Venkatesh | అఫీషియల్ : వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శకుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ – పోస్ట్‌పోన్ రూమర్లకు చెక్
వెంకటేష్ ఆదర్శ కుటుంబం మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. అక్టోబర్ 2న ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
Entertainment | Published On Jun 27, 2026, 4.44 pm IST
Venkatesh | వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఆదర్శ కుటుంబం మూవీ వాయిదాపడనున్నట్లు గత కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తోన్నాయి. ఇటీవల రిలీజైన ఓ తమిళ సూపర్ హిట్ మూవీ కథ...ఆదర్శ కుటుంబాన్ని పోలి ఉందంటూ వార్తలొస్తున్నాయి. ఈ తమిళ సినిమా కారణంగా ఆదర్శ కుటుంబంలో చాలా సీన్లను రీషూట్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ రీషూట్ల కారణంగా ఈ ఏడాది రిలీజ్ కావాల్సిన వంకటేష్ మూవీ వచ్చే ఏడాదికి వాయిదాపడినట్లు టాక్ వినిపిస్తోంది.
స్పెషల్ పోస్టర్....
ఈ పోస్ట్‌పోన్ రూమర్లకు మేకర్స్ చెక్‌పెట్టారు. అఫీషియల్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను శనివారం ప్రకటించారు. అక్టోబర్ 2న ఆదర్శ కుటుంబం థియేటర్లలోకి రానున్నట్లు వెల్లడించారు. విడుదల తేదీతో పాటు స్పెషల్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు మేకర్స్. ఈ పోస్టర్‌లో వెంకటేష్, శ్రీనిధి శెట్టి భార్యాభర్తలుగా సింపుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. వారి వెనుక ఇద్దరు పిల్లలు ఉండటం ఆసక్తిని పంచుతోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనున్నట్లు పోస్టర్ ద్వారా మేకర్స్ హింట్ ఇచ్చారు.
థ్రిల్లర్ ఎలిమెంట్స్...
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, వాసు, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రైటర్‌గా పనిచేశారు. త్రివిక్రమ్ శైలి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు వెంకటేష్ తరహా కామెడీ కలబోతగా ఆదర్శకుటుంబం ఉండబోతున్నట్లు సమాచారం. అంతర్లీనంగా ఈ సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయట.
నివేదా పేతురాజ్...
ఆదర్శ కుటుంబం సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నారా రోహిత్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. నివేదా పేతురాజ్ స్పెషల్ సాంగ్ చేస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆదర్శ కుటుంబం తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడితో వెంకటేష్ ఓ సినిమా చేయబోతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
A date for every family to remember ❤️
The doors of #AadarshaKutumbam open worldwide on OCTOBER 2nd ✨#AK47OnOCT2nd#AK47 | #Venky77 | #VenkateshXTrivikram
#Trivikram @SrinidhiShetty7 @musicthaman #SRadhaKrishna @dop007 @sreekar_prasad #AsPrakash @kevinkumarrrr… pic.twitter.com/oH45fw8it4— Venkatesh Daggubati (@VenkyMama) June 27, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Anasuya | ఏడాది గ్యాప్ తర్వాత కొత్త సినిమా సైన్ చేసిన అనసూయ.. సూపర్ హిట్ సీక్వెల్లో…
జూన్ 27, 2026

Keerthy Suresh | తిరుమలలో కీర్తి సురేష్ – భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న మహానటి
జూన్ 27, 2026

Trisha – Tamannaah | ఒకే ఫ్రేమ్‌లో త్రిష, తమన్నా – ఖుష్బూ కూతురి పెళ్లిలో ముద్దుగుమ్మల సందడి
జూన్ 27, 2026
తాజావార్తలు
- ●Dhruv Rathee Tweet on Modi | మొదటిసారి నా మాట విన్నారు.. ప్రధాని జాబ్ వదిలేసి 'వ్లాగర్' అవ్వండి: మోదీపై ధ్రువ్ రాథీ సెటైర్లు
- ●Kavitha | మహిళా బిల్లు తేకపోతే ఓట్లేయమని చెప్పాలి.. ఆ ట్రెండ్ తేవాలి
- ●RS Praveen Kumar | రేవంత్ రెడ్డి నన్ను చంపినా భయపడను.. తేల్చిచెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●FIFA 2026 | తుది అంకానికి చేరిన గ్రూప్ రౌండ్.. నాకౌట్‌కు అర్హత సాధించిన 28 జట్లు.. మిగిలింది నాలుగు బెర్తులే..!
- ●RS Praveen Kumar | నన్ను జైలుకు పంపించినా సరే.. రేవంత్ కుంభకోణాలను వదలను : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Anasuya | ఏడాది గ్యాప్ తర్వాత కొత్త సినిమా సైన్ చేసిన అనసూయ.. సూపర్ హిట్ సీక్వెల్లో...

Dhruv Rathee Tweet on Modi | మొదటిసారి నా మాట విన్నారు.. ప్రధాని జాబ్ వదిలేసి 'వ్లాగర్' అవ్వండి: మోదీపై ధ్రువ్ రాథీ సెటైర్లు

Kavitha | మహిళా బిల్లు తేకపోతే ఓట్లేయమని చెప్పాలి.. ఆ ట్రెండ్ తేవాలి

RS Praveen Kumar | రేవంత్ రెడ్డి నన్ను చంపినా భయపడను.. తేల్చిచెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

FIFA 2026 | తుది అంకానికి చేరిన గ్రూప్ రౌండ్.. నాకౌట్‌కు అర్హత సాధించిన 28 జట్లు.. మిగిలింది నాలుగు బెర్తులే..!



