త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | ఉపాధి హామీ చ‌ట్టం పేరు మార్పుకు వ్య‌తిరేకంగా ఉద్య‌మం: టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌గౌడ్

Mahesh Kumar Goud | దేశంలో ఉపాధి హామీ చ‌ట్టం (MGNREGA) పేరు మార్పుకు వ్య‌తిరేకంగా ఉద్య‌మాన్ని ఉధృతాన్ని చేయ‌నున్న‌ట్లు టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. గాంధీభ‌వ‌న్‌లో నిర్వ‌హించిన సమావేశంలో మ‌హేశ్‌గౌడ్ మాట్లాడుతూ జీ రామ్ జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల‌ 20 నుంచి 30 వ తేదీ వ‌ర‌కు అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలన్నారు.

A

Telangana | Published On Jan 8, 2026, 4.11 pm IST

Mahesh Kumar Goud | ఉపాధి హామీ చ‌ట్టం పేరు మార్పుకు వ్య‌తిరేకంగా ఉద్య‌మం: టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌గౌడ్
Advertisement

Mahesh Kumar Goud | దేశంలో ఉపాధి హామీ చ‌ట్టం (MGNREGA) పేరు మార్పుకు వ్య‌తిరేకంగా ఉద్య‌మాన్ని ఉధృతాన్ని చేయ‌నున్న‌ట్లు టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ (MLC) మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విసృత స్థాయి సమావేశాన్ని గాంధీభ‌వ‌న్‌ (Gandhi Bhavan) లో గురువారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మ‌హేశ్‌గౌడ్ మాట్లాడుతూ ఏఐసీసీ (AICC) సూచన మేరకు జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకిస్తూ సంక్రాంతి తర్వాత 20 నుంచి 30 వ తేదీ వ‌ర‌కు అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలన్నారు. ఉపాధి హామీ చట్టం గొప్పతనం వివరిస్తూ ప్రతి నియోజక వర్గానికి 5 వేల చొప్పున కర పత్రాలు పంపిణీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ప్రతి కరపత్రం గ్రామ గ్రామాన‌, వాడవాడకు చేరాలని అన్నారు. విదేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఉపాధి హామీ పథకం గురించి ఆరా తీశారని, పథకం గురించి వివరాలను తెలుసుకున్నార‌ని చెప్పారు. జీ రామ్ జీ చట్టంతో పేదల హక్కులు కాలరాసి.. భిక్షాందేహీ అనేలా చేద్దామ‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం చూస్తోంద‌ని మండిప‌డ్డారు. డీసీసీ (DCC) ప‌ద‌వి బాధ్య‌త గ‌ల ప‌ద‌వి అన్న ఆయ‌న‌.. జీ రామ్ జీ చట్టానికి నిరసనగా డీసీసీలు గ్రామ సభలు నిర్వహించి తీరాల్సిందేనని స్ప‌ష్టం చేశారు. ఇదే అంశంపై త్వ‌ర‌లోనే సీఎం (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) బహిరంగ సభలు ఉంటాయని తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement