త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కృష్ణా నుంచి ఆంధ్రకు ప్రతిరోజూ 13 టీఎంసీలు

CM Revanth Reddy | CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : కృష్ణా జలాల( Krishna Water )పై ఆంధ్రప్రదేశ్ కట్టిన, కడుతున్న అన్ని ప్రాజెక్టులకు అనుమతులు రావడం బీఆర్ఎస్( BRS Party ) పాపమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తీవ్రంగా విమర్శించారు. శ్రీశైలం( Srisailam ), నాగార్జున సాగర్( Nagarjuna Sagar ) బ్యాక్ వాటర్ నుంచి ప్రతి రోజూ 13.17 టీఎంసీలు తరలించుకుపోయేలా ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టులు దాదాపుగా పూర్తయ్యాయని వీటన్నింటికి అనుమతిచ్చింది కూడా కేసీఆర్ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు.

S

Telangana | Published On Nov 23, 2026, 7.26 pm IST

CM Revanth Reddy | కృష్ణా నుంచి ఆంధ్రకు ప్రతిరోజూ 13 టీఎంసీలు
Advertisement

ఆంధ్ర జల దోపిడీకి కారణం కేసీయారే
చంద్రబాబుకు, జగన్‌ల‌కు లొంగిపోయింది ఆయనే
కృష్ణా కింద ఉన్న ఆంధ్ర ప్రాజెక్టులకు
బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు
2005లో బీఆర్ఎస్ మంత్రులుగా ఉన్నప్పుడే
పోతిరెడ్డిపాడుకు ఆమోదం దక్కింది
వారి తప్పులను మేం సరిదిద్దుతున్నాం
తెలంగాణ హక్కులను కాపాడుతున్నాం
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : కృష్ణా జలాల( Krishna Water )పై ఆంధ్రప్రదేశ్ కట్టిన, కడుతున్న అన్ని ప్రాజెక్టులకు అనుమతులు రావడం బీఆర్ఎస్( BRS Party ) పాపమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తీవ్రంగా విమర్శించారు. శ్రీశైలం( Srisailam ), నాగార్జున సాగర్( Nagarjuna Sagar ) బ్యాక్ వాటర్ నుంచి ప్రతి రోజూ 13.17 టీఎంసీలు తరలించుకుపోయేలా ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టులు దాదాపుగా పూర్తయ్యాయని వీటన్నింటికి అనుమతిచ్చింది కూడా కేసీఆర్ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు వాటర్ గ్రిడ్( Palndu Water Grid ) ప్రాజెక్టుకు నాగార్జున సాగర్ నుంచి నీటి తరలింపుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం బోధి పెవిలియన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. ఆంధ్ర ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతుల చిట్టాను బయటపెట్టారు.

పోతిరెడ్డిపాడు పాపం బీఆర్ఎస్‌దే

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లోని పోతిరెడ్డిపాడు( Pothireddypadu ) నుంచి బనకచర్ల రెగ్యులేటర్‌కు ప్రతి రోజూ 11వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులు తరలించుకునిపోయేలా 2005లో వైఎస్సార్ ప్రభుత్వం జారీ చేసిన జీవోకు బీఆర్ఎస్ మద్దతు ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. "2005-06 బడ్జెట్ సమావేశాల సందర్భంగా పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోయేలా 2005 మార్చిలోనే బడ్జెట్‌లో డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్‌లో పొందుపరిచారు. ఆ రోజు వైఎస్సార్( YSR ) ప్రభుత్వంలో హరీశ్ రావు( Harish Rao ), సంతోష్ రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంత రావు లాంటి బీఆర్ఎస్ నేతలు మంత్రులుగా ఉన్నారు. వారి ఆమోదంతోనే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకునేందుకు మంత్రివర్గం అనుమతి లభించింది. ఆ తర్వాతే బడ్జెట్‌లో నిధులను పొందుపరిచారు. వారు రాజీనామా చేసింది 2005 జూలైలో. జీవో విడుదలైంది 2005 సెప్టెంబర్‌లో" అని సీఎం వివరించారు.

పల్నాడు గ్రిడ్‌కు అనుమతులు 2022లోనే

పల్నాడు వాటర్ గ్రిడ్‌పై బీఆర్ఎస్ చేస్తున్న ఆందోళనల్లో అర్థం లేదని ముఖ్యమంత్రి వివరించే ప్రయత్నం చేశారు. "ఆంధ్రప్రదేశ్‌లో 17,989 కోట్లతో 13 జిల్లాల్లో మంచినీటి కోసం 2022 ఫిబ్రవరి 16 జీవో నంబర్ 56ను విడుదల చేశారు. ఇందులో భాగంగా పల్నాడు ప్రాంతంలో తాగునీటి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 500 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్‌తో కలిపి రూ. 1200 కోట్ల నిధులు ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటిని తీసుకుంటారు. ఇందుకు సంబంధించి జీవో జారీ అయినప్పుడు ఇక్కడ కేసీఆర్( KCR ), అక్కడ జగన్‌( Jagan )లే సీఎంగా ఉన్నారు. దీనికి సంబంధించి కేసీఆర్ ఏనాడూ కృష్ణా రివర్ బోర్డు మేనేజ్‌మెంట్ ( KRMB ) కు ఫిర్యాదు చేయలేదు. బీఆర్ఎస్ ఇచ్చిన ఆమోదంతోనే ఇప్పుడు పల్నాడు వాటర్ గ్రిడ్ పనులు నడుస్తున్నాయి. తమకు ఉన్న నీటి హక్కుల్లో భాగంగానే పల్నాడు గ్రిడ్ వాటర్ ప్రాజెక్టుకు నీటిని తీసుకెళ్తున్నామని ఏపీ వాదిస్తున్నది" అని సీఎం వివరించారు.

సమర్పయామి చేసిందే కేసీయార్

ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాలను తాకట్టు పెట్టి మరణశాసనం రాసింది కేసీఆరే అని ముఖ్యమంత్రి విమర్శించారు. 2014 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆరే.. ఆంధ్ర ప్రాజెక్టుల అనుమతులకు ఆమోదం ఇచ్చారని ఆరోపించారు." శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 797 అడుగుల దిగువ స్థాయి నుంచి నీళ్లు తరలించుకునే రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్నప్పుడు ఎలాంటి అభ్యంతరాలు ప్రకటించకుండా ఆమోదం తెలిపింది కేసీఆర్ కాదా? పరీవాహక ప్రాంతం ఆధారంగా కృష్ణా నదిలో నీళ్లు కేటాయింపు జరిగితే తెలంగాణకు 575 టీఎంసీలు హక్కుగా రావాలి. కానీ మనకు ప్రస్తుతం 299 టీఎంసీలు మాత్రమే దక్కుతున్నాయి. కృష్ణా జలాల్లో 66 శాతం ఆంధ్రకు, 34 శాతం తెలంగాణకు అని సంతకం పెట్టింది కూడా కేసీఆరే. అంతేకాదు.. తుది కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ 2 నుంచి తుది కేటాయింపులు జరిగే వరకు శాశ్వతంగా ఆంధ్రకు 512 టీఎంసీల నీళ్లు దక్కేలా ఒప్పుకున్నది కూడా ఆయనే కదా. బీఆర్ఎస్ అధికారంలోకి రాక ముందు ఆంధ్రప్రదేశ్‌కు రోజూ 4.47 టీఎంసీలు తరలించుకునేలా ప్రాజెక్టులు ఉండేవి. ఈ రోజు అదే ఏపీ ఈ పదేళ్ల కాలంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకొని ప్రతిరోజూ 13.17 టీఎంసీలు తరలించుకుపోయేలా ఏర్పాట్లు చేసుకున్నది. ఇలా కృష్ణా జలాలను సమర్పయామి చేసిందే కేసీఆర్. ఒక నదిని పూర్తిగా తరలించుకుపోయేలా వాళ్లు ప్రాజెక్టులు కట్టారు..కేసీఆర్ సీఎం అయ్యాక రాయలసీమలో 8 ప్రాజెక్టులను నిర్మించారు.. వాయువేగంతో పూర్తి చేశారు.." అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.

కృష్ణా జలాలను మేమే ఎక్కువ తీసుకున్నాం

పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కంటే తమ ప్రభుత్వమే అత్యధికంగా కృష్ణా నది నుంచి నీటిని వాడుకున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. "2023-24లో 208.79 టీఎంసీల కృష్ణా జ‌లాల‌ను ఆంధ్రా తీసుకుంటే 119 టీఎంసీలను తెలంగాణ తీసుకుంది. 2024-25లో 285 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకుంది.. 2026లో తెలంగాణ 268 టీఎంసీలను వినియోగించుకుంది. 2027లో 132 టీఎంసీలు ఏపీ వాడుకుంటే.. 110 టీఎంసీలను తెలంగాణ వాడుకుంది. 2026-27 సంవ‌త్స‌రంలో 45.44 శాతం నీళ్లను తెలంగాణ వినియోగించుకుంది. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, పాలమూరు-రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేయలేదు. కేసీఆర్ హయాంలో భూసేకరణపై 2014 నుంచి అక్టోబర్ 2023 వరకు రూ.11,255 కోట్లు ఖ‌ర్చు చేశారు. మా ప్రభుత్వం రూ.6,765 కోట్లను భూసేకరణకు కేటాయించింది. 45 వేల ఎకరాల భూసేకరణ అవసరం ఉంటే రూ.3,315 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే ప్రాజెక్టులు ఎలా పూర్తి అవుతాయి. రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి అయ్యేవి. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు బరితెగించి నీళ్లు తరలించుకుపోయే అవకాశం ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్ జలదోపిడీకి కారణం కేసీఆర్" అని ముఖ్యమంత్రి ముగించారు.

Advertisement
Advertisement