Nagarigari Preetham | కేటీఆర్! మేం బ్లడ్ శాంపిల్స్ ఇస్తున్నం.. డాక్టర్లను మీ ఇంటికీ పంపుతున్నం
Nagarigari Preetham | డ్రగ్స్ టెస్ట్ (Drug Test) కోసం తామంతా బ్లడ్ శాంపిల్స్ ఇస్తున్నామని.. కేటీఆర్ (KTR) ఇంటికి కూడా డాక్టర్లను పంపిస్తున్నామని కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగరిగారి ప్రీతమ్ అన్నారు. వైట్ ఛాలెంజ్‌ను స్వీకరించి బీఆర్ఎస్ నాయకులంతా శాంపిల్స్ ఇవ్వాలన్నారు.
- వైట్ ఛాలెంజ్‌ను స్వీకరించి బీఆర్ఎస్ నాయకులంతా శాంపిల్స్ ఇవ్వాలి
- మీ చుట్టున్నోళ్లకు డ్రగ్స్ పాజిటివ్ వొచ్చింది
- రాహుల్ వెంటున్నోళ్లకు రాలే
- సీఎంపై మర్యాద తప్పితే బద్దలు బాసింగాలైతయ్
- కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగరిగారి ప్రీతమ్ బిగ్ వార్నింగ్
Nagarigari Preetham | త్రినేత్ర న్యూస్: డ్రగ్స్ టెస్ట్ (Drug Test) కోసం తామంతా బ్లడ్ శాంపిల్స్ ఇస్తున్నామని.. కేటీఆర్ (KTR) ఇంటికి కూడా డాక్టర్లను పంపిస్తున్నామని కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగరిగారి ప్రీతమ్ అన్నారు. వైట్ ఛాలెంజ్‌ను స్వీకరించి బీఆర్ఎస్ నాయకులంతా శాంపిల్స్ ఇవ్వాలన్నారు. బ్లడ్ శాంపిల్స్‌ను టెస్ట్ కోసం ల్యాబ్‌కు పంపుతున్నామని తెలిపారు. కేటీఆర్ చుట్టున్నోళ్లకు డ్రగ్ పాజిటివ్ వచ్చిందని.. రాహుల్ వెంటున్నోళ్లకు రాలేదని పేర్కొన్నారు. రాహులంత ఫిట్‌నెస్ నాయకుడు దేశంలో ఎవరూ లేరన్నారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిపోర్టులొచ్చాక అందరికీ పంపిస్తామన్నారు.
చరణ్ కౌశిక్ యాదవ్‌తో కలిసి బ్లడ్ శాంపుల్స్ ఇచ్చాం. టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపుతున్నాం. తెలంగాణ మరో పంజాబ్‌లా మారుతుందని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి నాడు వైట్ ఛాలెంజ్ విసిరారు. బల్మూరి వెంకట్ పై మాట్లాడిన పాటిమీది జగన్మోహన్ రావు ఇంటి ముందు ఓ మహిళ ధర్నా చేసింది. చిరుమళ్ల రాకేశ్ గ్లోబరీనా సంస్థను తెచ్చి ఇంటర్ విద్యార్థుల జీవితాలను నాశనం చేశారు. దూదిమెట్ల బాలరాజు యాదవ్ మహారాష్ట్ర గొర్రెల స్కామ్ చేశారు.
టికెట్ వస్తుందని క్రిశాంక్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయన తన సొంత మామ గొంతు కోశారు. క్రిశాంక్ ఇంట్లో ఉండి పోలీసులు వచ్చినప్పుడు స్కిట్ లు చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ ఓటమి ఖాయం అని తెలుసుకుని పెంపుడు కుక్కలను పంపిస్తున్నారు. కేటీఆర్ ఇంటికి డ్రగ్స్ శాంపుల్స్ తీసుకోవడానికి నేనే డాక్టర్లను పంపిస్తున్నా. కేటీఆర్‌కు ఇల్లు లేదు.. కానీ వందల రూమ్స్ ఉన్న హోటల్స్ ఉన్నాయి.
మా ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడితే మీ బద్దలు బాసింగాలు అవ్వడం ఖాయం. రాహుల్ గాంధీ లాంటి ఫిట్‌నెస్ ఉన్న నాయకుడు దేశంలో ఎవరూ లేరు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ ను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సీఎం రేవంత్ రెడ్డి నిర్మిస్తున్నారు.
కేటీఆర్ జైలుకే..
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కళలు కంటున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు దళితులు వెళ్తే పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దళిత నాయకులు దీనిపై సమాధానం చెప్పాలి. పసుపు నీళ్లతో శుద్ధి చేయడం ఏంటి? బీఆర్ఎస్ చేసే సోషల్ మీడియా విష ప్రచారాలను నమ్మకండి. మహిళా జర్నలిస్టును పోలీసులు ఇబ్బంది పెట్టి ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ నివారణకు ఈగల్ ను ఏర్పాటు చేసింది. డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి కేటీఆర్ కు అభ్యంతరం ఎందుకు? రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరితే కేటీఆర్ పారిపోయారు. త్వరలోనే కేటీఆర్ జైలుకు వెళ్తారు అని ప్రీతమ్ జోస్యం చెప్పారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Minister Vivek | హైదరాబాద్ - మియోషి సిస్టర్ సిటీ స్నేహ బంధానికి 20 ఏళ్లు
- ●Mallikarjun Kharge | దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ.. సీజేఐని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా
- ●Errabelli Dayakar Rao | ఆస్తులను లాక్కునే పనిలో సీఎం రేవంత్ ప్రభుత్వం
- ●Preethi Asrani | దీపావళికి థియేటర్లలోకి విజయ్ ఆంటోనీ నాన్న కుట్టి - హీరోయిన్గా హైదరాబాదీ బ్యూటీ
- ●Jaggareddy | ఛత్రపతి శివాజీని రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ వాడుకుంటుంది : జగ్గారెడ్డి
- ●PM Modi | పట్టణీకరణ సవాల్ కాదు.. అవకాశం

Minister Vivek | హైదరాబాద్ - మియోషి సిస్టర్ సిటీ స్నేహ బంధానికి 20 ఏళ్లు

Mallikarjun Kharge | దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ.. సీజేఐని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా

Errabelli Dayakar Rao | ఆస్తులను లాక్కునే పనిలో సీఎం రేవంత్ ప్రభుత్వం

Preethi Asrani | దీపావళికి థియేటర్లలోకి విజయ్ ఆంటోనీ నాన్న కుట్టి - హీరోయిన్గా హైదరాబాదీ బ్యూటీ



