Blood Sugar Levels | డయాబెటిస్ ఉన్నవారు షుగర్ లెవల్స్ పడిపోతే ఏం చేయాలి..?
Blood Sugar Levels | ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం డయాబెటిస్ వ్యాధితో అధిక శాతం మంది బాధపడుతున్నారు. ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే మధుమేహ వ్యాధి వచ్చేది. కానీ ఇప్పుడు యుక్త వయస్సులో ఉన్నవారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బాధితులు పెరిగిపోతున్నారు.
Blood Sugar Levels | ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం డయాబెటిస్ వ్యాధితో అధిక శాతం మంది బాధపడుతున్నారు. ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే మధుమేహ వ్యాధి వచ్చేది. కానీ ఇప్పుడు యుక్త వయస్సులో ఉన్నవారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బాధితులు పెరిగిపోతున్నారు. వారంతా జీవితాంతం మందులను కూడా వాడాల్సి వస్తోంది. అయితే డయాబెటిస్ కోసం మందులను వాడేవారు తరచూ ఓ సమస్యను ఎదుర్కొంటుంటారు. డాక్టర్ ఎంత కచ్చితమైన డోసులో మందులను వాడాలని సూచించినప్పటికీ కొందరికి కొన్ని సార్లు ఆ డోసు కూడా ఎక్కువవుతుంది. దీంతో చాలా త్వరగా షుగర్ లెవల్స్ పడిపోతాయి. ఈ స్థితినే హైపో గ్లైసీమియా అంటారు. షుగర్ లెవల్స్ 70 కన్నా తక్కువగా ఉంటే ఆ స్థితిని హైపోగ్లైసీమియా అంటారు. అయితే దీని బారిన పడిన వారు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ లక్షణాలు ఉంటే..
టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్.. ఏ మధుమేహ వ్యాధి ఉన్నా సరే కొందరికి తరచూ షుగర్ లెవల్స్ పడిపోయి హైపోగ్లైసీమియా వస్తుంది. ఈ సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఉన్నట్లుండి సడెన్‌గా విపరీతమైన చెమటలు పడుతుంటాయి. ముఖ్యంగా మెడ భాగంలో చెమట అధికంగా వస్తుంది. అలాగే వణకడం, తూలి పడిపోయినట్లు అనిపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన, కంగారు, శరీరం అసౌకర్యంగా అనిపించడం, తీవ్రమైన ఆకలి, తల తిరగడం, వికారం, వాంతికి వచ్చినట్లు అనిపించడం, కంటి చూపు ఉన్నట్లుండి మసకగా మారడం, ఏకాగ్రతను కోల్పోవడం, చిరాకు, మాట్లాడలేకపోవడం, తలనొప్పి, అలసట, మూడ్‌లో సడెన్‌గా మార్పులు వంటి లక్షణాలు అన్నీ హైపోగ్లైసీమియా వచ్చిన వారిలో కనిపిస్తాయి.

వీటిని వెంట ఉంచుకోవాలి..
అయితే షుగర్ లెవల్స్ బాగా పడిపోతే చాలా మంది వెంటనే బ్రెడ్, చక్కెర వంటివి తింటారు. దీంతో షుగర్ లెవల్స్ సాధారణ స్థాయికి వస్తాయి. ఇలా తరచూ జరుగుతూనే ఉంటుంది. కానీ కొందరికి ఆయా పదార్థాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండవు. అలాంటి సమయంలో షుగర్ లెవల్స్ డౌన్ అయితే అప్పుడు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. కనుక అలాంటి వారు ముందుగానే కొన్ని పదార్థాలను తమ వద్ద ఉంచుకోవాలి. షుగర్ సాచెట్లు, గ్లూకాన్ డి, చిన్నపాటి కార్బొహైడ్రేట్లు ఉండే స్నాక్స్, గ్లూకో మీటర్ వంటివి వెంట ఉంచుకోవాలి. దీంతో ఎమర్జెన్సీ సమయాల్లో ఇవి బాగా పనిచేస్తాయి. చక్కెర, బ్రెడ్ వంటి పదార్థాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండని వారు ఆ ప్రకారం ఏర్పాటు చేసుకుంటే మెడికల ఎమర్జెన్సీ తలెత్తకుండా ఉంటుంది.
వీటిని తీసుకోకూడదు..
ఇక షుగర్ ఉన్నవారు షుగర్ లెవల్స్ పడిపోయిన సందర్భంలో బిస్కెట్లు, చాక్లెట్లు, టీ, కాఫీ వంటివి తీసుకోకూడదని న్యూఢిల్లీలోని ద్వారకకు చెందిన డయాబెటాలజిస్టు డాక్టర్ బ్రిజ్మోహన్ అరోరా తెలిపారు. వీటి వల్ల అనర్థాలు కలుగుతాయని తెలిపారు. అలాంటి సమయాల్లో ఆయా ఆహారాలను తీసుకుంటే ఆ తరువాత కూడా వాటిని అధికంగా తీసుకునే అవకాశం ఉంటుందని, దీంతో షుగర్ లెవల్స్ బాగా పెరిగే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. కనుక హైపోగ్లైసీమియా తరచూ వస్తుందని అనుకునేవారు పైన సూచించిన విధంగా ఆయా ఆహారాలను, గ్లూకో మీటర్‌ను వెంట ఉంచుకోవాల్సి ఉంటుంది. దీంతో పరిస్థితి ప్రాణాంతకం కాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..






