KTR | కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయినట్లు అనిపిస్తోంది : కేటీఆర్
KTR | మహేశ్వరంలో బీఆర్ఎస్ కార్యకర్తల జోష్ చూస్తుంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిపోయిన భావన కలుగుతోందని.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయిపోయారని అనిపిస్తోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్నారు.
KTR | మహేశ్వరంలో బీఆర్ఎస్ కార్యకర్తల జోష్ చూస్తుంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిపోయిన భావన కలుగుతోందని.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయిపోయారని అనిపిస్తోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి సబితమ్మ గెలుపు తథ్యమని తేలిపోయిందని, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసేది పక్కా అన్నారు. బ్రహ్మాండంగా బీఆర్ఎస్ గెలిచేది పక్కా.. రాష్ట్రంలో గులాబీ జెండా ఎగిరేది పక్కా ని చెప్పారు. తెలంగాణ నలుదిశలా ఒకే నినాదం మారుమోగుతోందని, అదే.. కాంగ్రెస్ పోవాలె.. కేసీఆర్ రావాలె అన్నారు. రాష్ట్రంలో వికాసం పోయింది.. విధ్వంసం, విషాదం మాత్రమే మిగిలిందన్నారు. కేసీఆర్ కిట్ పోయింది.. కరెంటు కోతల కాలం వచ్చిందని, రైతుబంధు పోయింది.. రాహుల్ బంధు వచ్చిందని, రాష్ట్రంలో సంక్షేమ పథకాల పాతర.. కుంభకోణాల జాతర నడుస్తోందని విమర్శలు గుప్పించారు. సీఎంగా రేవంత్ ఉన్నా.. ప్రజలు కేసీఆర్ గారినే తలుచుకుంటున్నరని, తెలంగాణలో ఉద్యమంలో మహేశ్వరం ముద్దుబిడ్డ సిరిపురం యాదయ్య ఓయూ వద్ద రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేశారన్నారు.
త్యాగాల స్ఫూర్తితో పాలన..
ఎంతోమంతి అమరవీరుల త్యాగాల స్ఫూర్తితోనే పదేళ్ల పాలన సాగిందని, ప్రజాసంక్షేమం, ప్రగతిపథం.. రెండు జోడెడ్లలా ముందుకు సాగాయన్నారు. ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల ఎవరు నష్టపోయారో ఆలోచించాలని కోరారు. కేసీఆర్‌కు పదవులు కొత్త కాదని, ఎన్నో పదవులను త్యాగం చేశారన్నారు. 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కేసీఆర్ సొంతమని, కేంద్ర కేబినెట్ మంత్రి వరకూ అన్ని పదవుల్లో పనిచేశారని గుర్తు చేశారు. ఇవాళ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు కోలుకోని నష్టం జరిగిందని, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా నిన్న హైదరాబాద్‌కు వచ్చారని, కేసీఆర్ నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను చూసి ఆశ్యర్యపోయారన్నారు. మేఘాలయ సీఎం సంగ్మా నాకు స్వయంగా ఫోన్ చేసి, కేసీఆర్ దార్శనికత అద్భుతమని కొనియాడారన్నారు. ఇంత అద్భుతమైన వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని గుండెలనిండా అభినందించారని తెలిపారు. పోరాటయోధుడే పాలకుడైతే పరిపాలన ఎలా ఉంటుందో ఇదో ఉదాహరణ అని చెప్పారు. నాడు ఉద్యమ నాయకుడికి ప్రజలు పాలనా పగ్గాలు అప్పగిస్తే.. తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారన్నారు.
తెలంగాణ ద్రోహి సీఎం అయ్యిండు..
రాష్ట్రం రాకెట్ వేగంతో దూసుకుపోయే సమయంలో పొరపాటునో, గ్రహపాటునో ఇప్పుడు ఒక తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి అయ్యిండని విమర్శించారు. ఓ పిచ్చోడి చేతిలో రాయి ఉంటే చుట్టుపక్కల ఉన్న వారికి నష్టమని, అదే పిచ్చోడి చేతిలో.. రాష్ట్రం ఉంటే నాలుగు కోట్ల ప్రజలకు నష్టమన్నారు. ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది.. ఓ హిట్లర్ రెడ్డి అని, తనకు హిట్లరే ఆదర్శం అని రేవంతే స్వయంగా ఒప్పుకున్నడన్నారు. ఎవరైనా శ్రీరామచంద్రుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుంటరని.. నరకాసరుడు, రావణాసురుడిని మించిన హిట్లర్.. రేవంత్ రెడ్డికి ఆదర్శమట.. అందుకే ఆయన పేరు.. ఇక నుంచి హిట్లర్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడో పంటకు రైతుబంధు ఎందుకు ఇవ్వరు అని రేవంత్ అడిగిండని గుర్తు చేశారు. ఒక్కరికే పెన్షన్ ఇస్తున్నరు.. నేను కుటుంబంలో ఇద్దరికి ఇస్త అని మాయమాటలు చెప్పిండని ఆరోపించారు. రైతుబంధు రూ.15వేలు చేస్తా అని డైలాగులు కొట్టిండని, 420 అబద్ధాలతో ఆగంచేసి గద్దెనెక్కిండని విమర్శించారు. రైతుబంధు దేవుడెరుగు, కనీసం యూరియాకు రాష్ట్రంలో దిక్కులేదన్నారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నాటి దరిద్రాలన్నీ మళ్లీ దాపురించినై అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
మల్కాజ్‌గిరి పేరే లేదు..
షాపులో కాదు.. యూరియాను యాపులో పెడ్తం అంటున్నారని.. ఇప్పుడు యాప్‌లో యూరియా కాదు కదా.. చివరికి రంగారెడ్డి జిల్లా పేరు లేదు.. మల్కాజ్‌గిరి పేరు లేదని ఆరోపించారు. ఇక్కడ బ్రహ్మాండమైన రైతులున్నా.. రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా ? అంటూ నిలదీశారు. రంగారెడ్డి, మల్కాజ్‌గిరి రైతులకు యూరియా అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఎంత తెలివి ఉన్నదో దీంతో అర్థమైపోతుందని, అసెంబ్లీ ఎన్నికల్లో లెక్కలేనన్ని అబద్ధాలతో మభ్యపెట్టారన్నారు. రేవంత్.. రజనీకాంత్‌ను మించిన డైలాగులు కొట్టాడని, భట్టి కమల్ హసన్‌ను మించి యాక్టింగ్ చేశారని విమర్శించారు. వంద రోజులు గ్యారెంటీ కార్డు జాగ్రత్తగా పెట్టుకోమన్నారని, రెండున్నరేళ్లయినా నాలుక గీసి పరేయడానికి కూడా ఈ గ్యారెంటీ కార్డు పనికి రావడంలేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అసైన్డ్ భూముల పట్టాలిస్తాం అని దగా చేశారన్నారు.
అబద్ధపు మాటలు..
బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులపై కూడా అబద్ధపు మాటటలు చెబుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించిన నాడు రాష్ట్రంపై అప్పు రూ. 72వేల కోట్లని.. పదేళ్లలో చేసిన అప్పు కేవలం రూ. 2.80 లక్షల కోట్లని తెలిపారు. అంటే సంవత్సరానికి 28 వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. కేసీఆర్ అప్పుచేసి 1020 గురుకుల పాఠశాలలు పెట్టారని, ఆరున్నర లక్షల మంది పిల్లలకు లక్షా 20 వేల కోట్ల చొప్పున ఖర్చుపెట్టి అత్యుత్తమ విద్యను అందించారన్నారు. లక్ష కోట్లు ఖర్చుపెట్టి ఆరు దశాబ్దాల కరెంట్ కష్టాలను తీర్చారని చెప్పారు.
తాజావార్తలు
- ●TET 2025 Postponed | టెట్ పరీక్ష వాయిదా.. పేపర్ లీక్ అవడంతో అధికారుల కీలక నిర్ణయం
- ●Telangana Cabinet | జులై 2 వ తేదీన మంత్రివర్గ సమావేశం
- ●Fixed Deposit | బ్యాంకు వర్సెస్ పోస్టాఫీస్.. ఏ ఎఫ్డీ ఎక్కువ వడ్డీని ఇస్తుంది..?
- ●Venkatesh | అఫీషియల్ : వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శకుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ - పోస్ట్‌పోన్ రూమర్లకు చెక్
- ●Snake in Underwear | ఆ పని చేస్తుండగా.. అండర్వేర్లోకి దూరిన పాము.. వీడియో
- ●WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న మరో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. అపరిచిత నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు హెచ్చరికలు..

TET 2025 Postponed | టెట్ పరీక్ష వాయిదా.. పేపర్ లీక్ అవడంతో అధికారుల కీలక నిర్ణయం

Telangana Cabinet | జులై 2 వ తేదీన మంత్రివర్గ సమావేశం

Fixed Deposit | బ్యాంకు వర్సెస్ పోస్టాఫీస్.. ఏ ఎఫ్డీ ఎక్కువ వడ్డీని ఇస్తుంది..?

Venkatesh | అఫీషియల్ : వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శకుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ - పోస్ట్‌పోన్ రూమర్లకు చెక్






