KTR | సోనియా ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదు?
KTR | సోనియా గాంధీ (Sonia Gandhi) గుండెల్లో తెలంగాణ ఉంటే.. ఆమె ఆత్మకథ (Autobiography)లో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు.
- కాంగ్రెస్ నాయకులు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి
- ప్రత్యేక రాష్ట్రం సోనియా దయాభిక్ష కాదు.. ఇక్కడి ప్రజల పోరాట ఫలితం
- వారి రాజకీయ అవసరాల కోసమే రాష్ట్రమిచ్చారు
- ఆమె ఆత్మల, గుండెల్ల కూడా తెలంగాణ లేదు
- సోనియా గాంధీ ఆత్మకథపై కేటీఆర్ సంచలన కామెంట్స్
KTR | త్రినేత్ర న్యూస్: సోనియా గాంధీ (Sonia Gandhi) గుండెల్లో తెలంగాణ ఉంటే.. ఆమె ఆత్మకథ (Autobiography)లో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. సోనియమ్మే తెలంగాణ ఇచ్చిందని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఎవరి దయాభిక్ష కాదని.. ఇక్కడి ప్రజల పోరాట ఫలితమని నొక్కి చెప్పారు. రాజకీయ అవసరాల కోసమే రాష్ట్రమిచ్చిన సోనియా గుండెల్లో, ఆత్మల కూడా ‘తెలంగాణ’ లేదని తేల్చి చెప్పారు. సోనియా ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం కాంగ్రెస్ ప్రచారంలోని డొల్లతనాన్ని బయటపెట్టిందన్నారు.
రాష్ట్ర రావడానికి కారణమిదే..
కేసీఆర్ నాయకత్వంలో సాగిన ప్రజా ఉద్యమమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అసలు కారణం. తెలంగాణ ప్రజలు సృష్టించిన రాజకీయ అనివార్యతకు తలొగ్గే కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఉద్యమ ఉప్పెనలో కొట్టుకుపోతామన్న భయంతోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణపై కాంగ్రెస్‌కు ఎన్నడూ నిజమైన ప్రేమ లేదు. రాజకీయ అవసరాల కోసమే రాష్ట్రం ఏర్పాటు చేశారు. తెలంగాణ చరిత్రను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవాలని చూడటం సిగ్గుచేటు.
పీవీ నరసింహారావుపై ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్న కాంగ్రెస్ నేతలకు వాణీదేవి గట్టి సమాధానం చెప్పారు. పీవీపై అంత ప్రేమ ఉంటే ఆయన అంత్యక్రియలను ఢిల్లీలో ఎందుకు నిర్వహించలేదని వాణీదేవి ప్రశ్నించారు. తెలంగాణ నాయకత్వం, ప్రజల పట్ల సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ నిజమైన అభిమానం లేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ఎప్పుడూ రాజకీయ అవసరాల కోణంలోనే చూసింది.
తెలంగాణ సాధనలో ప్రజల త్యాగాలను, కేసీఆర్ నాయకత్వాన్ని కాంగ్రెస్ విస్మరించే ప్రయత్నం చేస్తున్నది. కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, పోరాటాలు, కేసీఆర్ నాయకత్వంలోని ఉద్యమ ఫలితమే స్వరాష్ట్రం. తెలంగాణ ఉద్యమ చరిత్రను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ చెరిపేయలేదు.
హామీలు చూస్తే చక్కెరొస్తది
మూసీ సుందరీకరణ విషయంలో ఇప్పటివరకు డీపీఆర్ లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎవరికి ఇప్పటివరకు కాంట్రాక్టులు వచ్చాయో ప్రభుత్వం చెప్పాలి. కాంగ్రెస్ 420 హామీలు చూస్తే చక్కెర వచ్చి పడిపోవాల్సిందే. ఎన్నికల 6 నెలల ముందు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే మళ్ళీ గెలవచ్చు అని ప్రభుత్వం భ్రమలో ఉంది. డీపీఆర్ తిరిగి రావడం అంటేనే ప్రభుత్వం పనితనం తెలుస్తుంది.
నా మీద అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ 8వేల ఎకరాలు ఆక్రమించారని చెప్పారు. రెండు నెలలు అవుతుంది ఎక్కడ నిరూపించారు.. సిగ్గుండాలి ముఖ్యమంత్రికి. వందల కోట్లు పెట్టి మిస్ వరల్డ్ పోటీలు, మెస్సీతో ఫుట్ బాల్ ఆటలు పెట్టిన ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చెప్పాలి. చిత్తశుద్ధి ఉంటే ఈ మూడేళ్లలో ఎన్ని సంస్థలు వచ్చాయి ఎన్ని కోట్లు వచ్చాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సీఎం 119 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి ఎక్కడైన సభ పెట్టుకోవచ్చు. జనం చూడరు.
కేసీఆర్‌కు సెపరేట్‌గా వెళ్తలేవ్
కాళేశ్వరం ప్రజల ప్రాజెక్ట్..పేరు మార్చడం అంటే సిగ్గుచేటు. మూడేళ్లలో ప్రాజెక్ట్ ను పండబెట్టారు. ఆయన పేరు మారిస్తే మేం వచ్చాక మార్చి శునకానందం పొందుతున్నరు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మేం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నాయకుల పేర్ల మీద ఉన్న ప్రాజెక్ట్ ల పేర్లు మారుస్తాం. 67 ఎకరాల్లో రైతులకు వచ్చిన నీళ్లు కేసీఆర్ కూడా వెళ్తున్నాయి.. ఆయనకి సెపరేట్‌గా వెళ్ళడం లేదు. ప్రజాస్వామ్యం గురించి సుద్దులు చెప్పిన రాహుల్, ప్రతిపక్షాల మీద ప్రెస్‌మీట్ పెట్టినా కేసులు ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలి. దీక్ష దివస్ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో స్పూర్తి సభలు నిర్వహిస్తాం. ఉమ్మడి కరీంనగర్ లో సభ నిర్వహిస్తాం. మే అక్కడ పాల్గొంటాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
భారత్ సమ్మిట్‌తో సాధించిందేమిటి?
కొడంగల్‌కు రూ.9 వేల కోట్లు తరలించారు. మేడిగడ్డ నీటిని వినియోగించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రజాధనాన్ని దుబారా చేస్తోంది. రూ.100 కోట్లతో భారత్ సమ్మిట్ నిర్వహించి ప్రభుత్వం సాధించిందేమిటి? ఈ కార్యక్రమం వల్ల రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.
కొడంగల్ నియోజకవర్గానికి సుమారు రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులు కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అవసరాలను కూడా ప్రభుత్వం సమానంగా పరిగణనలోకి తీసుకోవాలి. మేడిగడ్డ బ్యారేజీలో అందుబాటులో ఉన్న నీటిని ఒడిసిపట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. మరోవైపు మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సుమారు 10 టీఎంసీల నీరు అవసరమవుతుంది. ఈ పరిస్థితుల్లో మూసీ సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం సరైన నిర్ణయం కాదు. రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో భారీ వ్యయంతో మూసీ సుందరీకరణ చేపట్టాలనుకోవడం ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రశ్నలు లేవనెత్తుతోందని కేటీఆర్ విమర్శించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






