WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న మరో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. అపరిచిత నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు హెచ్చరికలు..
WhatsApp | ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఇటీవలి కాలంలో తన యాప్‌కు అనేక మార్పులు చేసింది. ముఖ్యంగా యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీని మరింత బలోపేతం చేసే దిశగా అనేక అప్ డేట్స్‌ను రిలీజ్ చేసింది. అలాగే యూజర్లు స్కామ్‌లు, సైబర్ దాడులకు గురి కాకుండా రక్షించేందుకు పలు ఫీచర్లను సైతం ప్రవేశపెట్టింది.
Technology | Published On Jun 27, 2026, 4.34 pm IST
WhatsApp | ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఇటీవలి కాలంలో తన యాప్‌కు అనేక మార్పులు చేసింది. ముఖ్యంగా యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీని మరింత బలోపేతం చేసే దిశగా అనేక అప్ డేట్స్‌ను రిలీజ్ చేసింది. అలాగే యూజర్లు స్కామ్‌లు, సైబర్ దాడులకు గురి కాకుండా రక్షించేందుకు పలు ఫీచర్లను సైతం ప్రవేశపెట్టింది. అయితే త్వరలోనే మరో నూతన సెక్యూరిటీ ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. తెలియని ఫోన్ నంబర్ నుంచి వచ్చే మెసేజ్‌లను ఓపెన్ చేసే సమయంలో యూజర్లకు ప్రత్యేక హెచ్చరికను చూపించే ఫీచర్‌ను వాట్సాప్ ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వాట్సాప్ ఫీచర్ అప్‌డేట్ ట్రాకర్ డబ్ల్యూఏ బీటా ఇన్ఫో ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఫీచర్‌ను వాట్సాప్ త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తేనుంది. దీని వల్ల అపరిచితులతో చాటింగ్ చేసే ముందు మరింత జాగ్రత్తగా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
స్క్రీన్‌పై ప్రత్యేక వార్నింగ్ మెసేజ్..
సేవ్ చేయని నంబర్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు చాట్ తెరవకముందే వాట్సాప్ స్క్రీన్‌పై ప్రత్యేక వార్నింగ్ మెసేజ్‌ను యాప్ ప్రదర్శిస్తుంది. ఈ హెచ్చరికలో ఆ ఫోన్ నంబర్ ఏ దేశంలో రిజిస్టర్ అయిందో చూపిస్తుంది. అలాగే ఆ నంబర్ ఇప్పటికే కాంటాక్ట్‌గా సేవ్ చేసి ఉందా లేదా, పంపిన వ్యక్తితో ఏవైనా కామన్ గ్రూప్‌లు ఉన్నాయా అనే వివరాలను కూడా వినియోగదారుడికి తెలియజేస్తుంది. అలాగే స్కామర్లు వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు అడగడానికి లేదా డబ్బు పంపించాలని మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు.. అనే హెచ్చరిక సందేశం కూడా కనిపిస్తుంది. ఈ వివరాలను పరిశీలించిన తర్వాత వినియోగదారు ఆ చాట్‌ను కొనసాగించాలా లేదా రద్దు చేయాలా అనే నిర్ణయం తీసుకోవచ్చు. ముఖ్యంగా, వినియోగదారు తీసుకున్న నిర్ణయం గురించి మెసేజ్ పంపిన వ్యక్తికి ఎలాంటి నోటిఫికేషన్ వెళ్లదు.
త్వరలోనే మరిన్ని ఫీచర్లు..
తెలియని వ్యక్తుల నుంచి వచ్చే స్పామ్ మెసేజ్‌లు, ఆన్‌లైన్ మోసాలు, ఇతర మోసపూరిత ప్రయత్నాలను తగ్గించడంలో ఈ కొత్త ఫీచర్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా వాట్సాప్ మరికొన్ని కొత్త ఫీచర్లపై కూడా పని చేస్తున్నట్లు సమాచారం. హోమ్ స్క్రీన్‌పై నేరుగా పెట్టుకునే ప్రత్యేక వాయిస్ నోట్ విడ్జెట్‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అలాగే ఐఫోన్ వినియోగదారుల కోసం వ్యూ-వన్స్ టెక్స్ట్ మెసేజ్ ఫీచర్‌ను కూడా పరీక్షిస్తున్నట్లు తెలిసింది.
సంబంధిత వార్తలు

WhatsApp | తెలియని నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్‌కు చెక్.. ఈ సింపుల్ సెట్టింగ్ ఆన్ చేస్తే చాలు..
జూన్ 26, 2026

Meta Arena | మెటా నుంచి కొత్త ప్లాట్‌ఫామ్.. డబ్బుతో అవసరం లేని బెట్టింగ్ వేదిక..
జూన్ 24, 2026

Instagram For TV | టీవీలో ఇన్స్టాగ్రామ్.. కొత్త ఫీచర్లతో సోషల్ వీడియో ఎక్స్‌పీరియెన్స్..
జూన్ 23, 2026
తాజావార్తలు
- ●TET 2025 Postponed | టెట్ పరీక్ష వాయిదా.. పేపర్ లీక్ అవడంతో అధికారుల కీలక నిర్ణయం
- ●Telangana Cabinet | జులై 2 వ తేదీన మంత్రివర్గ సమావేశం
- ●Fixed Deposit | బ్యాంకు వర్సెస్ పోస్టాఫీస్.. ఏ ఎఫ్డీ ఎక్కువ వడ్డీని ఇస్తుంది..?
- ●Venkatesh | అఫీషియల్ : వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శకుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ - పోస్ట్‌పోన్ రూమర్లకు చెక్
- ●Snake in Underwear | ఆ పని చేస్తుండగా.. అండర్వేర్లోకి దూరిన పాము.. వీడియో
- ●Isak Heien | స్వీడన్‌కు ఎదురుదెబ్బ.. టోర్నీకి స్టార్ డిఫెండర్ దూరం..!

TET 2025 Postponed | టెట్ పరీక్ష వాయిదా.. పేపర్ లీక్ అవడంతో అధికారుల కీలక నిర్ణయం

Telangana Cabinet | జులై 2 వ తేదీన మంత్రివర్గ సమావేశం

Fixed Deposit | బ్యాంకు వర్సెస్ పోస్టాఫీస్.. ఏ ఎఫ్డీ ఎక్కువ వడ్డీని ఇస్తుంది..?

Venkatesh | అఫీషియల్ : వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శకుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ - పోస్ట్‌పోన్ రూమర్లకు చెక్



