త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రేవంత్ రెడ్డి చేస్తున్న జ‌ల‌ద్రోహానికి కేఆర్ఎంబీ మినిట్సే మ‌రో సాక్ష్యం!

Harish Rao | రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ సమావేశం మినిట్సే మరో సాక్ష్యం అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Nov 25, 2026, 7.42 pm IST

Harish Rao | రేవంత్ రెడ్డి చేస్తున్న జ‌ల‌ద్రోహానికి కేఆర్ఎంబీ మినిట్సే మ‌రో సాక్ష్యం!
Advertisement

ఏపీ ప్ర‌తిపాదించిన అక్ర‌మ ప‌ల్నాడు ప్రాజెక్టుపై
రేవంత్ స‌ర్కార్ క‌నీసం స్పందించ‌లేదు
ఏపీ అక్ర‌మ ప్రాజెక్టుపై సీఎం ఎందుకు గ‌ళ‌మెత్త‌లేదు..?
రాష్ట్ర నీటి హ‌క్కుల‌ను కాపాడాల్సిన ముఖ్య‌మంత్రే ఏపీకి లొంగిపోయాడు
కాంగ్రెస్ ప్ర‌భుత్వ తీరుపై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జం

Harish Rao | త్రినేత్ర న్యూస్ : రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ సమావేశం మినిట్సే మరో సాక్ష్యం అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీ ప్రతిపాదించిన అక్రమ పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం ప్రస్తావించకపోవడం ఏపీకి వరంగా మారితే.. తెలంగాణకు శాపంగా పరిణమిస్తోంది అని పేర్కొన్నారు.

చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఉండదు. రేవంత్ రెడ్డి.. నాగార్జునసాగర్ జలాలను తరలించేందుకు ఏపీ నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు గురించి ఎందుకు ప్రశ్నించలేదు? ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎందుకు గళమెత్తలేదు? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

నాడు ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో గోదావరి జలాలను తరలించే బనకచర్ల ప్రాజెక్టుపై నిలదీయకుండా జలద్రోహం చేశారు. నేడు హైదరాబాద్ వేదికగా జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో కృష్ణా జలాలను తరలించే పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రశ్నించకుండా మరోసారి జలద్రోహానికి పాల్పడ్డార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

నాడు బనకచర్ల.. నేడు పల్నాడు!

ప్రాజెక్టులు మారుతున్నాయి.. వేదికలు మారుతున్నాయి.. కానీ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే రేవంత్ రెడ్డి వైఖరి మాత్రం మారడం లేదు! తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి లొంగిపోయి, ఆ రాష్ట్ర ప్రయోజనాలకు సహకరిస్తుంటే తెలంగాణ ప్రయోజనాలకు రక్షణ ఎవరు? మేధావులు, తెలంగాణవాదులు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేఆర్ఎంబీ సమావేశంలో పల్నాడు ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదని ఏపీ ఇంజనీర్లే చెబుతుంటే.. సమావేశంలో పల్నాడు ప్రాజెక్టుపై చర్చించామని గొప్పగా ప్రచారం చేసుకున్న వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? నాడైనా నేడైనా నీళ్ల విషయంలో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది, చేస్తున్నది కాంగ్రెస్సే. రేవంత్ రెడ్డి.. నీ అసలు రంగు బయటపడింది. నీ నిజస్వరూపం బట్టబయలైంది. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి నువ్వు చేస్తున్నది చారిత్రక ద్రోహం. ఈ ద్రోహాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించదు అని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement