Lemon | రికార్డు స్థాయికి నిమ్మ ధర.. ఒక్క కాయ ఎంతో తెలుసా?
Lemon | రాష్ట్రంలో నిమ్మకాయల (Lemon) ధరలు రికార్డు స్థాయికి చేరాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు నిమ్మకాయ కొనాలంటేనే భయపడిపోతున్నారు.
Lemon | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో నిమ్మకాయల (Lemon) ధరలు రికార్డు స్థాయికి చేరాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు నిమ్మకాయ కొనాలంటేనే భయపడిపోతున్నారు. మూడు వారాల క్రితం వరకు కిలో నిమ్మకాలయ ధర రూ.50 ఉండగా, ప్రస్తుతం మారెట్లో రూ.200 నుంచి రూ.240 వరకు పలుకుతున్నది. దిగుబడి పడిపోవడంతోపాటు, ఎండల తీవ్రత పెరుగడంతో ప్రజలు శీతల పానీయాలు, ముఖ్యంగా నిమ్మరసం వైపు మొగ్గుచూపుతుండటంతో డిమాండ్ మరింత పెరింది. దీంతో వ్యాపారులు, రైతులు ఒక్కో నిమ్మకాయ రూ.10కు అమ్ముతున్నారు. గత పదేండ్లలో ఇంత ధర ఎన్నడూ లేదని, ఇదే రికార్డు స్థాయి ధర అంటున్నారు.
సూర్యాపేట జిల్లాతోపాటు నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, నార్కట్‌పల్లి, చిట్యాల, కట్టంగూర్, గుర్రంపోడు, పెద్దవూర వంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు నిమ్మకాయలు దిగుమతి అవుతాయి. కానీ మార్చి నెల నుంచే సరఫరా దాదాపు సగానికి తగ్గిపోయిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఢిల్లీ మారెట్, ఈశాన్య ప్రాంతాల్లో డిమాండ్ పెరిగి అక్కడ ఒక నిమ్మకాయ రూ.5 వరకు ధర పలుకగా, హైదరాబాద్ ఇతర రిటైల్ మార్కెట్లలో ధర రూ.10 పలుకుతున్నది. ఏప్రిల్‌లోనే ఈ స్థాయి ధరలుంటే, మే నెలలో నిమ్మ ధరలు కిలో రూ.250 దాటవచ్చని మారెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



