త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Leopard | ఖానాపురంలో చిరుతపులి సంచారం.. ఆందోళ‌న‌లో స్థానికులు

Leopard | తెలంగాణ వ్యాప్తంగా చిరుత పులుల సంచారం అధిక‌మైంది. ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతాల్లో సంచరించాల్సిన పులులు.. జ‌నావాసాల్లోకి వ‌స్తున్నాయి. దీంతో అడవుల‌కు స‌మీపంలోని గ్రామాల్లో చిరుత పులులు సంచ‌రిస్తుండ‌డంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

S

Telangana | Published On Jun 28, 2026, 2.51 pm IST

Leopard | ఖానాపురంలో చిరుతపులి సంచారం.. ఆందోళ‌న‌లో స్థానికులు
Advertisement

Leopard | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా చిరుత పులుల సంచారం అధిక‌మైంది. ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతాల్లో సంచరించాల్సిన పులులు.. జ‌నావాసాల్లోకి వ‌స్తున్నాయి. దీంతో అడవుల‌కు స‌మీపంలోని గ్రామాల్లో చిరుత పులులు సంచ‌రిస్తుండ‌డంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

తాజాగా వ‌రంగ‌ల్ జిల్లా ఖానాపురం మండ‌ల ప‌రిధిలోని ఖానాపురం, కొత్తూరు గ్రామాల ప‌రిధిలో ఓ చిరుత పులి సంచారం చేస్తోంది. రెండు గ్రామాల స‌రిహ‌ద్దుల్లో ఉన్న పామాయిల్ తోట‌లో స్థానిక రైతులు చిరుత పాద‌ముద్ర‌ల‌ను గుర్తించారు. ఈ క్ర‌మంలో అక్క‌డ అట‌వీశాఖ అధికారులు సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేసి చిరుత క‌ద‌లిక‌ల‌ను గుర్తించారు. చిరుత సంచ‌రిస్తుంద‌ని నిర్ధార‌ణ కావ‌డంతో స‌మీప గ్రామాల ప్ర‌జ‌ల‌ను అట‌వీశాఖ అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు.

Advertisement
Advertisement