TecMarx Royal Beat Earbuds | రూ.3వేల విలువైన ఇయర్ బడ్స్.. కేవలం రూ.499కే.. లాంచింగ్ సందర్భంగా ఆఫర్..
TecMarx Royal Beat Earbuds | ఒకప్పుడు చాలా మంది ఇయర్‌ఫోన్స్‌ను అధికంగా ఉపయోగించేవారు. ఓవర్ ది ఇయర్ లేదా ఇన్ ఇయర్ టైప్‌లో ఇయర్ ఫోన్స్ ఉండేవి. అయితే ఇప్పుడు కూడా అవి అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని వాడడం చాలా వరకు తగ్గించేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వినియోగదారులకు ఇయర్ బడ్స్ ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి.
Technology | Published On Jan 9, 2026, 12.36 pm IST
TecMarx Royal Beat Earbuds | ఒకప్పుడు చాలా మంది ఇయర్‌ఫోన్స్‌ను అధికంగా ఉపయోగించేవారు. ఓవర్ ది ఇయర్ లేదా ఇన్ ఇయర్ టైప్‌లో ఇయర్ ఫోన్స్ ఉండేవి. అయితే ఇప్పుడు కూడా అవి అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని వాడడం చాలా వరకు తగ్గించేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వినియోగదారులకు ఇయర్ బడ్స్ ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. ఇవి కూడా ఇన్ ఇయర్, ఓవర్ ది ఇయర్ అని రెండు రకాల ఫార్మాట్లలో లభిస్తున్నాయి. అయితే ఇన్ ఇయర్ బడ్స్‌నే చాలా మంది ఎక్కువగా వాడుతుంటారు. వీటిని కొనుగోలు చేయాలంటే కనీసం రూ.1వేయి అయినా వెచ్చించాల్సిందే. కాస్త క్వాలిటీ ఉన్నవి అయితే రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ధర కలిగి ఉన్నాయి. కానీ ఆ కంపెనీ మాత్రం అలాంటి క్వాలిటీ ఇయర్ బడ్స్‌ను కేవలం రూ.499కే అందిస్తోంది. నూతనంగా ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేయడం వల్ల వారు ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలిపారు.
అద్భుతమైన క్వాలిటీ..
టెక్ మార్క్స్ అనే సంస్థ నూతనంగా టెక్ మార్క్స్ రాయల్ బీట్ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. అత్యంత సురక్షితంగా చెవుల్లో ఫిట్ అయ్యే విధంగా ఇన్ ఇయర్ ఫామ్ ఫాక్టర్‌లో ఈ బడ్స్‌ను డిజైన్ చేశారు. అందువల్ల ఈ ఇయర్ బడ్స్‌ను రోజూ ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా వర్కవుట్లు, ట్రావెల్, ఖాళీగా ఉన్న సమయాల్లో ఈ ఇయర్ బడ్స్ ఎంతోగానో పనిచేస్తాయి. ఇక వీటిని బ్లూటూత్ 5.3 ఆధారంగా ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు. 10ఎంఎం డ్రైవర్స్‌ను కలిగి ఉన్నందున ఆడియో క్వాలిటీ బాగుంటుంది. కాల్స్ చేసుకునేందుకు బిల్టిన్ మైక్రోఫోన్‌ను కూడా ఇచ్చారు. ఆన్ డివైస్ కంట్రోల్స్‌ను అందించారు. అందువల్ల ప్లే బ్యాక్, కాల్స్ మాట్లాడుకోవడం చాలా తేలికవుతుంది.
భారీ లాంచింగ్ డిస్కౌంట్..
ఈ ఇయర్‌బడ్స్‌ను ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 30 గంటల వరకు నాన్ స్టాప్‌గా ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఫాస్ట్ చార్జింగ్‌కు సైతం వీటికి సపోర్ట్‌ను అందిస్తున్నారు. కనుక ఈ బడ్స్‌ను వేగంగా చార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఐపీఎక్స్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా వీటికి ఉంది. యూఎస్‌బీ టైప్ సి పోర్టు ద్వారా ఈ ఇయర్ బడ్స్ చార్జింగ్ అవుతాయి. బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేశారు. వీటిపై 6 నెలల వరకు వారంటీని అందిస్తున్నారు. అయితే టెక్ మార్క్స్ రాయల్ బీట్ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ధర రూ.2,999గా ఉంది. అయినప్పటికీ లాంచింగ్ కింద వీటిని భారీ తగ్గింపు ధరకు అందిస్తున్నారు. రూ.499కే వీటిని కొనుగోలు చేయవచ్చు. కనుక క్వాలిటీ ఇయర్ బడ్స్‌ను కొనాలని చూస్తున్న వారికి ఇదొక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ఇక ఈ ఇయర్ బడ్స్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో విక్రయిస్తున్నారు.
సంబంధిత వార్తలు

JBL | విద్యార్థిని చెవిలో పేలిన ఇయర్ బడ్స్.. స్పందించిన జేబీఎల్ కంపెనీ..
ఏప్రిల్ 12, 2026

Amazon Electronics Premiere League Sale | అమెజాన్‌లో ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) ప్రత్యేక సేల్.. భారీ తగ్గింపు ధరలు..
మార్చి 7, 2026

Earbuds | మహిళ చెవిలో పేలిన ఇయర్‌బడ్స్.. వాడడంలో జాగ్రత్తలు తప్పనిసరి..
ఫిబ్రవరి 8, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



