త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KP Vivekanand | ప్రజలను మోసం చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్న‌రు.. కాంగ్రెస్ స‌ర్కారుపై కేపీ వివేకానంద ఫైర్‌

KP Vivekanand | కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదులపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింద‌ని, ప్రజలను మోసం చేసి ప్రభుత్వాన్ని న‌డుపుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శాసన సభలో కృష్ణా జలాలపై జరిగిన చర్చ సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చి సభను తప్పుదోవ పట్టించిన సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలని అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు.

A

Telangana | Published On Jan 5, 2026, 7.52 pm IST

KP Vivekanand | ప్రజలను మోసం చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్న‌రు.. కాంగ్రెస్ స‌ర్కారుపై కేపీ వివేకానంద ఫైర్‌
Advertisement

KP Vivekanand | కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదులపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింద‌ని, ప్రజలను మోసం చేసి ప్రభుత్వాన్ని న‌డుపుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శాసన సభలో కృష్ణా జలాలపై జరిగిన చర్చ సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చి సభను తప్పుదోవ పట్టించిన సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలని అసెంబ్లీ సెక్రటరీ తిరుపతికి ఎమ్మెల్యేలు కోవా ల‌క్ష్మి, విజ‌యుడు, అనిల్ జాద‌వ్‌తో క‌లిసి ఫిర్యాదు చేశారు. అనంత‌రం అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద మాట్లాడారు. సీఎం అసెంబ్లీలో ఆన్ రికార్డు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు.

సీఎం మాట‌లు న‌మ్మే ప‌రిస్థితిలో ప్ర‌జ‌లు లేరు..

రేవంత్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, దేవుళ్లపై ఒట్టు వేసి రేవంత్ రెడ్డి మోసం చేశార‌ని మండిప‌డ్డారు. పాలమూరు, రంగారెడ్డిపై చర్చ సందర్భంగా దేవుడిపై ఆన అన్నార‌ని, రేవంత్ రెడ్డి ప్రజల్లో విశ్వాసం కోల్పోయార‌న్నారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పచ్చి అబద్దాలు చెప్పార‌ని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నేనే ఆపానని రేవంత్ రెడ్డి అంటున్నారని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎవరు ఆపారో హరీశ్‌ రావు స్పష్టంగా చెప్పార‌న్నారు. రేవంత్ రెడ్డి తల, మొహం ఎక్కడ పెట్టుకుంటార‌ని.. సీఎం అపెక్స్ కౌన్సిల్ లో ఉన్న అంశాలను తప్పుదోవ పట్టించార‌ని మండిప‌డ్డారు. కృష్ణా నదీ జలాలపై శాశ్వత ఒప్పందం అన్నట్లుగా ప్రజలను, సభను నమ్మించే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడార‌ని.. రేవంత్ రెడ్డిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామ‌న్నారు.

అబ‌ద్ధాలు ఆడి సీఎం అడ్డంగా దొరికిపోయిండు..

సీఎం రెడ్డి అబద్దాలు మాట్లాడి అడ్డంగా దిరికిపోయార‌ని.. ఆయ‌న దిగజారి మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. ముఖ్య‌మంత్రిపై ప్రివిలేజ్ మోషన్ అంగీకరించాలని స్పీకర్‌ను కోరున్నామ‌న్నారు. రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పి లెంపలు వేసుకోవాల‌ని.. అసెంబ్లీలో మాట్లాడే హక్కులను బీఆర్ఎస్ కోల్పోలేద‌న్నారు. త‌మ‌కు మైక్ ఇవ్వడానికి కాంగ్రెస్ భయపడుతోంద‌ని.. తెలంగాణ అసెంబ్లీ కౌరవ సభలాగా మారింద‌ని విమ‌ర్శించారు. చ‌నిపోవాలనే కోరుకునే వారు ఎవరైనా ఉంటారా? అంటూ ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి సంకుచిత ఆలోచనతో ఉన్నార‌ని.. మాకు అసెంబ్లీలో పీపీటీ ఇవ్వాలని అడగడం తప్పు ఎట్లా అవుతుంద‌ని నిల‌దీశారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తప్పులు మాట్లాడారని ఏపీ ప్రభుత్వం అంటుంద‌ని, జీరో అవర్ ను నాలుగు గంటలు నడిపార‌న్న కేపీ వివేకానంద విమ‌ర్శించారు. బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లడం ప్రభుత్వం అజెండా అని, తెలంగాణ హక్కులను కాంగ్రెస్ కాలరాస్తోంది ఆరోపించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement