Sabarimala | శబరిమల అభిషేకం నెయ్యి అమ్మకాల్లో అక్రమాలు..
Sabarimala | శబరిమల అయ్యప్ప ఆలయంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్న గుడిలోని ద్వారపాలక విగ్రహాలకు బంగారం తాపడం చేపట్టిన సమయంలో బంగారం చోరీకి గురవగా, తాజాగా అభిషేకం నెయ్యి అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు తేలింది.
తిరువనంతపురం: శబరిమల (Sabarimala) అయ్యప్ప ఆలయంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్న గుడిలోని ద్వారపాలక విగ్రహాలకు బంగారం తాపడం చేపట్టిన సమయంలో బంగారం చోరీకి గురవగా, తాజాగా అభిషేకం నెయ్యి అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు తేలింది. దీంతో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (TDB) విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది. మణికంఠునికి నెయ్యితో అభిషేకం చేస్తుంటారు. దీనిని ఆదియ శిష్టం నెయ్యి అంటారు.
అభిషేకం చేయగా మిగిలిన నెయ్యిని భక్తులు ప్రసాదంగా లేదా దేవస్వం బోర్డు కౌంటర్ల ద్వారా విక్రయిస్తుంటారు. ఇలా పంపిణీ చేయాల్సిన సుమారు 16 వేల నెయ్యి ప్యాకెట్ల లెక్క తేలడం లేదని, దీనివిలువ సుమారు రూ.16 లక్షలు ఉంటుందని ఆలయ అధికారులు వెళ్లడించారు. కౌంటర్లు ఇచ్చిన ప్యాకెట్ల మొత్తాన్ని దేవస్వం బోర్డు ఖాతాలో జమ చేయకపోవడంతో ఈ అక్రమాలను గుర్తించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సాధారణంగా, నెయ్యాభిషేకం కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన భక్తులు ఆదియ శిష్టం నెయ్యిని కొనుగోలు చేస్తుంటారు. 100 మిల్లీలీటర్ల బరువు ఉండే ఈ ప్యాకెట్ ధర రూ.100కు దేవస్వం బోర్డు కౌంటర్లలో విక్రయిస్తారు. ఈ అమ్మకాలకు సంబంధించి సరైన లెక్కాపత్రాలు నిర్వహించలేదని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. గతేడాది కూడా ఇలాంటి అక్రమాలు జరిగాయని అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






