వెల్లడైన సంగతి తెలిసిందే. నవంబర్ 2025 నుంచి జూన్ 2026 వరకు (సుమారు ఎనిమిది నెలల పాటు) రిజర్వ్ అటవీ ప్రాంతంలో నిర్వహించిన ఈ సర్వే విజయవంతంగా ముగిసింది. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ రిజర్వ్‌లో ఆడ, మగ, అలాగే పిల్ల పులులతో కలుపుకుని మొత్తం 42 పులులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2,611 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ దట్టమైన అటవీ ప్రాంతం ఇప్పుడు పులులకు సురక్షితమైన ఆవాసంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

NIMS BSc Nursing | నిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు.. చివరి తేదీ జులై 11
జులై 2, 2026

Harish Rao on Singareni Scams | సింగరేణిలో కాంగ్రెస్ వేల కోట్ల దోపిడీ.. రేవంత్ బామ్మర్దికే ఓబీ టెండర్లు: పీపీటీతో హరీష్ రావు సంచలన ప్రజెంటేషన్
జులై 1, 2026

Harish Rao | సింగరేణి అధికారులు సమ్మెబాట పట్టడం చరిత్రలో తొలిసారి
జులై 1, 2026
తాజావార్తలు
- ●Rain Alert | రాగల 48 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షాలు..!
- ●NIMS BSc Nursing | నిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు.. చివరి తేదీ జులై 11
- ●Bindi | బొట్టు బిళ్లను అద్దానికి అతికిస్తున్నారా..? అయితే దంపతుల మధ్య వివాదాలే..!
- ●Horoscope | జూలై 2 రాశిఫలాలు.. మీరు తీసుకునే నిర్ణయాలు లాభాలను అందిస్తాయి!
- ●Vande Bharat Sleeper Train | దేశంలో రెండో 'వందేభారత్ స్లీపర్' రెడీ: బెంగళూరు టూ ముంబై.. డీటెయిల్స్ ఇవే!
- ●Pawan Kalyan on social media abuse | సోషల్ మీడియాలో ఇక ఆ ఆటలు సాగవు.. అసభ్య ప్రచారాలపై పవన్ కళ్యాణ్ సీరియస్

Rain Alert | రాగల 48 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షాలు..!

NIMS BSc Nursing | నిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు.. చివరి తేదీ జులై 11

Bindi | బొట్టు బిళ్లను అద్దానికి అతికిస్తున్నారా..? అయితే దంపతుల మధ్య వివాదాలే..!

Horoscope | జూలై 2 రాశిఫలాలు.. మీరు తీసుకునే నిర్ణయాలు లాభాలను అందిస్తాయి!



