త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | పెట్టుబ‌డుల ఆకర్షణే ల‌క్ష్యంగా.. మ‌రోసారి దావోస్ ప‌ర్య‌ట‌న‌కు సీఎం రేవంత్‌

CM Revanth Reddy: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మ‌రోసారి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబ‌డులను ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌లో (Davos) సీఎం రేవంత్ రెడ్డి బృందం ప‌ర్య‌టించ‌నుంది.

G

Telangana | Published On Jan 7, 2026, 10.32 am IST

CM Revanth Reddy | పెట్టుబ‌డుల ఆకర్షణే ల‌క్ష్యంగా.. మ‌రోసారి దావోస్ ప‌ర్య‌ట‌న‌కు సీఎం రేవంత్‌
Advertisement

CM Revanth Reddy: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మ‌రోసారి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబ‌డులను ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌లో (Davos) సీఎం రేవంత్ రెడ్డి బృందం ప‌ర్య‌టించ‌నుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) ఆధ్వర్యంలో దావోస్ వేదిక‌గా ప్ర‌తి ఏడాదీ అంత‌ర్జాతీయ పెట్టుబ‌డుల సద‌స్సు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ది స్పిరిట్ ఆఫ్ డైలాగ్ అనే థీమ్‌తో జ‌న‌వ‌రి 19 నుంచి 23 వ‌ర‌కు ఐదు రోజుల‌పాటు ఈ స‌మావేశాలు జ‌రుగ‌నున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 19న సీఎం రేవంత్ నేతృంత్వంలోని బృందం దావోస్ వెళ్ల‌నుంది.

ఈ సంద‌ర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బ‌హుళ‌జాతీయ‌ కంపెనీల అధినేతలు, గ్లోబల్ ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, నూతన విధానాలను వారికి వివరించి పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌నున్నారు.

కాగా, ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి దావోస్‌లో ప‌ర్య‌టించ‌డం ఇది మూడోసారి. మొద‌టిసారి వివిధ కంపెనీల‌తో రూ.40,232 కోట్ల పెట్టుబ‌డుల‌కు ఒప్పందాలు చేసుకున్నారు. రెండో ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రూ.1.78 ల‌క్ష‌ల కోట్ల ఎంఓయూలు కుదుర్చుకున్నారు. అదేవిధంగా అమెరికా, ఉత్త‌ర కొరియాలో ప‌ర్య‌ట‌న‌లో రూ.36,100 కోట్లు, సింగ‌పూర్‌లో రూ.3,950 కోట్లు, 2025లో జ‌పాన్‌లోని ఒసాకా ఎక్స్‌పోలో రూ.12,152 కోట్ల విలువైన పెట్టుబ‌డుల‌ను రాష్ట్రానికి తీసుకువ‌చ్చారు. మొత్తంగా గ‌త రెండు ప‌ర్య‌ట‌న‌ల్లో రాష్ట్రానికి రూ.2.71 ల‌క్ష‌ల కోట్ల‌కుపైగా పెట్టుబ‌డులు సాధించ‌గ‌లిగారు.

వీటిలో ఇప్ప‌టివ‌ర‌కు 60 శాతానికిపైగా పెట్టుబ‌డులు కార్య‌రూపం దాల్చ‌గా, 40 శాతం పెట్టుబ‌డులు వివిధ ద‌శ‌ల్లో ఉన్నారు. గ‌త రెండేండ్ల‌లో సీఎం రేవంత్ స‌ర్కార్ విదేశీ పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డం ద్వారా 75 వేల‌కుపైగా ఉద్యోగాల‌ను క‌ల్పించింది. కాగా, సీఎం రేవంత్ దావోస్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి పూర్తి షెడ్యూల్ ఇంకా ఖ‌రారు కావాల్సి ఉన్న‌ది.

Advertisement

తాజావార్తలు

Advertisement