త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Organic Agriculture | నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయమే బెస్ట్

దేశ ఆహార ఉత్పత్తికి కృషి చేస్తున్న వ్యవసాయ శాఖ గొప్పదని తెలిపారు. రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని, శిక్షణ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ అవసరం అని చిన్నారెడ్డి పేర్కొన్నారు.

J

Telangana | Published On Jan 6, 2026, 9.42 pm IST

Organic Agriculture | నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయమే బెస్ట్
Advertisement
  • వ్యవసాయంతోపాటు డైరీ, గొర్రెలు, పౌల్ట్రీ, కూరగాయలు సాగు లాభదాయకం
  • రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి
  • రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
  • పాల్గొన్న వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, టీ.జీ.ఓ. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఏలూరి శ్రీనివాస్ రావు, శ్యాం, వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర చైర్మన్ కృపాకర్ రెడ్డి

Organic Agriculture | నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం బెస్ట్ అని, దీని వల్ల ప్రజల ఆరోగ్యం బాగుంటుందని, భూమి సారవంతంగా మారి రైతుకు కూడా మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యవసాయంతో పాటు డైరీ, గొర్రెల పెంపకం, పౌల్ట్రీ పరిశ్రమ, కూరగాయలు సాగు రైతులకు లాభదాయకం అని చిన్నారెడ్డి పేర్కొన్నారు.

మంగళవారం లక్డికాపూల్ లోని ఫ్యాప్సీ కాన్ఫరెన్స్ హాల్ లో రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం డైరీ, వాల్, టేబుల్ క్యాలెండర్స్, పాకెట్ టెలిఫోన్ డైరీలను వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, టీ.జీ.ఓ. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఏలూరి శ్రీనివాస్ రావు, శ్యాం, వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర చైర్మన్ బొమిరెడ్డి కృపాకర్ రెడ్డిలతో కలిసి చిన్నారెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ భూమిని నమ్ముకున్న రైతులు కానీ, ఇతరులెవ్వరూ కానీ మోసపోరు అని అన్నారు.

వ్యవసాయంలో ఆధునిక పద్దతులు అవలంభించాలని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులు మారాలని ఆయన అన్నారు. వరి సాగులో సేంద్రియ ఎరువులు వాడాలని, కెమికల్ ఎరువులు ఆరోగ్యంతోపాటు భూ సారాన్ని దెబ్బతీస్తాయని చిన్నారెడ్డి వివరించారు. రాష్ట్రంలో రైతులు పండించే పంటలను విక్రయించేందుకు అందుబాటులో ఉండే మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధి కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

దేశ ఆహార ఉత్పత్తికి కృషి చేస్తున్న వ్యవసాయ శాఖ గొప్పదని తెలిపారు. రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని, శిక్షణ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ అవసరం అని చిన్నారెడ్డి పేర్కొన్నారు.

వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి రైతు వెన్నెముక అయితే.. ఆ రైతుకు వెన్నెముక వ్యవసాయ శాఖ అధికారులు అని అన్నారు.  దేశంలోనే విత్తన భాండాగారం తెలంగాణ రాష్ట్రం అని, ప్రస్తుతం దేశంలో వ్యవసాయం గాడి తప్పిందని, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement