RTC Conductor | చిల్లర కోసం గొడవ.. కండక్టర్‌ను బస్సులోనుంచి తోసేసిన మహిళ
RTC Conductor | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రయాణికురాలితో చిల్లర కోసం జరిగిన గొడవ కండక్టర్ (RTC Conductor) ప్రాణాల మీదకు తెచ్చింది. మణుగూరు ఆర్టీసీ డిపోనకు (Manuguru) చెందిన పల్లె వెలుగు బస్సు మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్నది.
RTC Conductor | త్రినేత్ర న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రయాణికురాలితో చిల్లర కోసం జరిగిన గొడవ కండక్టర్ (RTC Conductor) ప్రాణాల మీదకు తెచ్చింది. మణుగూరు ఆర్టీసీ డిపోనకు (Manuguru) చెందిన పల్లె వెలుగు బస్సు మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్నది. మిట్టగూడెంకు చెందిన మౌనిక బస్సు ఎక్కారు. ఆమెతో పాటు ఉన్న బాలుడికి టికెట్ తీసుకోవాలని కండక్టర్ ప్రవళిక కోరారు. టికెట్ తీసుకోవడానికి మౌనిక నిరాకరించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
అనంతరం బాలుడికి టికెట్ (Ticket) తీసుకునేందుకు అంగీకరించిన ఆమె కండక్టర్‌కు రూ.100 ఇచ్చారు. అయితే చిల్లర లేకుపోవడంతో బస్సు దిగేటప్పుడు తీసుకోవాలని చెప్పారు. అలా కుదరదని, ఇప్పుడే చిల్లర ఇవ్వాలని ప్రయాణికురాలు కండక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈలోగా మిట్టగూడెం స్టాప్ రాగానే ఆమె బస్సు దిగడానికి ప్రయత్నించారు. అయితే బస్సును అశ్వాపురం (Aswapuram) పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లాలని డ్రైవర్‌కు ప్రవళిక సూచించారు. ఈక్రమంలో ఆవేశానికిలోనైన మౌనిక కండక్టర్‌ను నెట్టివేశారు. దీంతో ఆమె బస్సు వెనుక టైర్ల కింద పడిపోవడంతో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో భద్రాచలం (Bhadrachalam) ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. మణుగూరు డిపో మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నారు.
సంబంధిత వార్తలు

Additional Collector | కంటైనర్‌ను ఢీకొట్టిన కారు.. కొత్తగూడెం అదనపు కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం
సెప్టెంబర్ 28, 2026

Nursing Student | సెలవులకు ఇంటికి వచ్చి.. అనుమానాస్పద స్థితిలో నర్సింగ్ విద్యార్థిని మృతి
సెప్టెంబర్ 23, 2026

Bandi Sanjay | ఆ ముగ్గురు మంత్రులు వసూళ్లలో బిజీ..
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Fake Death | హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి.. ఏఐ సహాయంతో చనిపోయినట్లు డ్రామా..
- ●Horoscope | అక్టోబర్ 26 సోమవారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
- ●Telangana Schools Holiday | విద్యార్థులకు గుడ్‌న్యూస్: రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- ●Modi Ka Baap Bhi Jayega Controversy | 'మోదీ కా బాప్ భీ జాయేగా': పాట్నా సభలో సహనం కోల్పోయిన మల్లికార్జున ఖర్గే
- ●ABN Radhakrishna Family Dispute | ఏబీఎన్ ఆర్కే కుటుంబంలో లీడర్షిప్ మార్పుల కలకలం.. అల్లుడు కోగంటి భాను సంచలన ట్వీట్, ఆపై క్లారిఫికేషన్!
- ●Navi Mumbai Airport | విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్: నవీ ముంబై కొత్త ఎయిర్‌పోర్ట్‌కు ఇండిగో, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ షిఫ్ట్

Fake Death | హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి.. ఏఐ సహాయంతో చనిపోయినట్లు డ్రామా..

Horoscope | అక్టోబర్ 26 సోమవారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

Telangana Schools Holiday | విద్యార్థులకు గుడ్‌న్యూస్: రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Modi Ka Baap Bhi Jayega Controversy | 'మోదీ కా బాప్ భీ జాయేగా': పాట్నా సభలో సహనం కోల్పోయిన మల్లికార్జున ఖర్గే



