త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన బంగారం ధ‌ర‌.. మార్కెట్ల‌లో తీవ్ర అనిశ్చితి..

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో నెల‌కొన్న యుద్ధ ప‌రిస్థితుల కార‌ణంగా దేశీయ, అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ న‌ష్టాల్లో ఉండ‌గా, బులియ‌న్ మార్కెట్ల‌లో ర్యాలీ కొన‌సాగుతోంది. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్ల‌లో గురువారం ఔన్స్ బంగారం ధ‌ర 0.59 శాతం పెరిగి 4,426 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.68 శాతం పెరిగి 67 డాల‌ర్ల‌కు చేరింది.

S

Business | Published On Sep 10, 2026, 11.47 am IST

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన బంగారం ధ‌ర‌.. మార్కెట్ల‌లో తీవ్ర అనిశ్చితి..
Advertisement

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో నెల‌కొన్న యుద్ధ ప‌రిస్థితుల కార‌ణంగా దేశీయ, అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ న‌ష్టాల్లో ఉండ‌గా, బులియ‌న్ మార్కెట్ల‌లో ర్యాలీ కొన‌సాగుతోంది. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్ల‌లో గురువారం ఔన్స్ బంగారం ధ‌ర 0.59 శాతం పెరిగి 4,426 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.68 శాతం పెరిగి 67 డాల‌ర్ల‌కు చేరింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 494 పాయింట్లు పెరిగి 1,54,257 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 526 పాయింట్లు త‌గ్గి 2,43,516 వ‌ద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెరిగాయి.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,551 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,24, 408 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,55,510 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,55,100 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.12,000 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,255 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,14,040గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,42,550 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,25,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.11,000 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,663 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.93,304గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,16,630 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,66,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.9,000 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,55,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,550గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు పెరిగింది. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,55,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,550 గా ఉంది.

Advertisement
Advertisement