త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Koushik Yadav | కేటీఆర్ నిరుద్యోగుల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌రు

Koushik Yadav | కాంగ్రెస్‌కి డెత్‌ డిక్లరేషన్ రాయాల‌నుకొని కేటీఆర్‌ నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశార‌ని లైవ్ స్టాక్ ఏజెన్సీ ఛైర్మెన్ చరణ్ కౌశిక్ యాదవ్ ఆరోపించారు. నిరుద్యోగుల అంశానికి సంబంధించి అసెంబ్లీ వేదికగా చ‌ర్చించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంద‌న్నారు.

S

Telangana | Published On Jul 19, 2026, 1.08 pm IST

Koushik Yadav | కేటీఆర్ నిరుద్యోగుల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌రు
Advertisement
  • కాంగ్రెస్‌కు డెత్ డిక్ల‌రేష‌న్ రాయాలని చూశారు
  • మీడియా స‌మావేశంలో లైవ్ స్టాక్ ఏజెన్సీ ఛైర్మెన్ చరణ్ కౌశిక్ యాదవ్ విమ‌ర్శ‌లు

Koushik Yadav | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్‌కి డెత్‌ డిక్లరేషన్ రాయాల‌నుకొని కేటీఆర్‌ నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశార‌ని లైవ్ స్టాక్ ఏజెన్సీ ఛైర్మెన్ చరణ్ కౌశిక్ యాదవ్ ఆరోపించారు. నిరుద్యోగుల అంశానికి సంబంధించి అసెంబ్లీ వేదికగా చ‌ర్చించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంద‌న్నారు. బీఆర్ఎస్ కంటే 3 రెట్లు అధికంగా కాంగ్రెస్ హయాంలో ఉద్యోగాలు భర్తీ చేశామ‌ని చెప్పారు. రెండు సంవ‌త్స‌రాల్లోనే కాంగ్రెస్ ప్ర‌భుత్వం 67 వేల ఉద్యోగాలు ఇచ్చింద‌న్నారు. ఆదివారం ఆయ‌న గాంధీభ‌వ‌న్‌లో మాట్లాడుతూ బీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు చేశారు.

కాంగ్రెస్‌కి డెత్‌ డిక్లరేషన్ రాయాల‌నుకొని కేటీఆర్‌ నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీకు లేకుండా గ్రూప్ -1 ఉద్యోగాలు భర్తీ చేశాం. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీక్ అయింది నిజం కాదా? విద్యార్థులు చనిపోతే లవ్ అఫైర్‌తో చనిపోయార‌ని కేసీఆర్ మాట్లాడింది వాస్తవం కదా? కేటీఆర్ నిరుద్యోగులతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని కౌశిక్ మండిప‌డ్డారు.

గత బీఆర్ఎస్ ఏం చేసింది.. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది.. అనేది నిరుద్యోగులు కూడా గమనించాలి. నిరుద్యోగుల అంశానికి సంబంధించి అసెంబ్లీ వేదికగా చర్చకి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ కంటే 3 రెట్లు అధికంగా కాంగ్రెస్ హయాంలో ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కృషి చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏజ్ పరిమితి 2 సార్లు పెంచింది అని కౌశిక్ యాద‌వ్ తెలిపారు.

Advertisement
Advertisement