KRMB | కేఆర్ఎంబీలో పల్నాడు ప్రస్తావనే లేదు
KRMB | సోమవారం జలసౌధలో నిర్వహించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు( KRMB ) సమావేశంలో పల్నాడు వాటర్ గ్రిడ్( Palnadu Water Grid ) ప్రస్తావనే రాలేదని ఏపీ ఇంజినీర్-ఇన్-చీఫ్ నరసింహమూర్తి తెలిపారు. కేవలం కృష్ణా నది( Krishna River ) నీటి కేటాయింపులపైనే చర్చ జరిగిందన్నారు.
KRMB | త్రినేత్ర న్యూస్ : సోమవారం జలసౌధలో నిర్వహించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు( KRMB ) సమావేశంలో పల్నాడు వాటర్ గ్రిడ్( Palnadu Water Grid ) ప్రస్తావనే రాలేదని ఏపీ ఇంజినీర్-ఇన్-చీఫ్ నరసింహమూర్తి తెలిపారు. కేవలం కృష్ణా నది( Krishna River ) నీటి కేటాయింపులపైనే చర్చ జరిగిందన్నారు. అయితే ఈ సమావేశంలో నీటి కేటాయింపులు ఫైనల్ కాలేదు.
ఎందుకంటే ఏపీ ప్రభుత్వం తమ అవసరాల నిమిత్తం 19 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరగా, తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు తమకు 21 టీఎంసీలు అవసరమని ప్రతిపాదించింది. ఇరు రాష్ట్రాలు తమ అవసరాల మేరకు నీటి విడుదలకు పట్టుబట్టడంతో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో తెలంగాణ అధికారులు పల్నాడు వాటర్ గ్రిడ్ అంశాన్ని లేవనెత్తగా, ఆ పనులను గ్రామీణ నీటి సరఫరా శాఖ పర్యవేక్షిస్తోందని, తమ వద్ద ఆ వివరాలు లేవని ఏపీ జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ రమేశ్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం నాగార్జున సాగర్‌లో మొత్తం 45 టీఎంసీల నీరు ఉంది. వచ్చే జులై వరకు సాగర్ నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ తాగునీటి కోసమే జులై వరకు 15 టీఎంసీలు అవసరమవుతాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సాగర్ నీళ్లు తాగునీరు, కుడి, ఎడమ కాల్వల కోసమే వాడాలని చెప్పాం. కృష్ణా డెల్టాకు చుక్క నీరు కూడా ఇచ్చే అవకాశం లేదని చెప్పాం. హైదరాబాద్ తాగునీరు పోను.. మిగిలిన 25 టీఎంసీలపై చర్చిద్దామని చెప్పాం. ఏపీకి పులిచింతలలో 42 టీఎంసీలు ఉన్నాయి. పట్టిసీమ నుంచి కూడా కృష్ణా డెల్టాకు నీళ్లు వస్తున్నాయి. సాగర్‌లో ఉన్న 45 టీఎంసీల్లో 5 టీఎంసీలు ఆవిరయ్యే అవకాశం ఉంది అని రమేశ్ బాబు పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sree Vishnu | "ఫ్యామిలీ ప్యాక్" టీజర్ రిలీజ్ - సంక్రాంతి బరిలో శ్రీవిష్ణు కామెడీ మూవీ
- ●Jensen Huang Reinstated Nvidia CEO | ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సెన్ హువాంగ్.. 24 శాతం ఎగబాకిన షేర్లు!
- ●Raashi Khanna | ఓ వైపు సినిమా - మరోవైపు వెబ్‌సిరీస్ - బ్రేక్ లేకుండా కష్టపడుతోన్న రాశీఖన్నా
- ●Bromate in Packaged Drinking Water | మనం తాగే మినరల్ వాటర్ బాటిళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలా? అసలు బిస్లెరీ వివాదం ఏంటి?
- ●RERA | ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులకు రేరా అనుమతులు
- ●Google Trends India 2026 | ఆరోగ్యం, విహారయాత్రలపై భారతీయులకు పెరుగుతున్న ఆసక్తి.. గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్ ఇవే..

Sree Vishnu | "ఫ్యామిలీ ప్యాక్" టీజర్ రిలీజ్ - సంక్రాంతి బరిలో శ్రీవిష్ణు కామెడీ మూవీ

Jensen Huang Reinstated Nvidia CEO | ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సెన్ హువాంగ్.. 24 శాతం ఎగబాకిన షేర్లు!

Raashi Khanna | ఓ వైపు సినిమా - మరోవైపు వెబ్‌సిరీస్ - బ్రేక్ లేకుండా కష్టపడుతోన్న రాశీఖన్నా

Bromate in Packaged Drinking Water | మనం తాగే మినరల్ వాటర్ బాటిళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలా? అసలు బిస్లెరీ వివాదం ఏంటి?





