Kalvakunta Kavitha | కల్వకుంట్ల కవిత రాజీనామా ఆమోదం
ఇదే మండలికి రావడం ఆఖరి అని ఇక రాను, తన రాజీనామాను ఆమోదించాలంటూ కవిత మండలిలో విజ్ఞప్తి చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈనేపథ్యంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం ఆమె రాజీనామాకు ఆమోద ముద్ర వేశారు.
Kalvakunta Kavitha | ఎట్టకేలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత రాజీనామాకు ఆమోదం లభించింది. నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యత్వానికి కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. రాజీనామా ఆమోదంపై లెజిస్లేటివ్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు.
2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి శాసన మండలి సభ్యులుగా కల్వకుంట్ల కవిత ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత.. సోమవారం కౌన్సిల్ లో ప్రసంగించి తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కౌన్సిల్‌లో ప్రసంగిస్తూ కవిత కంటతడి పెట్టారు. ఇదే మండలికి రావడం ఆఖరి అని ఇక రాను, తన రాజీనామాను ఆమోదించాలంటూ కవిత మండలిలో విజ్ఞప్తి చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈనేపథ్యంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం ఆమె రాజీనామాకు ఆమోద ముద్ర వేశారు.
సంబంధిత వార్తలు

Rain Update | నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
జులై 27, 2026

Srinivas Goud | కృష్ణా, భీమా నదులపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు.. తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు : శ్రీనివాస్ గౌడ్
జులై 26, 2026

Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్
జులై 26, 2026
తాజావార్తలు
- ●Stock Markets | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. పతనమైన చమురు ధరలు..
- ●Shooting at Food Festival | ఫుడ్ఫెస్టివల్లో కాల్పులు.. ఇద్దరు దుర్మరణం
- ●Uday Krishna Reddy | పరారీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
- ●Adilabad Airport | ఆదిలాబాద్ విమానాశ్రయానికి రూ.2,278 కోట్లు.. 2 వేల ఎకరాల భూసేకరణ
- ●Rain Update | నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
- ●UPSC Recruitment | బీఈడీ అర్హతతో యూపీఎస్సీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగాలు

Stock Markets | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. పతనమైన చమురు ధరలు..

Shooting at Food Festival | ఫుడ్ఫెస్టివల్లో కాల్పులు.. ఇద్దరు దుర్మరణం

Uday Krishna Reddy | పరారీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి

Adilabad Airport | ఆదిలాబాద్ విమానాశ్రయానికి రూ.2,278 కోట్లు.. 2 వేల ఎకరాల భూసేకరణ



