త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కేసీఆర్ ఆస్తులెన్నో, రేవంత్ ఆస్తులెన్నో విచార‌ణ‌కు సిద్ధం

KTR | కేసీఆర్ పుట్టినప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు మా కుటుంబం ఆస్తులెన్ని, రేవంత్ రెడ్డి పుట్టినప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అతని కుటుంబ ఆస్తులెన్నో అనేదానిపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణకు తాము సిద్ధ‌మ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌వాల్ విసిరారు.

S

Telangana | Published On Sep 17, 2026, 12.55 pm IST

KTR | కేసీఆర్ ఆస్తులెన్నో, రేవంత్ ఆస్తులెన్నో విచార‌ణ‌కు సిద్ధం
Advertisement
  • మొన్న 1000 ఎక‌రాలు అన్న‌డు.. నిన్న 67 ఎక‌రాల‌ని ఒప్పుకుండు
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌వాల్‌

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: కేసీఆర్ పుట్టినప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు మా కుటుంబం ఆస్తులెన్ని, రేవంత్ రెడ్డి పుట్టినప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అతని కుటుంబ ఆస్తులెన్నో అనేదానిపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణకు తాము సిద్ధ‌మ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌వాల్ విసిరారు. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి తన కంపు నోటితో 1,000 ఎకరాల్లో కేసీఆర్ ఫామ్‌హౌజ్ ఉందని బురదజల్లారని మండిప‌డ్డారు. ఇప్పుడేమో అసెంబ్లీ సాక్షిగా కేవలం 67 ఎకరాలే అని ఒప్పుకున్నాడన్నారు. మైసూరు బోండాలో ఎంత మైసూరు ఉంటదో.. నిన్న రేవంత్ మాటల్లో అంతే నిజం ఉందని విమ‌ర్శించారు. గురువారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఇంతకాలం వెయ్యి ఎకరాల ఫామ్‌హౌజ్ అని విషప్రచారం చేసినందుకు కేసీఆర్ గారికి సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ ప్రతి ఎన్నికల సందర్భంగా అఫిడవిట్‌లో అన్ని వివరాలు పొందుపరిచారు. వ్యవసాయం అంటే కేసీఆర్‌కు మొదటి నుంచి మక్కువ ఎక్కువ. భూమిని ఆయన దేవతలా కొలుస్తారు. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా వ్యవసాయం చేశారు. రేవంత్ రెడ్డి లాగా భూమిని ఆటవస్తువుగా చూడలేదు.

చట్ట ప్రకారం కొనుగోలు చేసిన భూములపై బురదజల్లే కుట్రలో రేవంత్ సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. కేసీఆర్ తండ్రికి వందల ఎకరాల భూమి ఉండేది. కేసీఆర్ పుట్టినప్పుడే ఆయన ఇళ్లు రెండు ఎకరాల్లో ఉండేది. చింతమడకలో ఉన్న రెండెకరాల ఇంటిని కూడా ప్రభుత్వ పాఠశాలకు రాసిచ్చారు. ప్రగతి భవన్‌లో 150 బెడ్ రూంలు ఉన్నాయని.. బంగారు బాత్రూంలు ఉన్నాయని చేసిన చిల్లర వ్యాఖ్యల్లో ఎంత నిజం ఉందో.. నిన్న రేవంత్ చేసిన ఆరోపణల్లో కూడా అంతే నిజం ఉంది.

ఆరు గ్యారంటీలు అమల‌య్యాయని మభ్యపెట్టే దాంట్లో ఎంత నిజం ఉందో, రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటల్లో కూడా అంతే నిజముంది. మైసూరు బోండాలో ఎంత మైసూరు ఉంటదో.. నిన్న రేవంత్ మాటల్లో అంతే నిజం ఉంది అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Advertisement
Advertisement