త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balmoor Venkat | బీఆర్ఎస్‌ నేతలు బుద్ధి మార్చుకోకపోతే.. ప్రజలే మిమ్మల్ని శుద్ధి చేస్తారు: ఎమ్మెల్సీ బ‌ల్మూర్ వెంక‌ట్

Balmoor Venkat | త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ (BRS) నేతలు బుద్ధి మార్చుకోకపోతే, ప్రజలే మిమ్మల్ని శుద్ధి చేస్తారని మండ‌లిలో ప్ర‌భుత్వ విప్, ఎమ్మెల్సీ బ‌ల్మూర్ వెంక‌ట్ (Balmoor Venkat) హెచ్చ‌రించారు. దళితులు ధర్నా చేసిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి (Purification) చేయడం కాద‌ని, ముందు వారి మైండ్‌ను శుద్ధి చేసుకోవాల‌ని సూచించారు.

G

Telangana | Published On Sep 10, 2026, 12.06 pm IST

Balmoor Venkat | బీఆర్ఎస్‌ నేతలు బుద్ధి మార్చుకోకపోతే.. ప్రజలే మిమ్మల్ని శుద్ధి చేస్తారు: ఎమ్మెల్సీ బ‌ల్మూర్ వెంక‌ట్
Advertisement

Balmoor Venkat | త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ (BRS) నేతలు బుద్ధి మార్చుకోకపోతే, ప్రజలే మిమ్మల్ని శుద్ధి చేస్తారని మండ‌లిలో ప్ర‌భుత్వ విప్, ఎమ్మెల్సీ బ‌ల్మూర్ వెంక‌ట్ (Balmoor Venkat) హెచ్చ‌రించారు. దళితులు ధర్నా చేసిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి (Purification) చేయడం కాద‌ని, ముందు వారి మైండ్‌ను శుద్ధి చేసుకోవాల‌ని సూచించారు. అసెంబ్లీ దగ్గర చేసిన రాక్షస చర్యను ప్ర‌త్య‌క్షంగా యావత్ సమాజం చూసింద‌న్నారు. అవి కూడా ఏఐ కంటెంట్‌ అనడానికి సిగ్గుండాల‌ని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో క‌లిసి ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన ప్రతిపక్ష సభ్యులు పబ్లిక్‌లోనే ఫైటింగ్‌లకు దిగుతున్నారని మండిప‌డ్డారు.

ఫామ్ హౌస్‌లో కేసీఆర్ ట్రైనింగ్ ఇస్తే, అసెంబ్లీ గేట్ దగ్గర కేటీఆర్ (KTR) ఫైటింగ్ చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్ దగ్గర మార్కుల కోసం కేటీఆర్, హరీశ్‌ రావు పాకులాడుతున్నార‌ని విమ‌ర్శించారు. హరీశ్ రావు (Harish Rao), కేటీఆర్ దగ్గర మార్కుల కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీ పడి పోలీసులపై దాడి చేశార‌న్నారు. శాస‌న స‌భ స్పీకర్‌పై కూడా దూషణలకు దిగారని చెప్పారు. కేసీఆర్ (KCR) డైరెక్షన్‌లో ఇదీ బీఆర్ఎస్‌ నేతల వ్యవహార‌మ‌ని వెల్ల‌డించారు. తప్పులు చేయడం, తప్పించుకునే ప్రయత్నం చేయడం వారికి అల‌వాటేన‌ని విమ‌ర్శించారు. మళ్లీ అవన్నీ ఏఐ కంటెంట్ అంటూ చెప్పుకోవడానికైనా సిగ్గు ఉండాల‌ని మండిప‌డ్డారు.

అసెంబ్లీ గేట్ వ‌ద్ద బీఆర్ఎస్ నేతలు చేసిన రౌడీ, రాక్షస చర్య ప్ర‌త్య‌క్షంగా యావత్ సమాజం చూసింది, ఖండించింద‌న్నారు. అయినా.. ఆ పార్టీ నేతల్లో ఏ మాత్రం పశ్చాతాపం కనిపించడం లేద‌ని విమ‌ర్శించారు. పైగా ఆ వీడియోలు, ఫొటోలు ఏఐ మార్ఫింగ్‌ అంటూ మాట్లాడటానికి కేటీఆర్‌కు సిగ్గు ఉండాలన్నారు. కేసీఆర్‌ ఫామ్ హౌస్ (Erravelly Farm House) వ‌ద్ద‌ దళితులు ధర్నా చేస్తే ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం కాద‌ని, ముందు మీ మైండ్‌ను శుద్ధి చేసుకోవాల‌న్నారు. మీ తీరు, మాటలు చూసి జనం సిగ్గు పడుతున్నారని వెల్ల‌డించారు. ఇలాంటి నేతలనా..? మనం అసెంబ్లీకి పంపించిదని బాధ పడుతున్నారని చెప్పారు. పబ్లిక్‌గా చేసిన తప్పును కూడా సమర్థించుకునే ప్రయత్నం చేయడం సిగ్గు చేటన్నారు. మీ తీరు మార్చుకోకపోతే ప్రజలే మీ మైండ్‌ను శుద్ధి చేస్తారు.

Advertisement
Advertisement