త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Additional Collector | కంటైన‌ర్‌ను ఢీకొట్టిన కారు.. కొత్తగూడెం అద‌న‌పు క‌లెక్ట‌ర్‌కు త‌ప్పిన ప్ర‌మాదం

Additional Collector | భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్‌కు (Additional Collector) తృటిలో ప్రాణాపాయం త‌ప్పింది. అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ ధార వేణుగోపాల్ (Dhara Venugopal) ప్ర‌జావాణి కార్య‌క్ర‌మంలో (Prajavani) పాల్గొనేందుకు హైద‌రాబాద్‌ను కొత్త‌గూడెం (Kothagudem) బ‌య‌ల్దేరారు.

G

Telangana | Published On Sep 28, 2026, 10.44 am IST

Additional Collector | కంటైన‌ర్‌ను ఢీకొట్టిన కారు.. కొత్తగూడెం అద‌న‌పు క‌లెక్ట‌ర్‌కు త‌ప్పిన ప్ర‌మాదం
Advertisement

Additional Collector | త్రినేత్ర న్యూస్‌: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్‌కు (Additional Collector) తృటిలో ప్రాణాపాయం త‌ప్పింది. అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ ధార వేణుగోపాల్ (Dhara Venugopal) ప్ర‌జావాణి కార్య‌క్ర‌మంలో (Prajavani) పాల్గొనేందుకు హైద‌రాబాద్ నుంచి కొత్త‌గూడెం (Kothagudem) వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారు న‌ల్ల‌గొండ జిల్లా నార్క‌ట్‌ప‌ల్లి (Narketpally) కామినేని హాస్పిట‌ల్ స‌మీపంలో అదుపుత‌ప్పి ముందు వెళ్తున్న కంటైన‌ర్‌ను (Container) ఢీకొట్టింది.

దీంతో కారు ముందుభాగం తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ది. అయితే ఈ ప్ర‌మాదం నుంచి అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ ధార వేణుగోపాల్ సుర‌క్షితంగా బ‌య‌టప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. అద‌న‌పు క‌లెక్ట‌ర్‌ను మ‌రో వాహ‌నంలో కొత్త‌గూడెంకు త‌ర‌లించారు.

 

Advertisement
Advertisement