త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Isak Heien | స్వీడ‌న్‌కు ఎదురుదెబ్బ‌.. టోర్నీకి స్టార్ డిఫెండ‌ర్ దూరం..!

Isak Heien | ఫిఫా ప్రపంచకప్-2026లో నాకౌట్ దశకు చేరిన స్వీడన్ జట్టుకు కీలక సమయంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ డిఫెండర్ ఇసాక్ హియెన్ హ్యామ్‌స్ట్రింగ్ గాయం కార‌ణంగా టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఫ్రాన్స్‌తో జరిగే కీలక నాకౌట్ మ్యాచ్‌కు ముందు స్వీడన్ డిఫెన్స్ విభాగంలో భారీ మార్పులు తప్పని పరిస్థితి ఏర్పడింది.

P

Sports | Published On Jun 27, 2026, 4.20 pm IST

Isak Heien | స్వీడ‌న్‌కు ఎదురుదెబ్బ‌.. టోర్నీకి స్టార్ డిఫెండ‌ర్ దూరం..!
Advertisement

Isak Heien | ఫిఫా ప్రపంచకప్-2026లో నాకౌట్ దశకు చేరిన స్వీడన్ జట్టుకు కీలక సమయంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ డిఫెండర్ ఇసాక్ హియెన్ హ్యామ్‌స్ట్రింగ్ గాయం కార‌ణంగా టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఫ్రాన్స్‌తో జరిగే కీలక నాకౌట్ మ్యాచ్‌కు ముందు స్వీడన్ డిఫెన్స్ విభాగంలో భారీ మార్పులు తప్పని పరిస్థితి ఏర్పడింది. 27 ఏళ్ల ఇసాక్ జపాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఆ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ ఫలితంతో స్వీడన్ గ్రూప్‌లో అత్యుత్తమ ఎనిమిది జ‌ట్ల‌లో ఒకటిగా నిలిచి రౌండ్ ఆఫ్-32కు అర్హత సాధించింది. శనివారం స్వీడిష్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఎస్‌వీఎఫ్‌ఎఫ్) హియెన్ గాయాన్ని ధ్రువీకరించింది. ఎడమ కాలి హ్యామ్‌స్ట్రింగ్‌కు తీవ్రమైన గాయం కావడంతో ఇక ప్రపంచకప్‌లో ఆడే అవకాశం లేదని వెల్లడించింది. చికిత్స, రీహాబిలిటేష‌న్ కోసం తన క్లబ్‌కు తిరిగి వెళ్లనున్నట్లు తెలిపింది.

టీమ్ డాక్ట‌ర్ జోనాస్ వెర్నర్ మాట్లాడుతూ హేయెన్‌కు తీవ్ర స్థాయి హ్యామ్‌స్ట్రింగ్ గాయం అయిందని, పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. దీంతో ఫ్రాన్స్‌తో జరిగే ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో స్వీడన్ డిఫెన్స్ విభాగాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాల్సిన పరిస్థితి వ‌చ్చింద‌ని తెలిపారు. ఈ పరిణామంపై స్వీడన్ ప్రధాన కోచ్ గ్రాహమ్ పోటర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. "హేయెన్ ప్రపంచకప్ ప్రయాణం ఇలా ముగియడం బాధాకరం. అతడికి మా పూర్తి మద్దతు ఉంటుంది. ఈ దశ అత‌నికి క‌ఠిన‌మైందే. మరింత బలంగా తిరిగి వస్తాడనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చారు. జపాన్ ఆటగాడు యుకినారి సుగవార పంపిన ప్రమాదకరమైన క్రాస్‌ను పెనాల్టీ బాక్స్‌లో అడ్డుకునే ప్రయత్నంలో హేయెన్ కండరాలు తీవ్రంగా లాగడంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అతడి స్థానంలో 20 ఏళ్ల టోటెన్‌హామ్ హాట్‌స్పర్ మిడ్‌ఫీల్డర్ లూకాస్ బెర్గ్‌వాల్‌ను బరిలోకి దించారు. అనంతరం జట్టు కెప్టెన్ విక్టర్ లిండెలోఫ్ సెంటర్ బ్యాక్ బాధ్యతలు చేపట్టి డిఫెన్స్ విభాగాన్ని ముందుండి న‌డిపించాడు.

Advertisement
Advertisement