Snake in Underwear | ఆ పని చేస్తుండగా.. అండర్‌వేర్‌లోకి దూరిన పాము.. వీడియో
Snake in Underwear | ఓ యువకుడి అండర్‌వేర్‌లోకి పాము( Snake in Underwear ) దూరింది. ఉత్సాహంగా ఈత( Swim ) కొడుతున్న సమయంలో పాము అండర్‌వేర్‌లోకి దూరడంతో.. అతను ఆందోళనకు గురయ్యాడు.
Snake in Underwear | త్రినేత్ర.న్యూస్ : ఓ యువకుడి అండర్‌వేర్‌లోకి పాము( Snake in Underwear ) దూరింది. ఉత్సాహంగా ఈత( Swim ) కొడుతున్న సమయంలో పాము అండర్‌వేర్‌లోకి దూరడంతో.. అతను ఆందోళనకు గురయ్యాడు. తోటి స్నేహితుడి సహాయంతో పామును అండర్‌వేర్‌లో నుంచి బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఔరియా జిల్లాకు చెందిన ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు ఓ స్విమ్మింగ్ ఫూల్‌కు వెళ్లాడు. ఇక తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉత్సాహంగా ఈత కొడుతున్నాడు. ఉన్నట్టుండి అతని అండర్‌వేర్‌లో పొడవాటి పాము ప్రత్యక్షమైంది. దీంతో సదరు యువకుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. బాధితుడు టవల్ కట్టుకోగా, తోటి మిత్రుడి సహాయంతో పామును అండర్‌వేర్ నుంచి బయటకు తీశారు.
అనంతరం పామును చంపేశారు. ఆ పాము దాదాపు రెండు అడుగుల పొడవు ఉంది. స్విమ్మింగ్ ఫూల్‌లోకి పాము ఎలా వచ్చింది..? అని స్నేహితులు చర్చించుకున్నారు. ఇదొక భయానక ఘటన అని బాధిత యువకుడు పేర్కొన్నాడు. ఆ పాము విష రహితం కావడంతో ప్రాణాలతో బయటపడ్డానని తెలిపాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి.
Snake Found Inside Swimmer’s Underwear at UP Pool, Friends Help Avoid Mishap
Uttar Pradesh: A bizarre incident was reported from Orai, where a snake reportedly entered a young man's underwear while he was swimming in a pool.
According to reports, the snake did not bite the… pic.twitter.com/PTcI2jYyMz
— Atulkrishan (@iAtulKrishan1) June 25, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Dhruv Rathee Tweet on Modi | మొదటిసారి నా మాట విన్నారు.. ప్రధాని జాబ్ వదిలేసి 'వ్లాగర్' అవ్వండి: మోదీపై ధ్రువ్ రాథీ సెటైర్లు
- ●Kavitha | మహిళా బిల్లు తేకపోతే ఓట్లేయమని చెప్పాలి.. ఆ ట్రెండ్ తేవాలి
- ●RS Praveen Kumar | రేవంత్ రెడ్డి నన్ను చంపినా భయపడను.. తేల్చిచెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●FIFA 2026 | తుది అంకానికి చేరిన గ్రూప్ రౌండ్.. నాకౌట్‌కు అర్హత సాధించిన 28 జట్లు.. మిగిలింది నాలుగు బెర్తులే..!
- ●RS Praveen Kumar | నన్ను జైలుకు పంపించినా సరే.. రేవంత్ కుంభకోణాలను వదలను : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Anasuya | ఏడాది గ్యాప్ తర్వాత కొత్త సినిమా సైన్ చేసిన అనసూయ.. సూపర్ హిట్ సీక్వెల్లో...

Dhruv Rathee Tweet on Modi | మొదటిసారి నా మాట విన్నారు.. ప్రధాని జాబ్ వదిలేసి 'వ్లాగర్' అవ్వండి: మోదీపై ధ్రువ్ రాథీ సెటైర్లు

Kavitha | మహిళా బిల్లు తేకపోతే ఓట్లేయమని చెప్పాలి.. ఆ ట్రెండ్ తేవాలి

RS Praveen Kumar | రేవంత్ రెడ్డి నన్ను చంపినా భయపడను.. తేల్చిచెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

FIFA 2026 | తుది అంకానికి చేరిన గ్రూప్ రౌండ్.. నాకౌట్‌కు అర్హత సాధించిన 28 జట్లు.. మిగిలింది నాలుగు బెర్తులే..!






