Students Attack | 30 మందితో వచ్చి.. ప్రిన్సిపాల్ ముందే విద్యార్థిని చితకబాదారు..
Students Attack | హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఉన్న అవినాశ్ కాలేజీలో (Avinash College) దారుణం చోటుచేసుకుంది. 30 మందితో వచ్చిన ఓ విద్యార్థి ప్రిన్సిపాల్ ముందే సహచర విద్యార్థిపై దాడికి (Students Attack) పాల్పడ్డాడు.
Students Attack | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఉన్న అవినాశ్ కాలేజీలో (Avinash College) దారుణం చోటుచేసుకుంది. 30 మందితో వచ్చిన ఓ విద్యార్థి ప్రిన్సిపాల్ ముందే సహచర విద్యార్థిపై దాడికి (Students Attack) పాల్పడ్డాడు. దీంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. ఈనేపథ్యంలో కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
మనిచరణ్, అమన్ అనే ఇద్దరు విద్యార్థుల మధ్య బుధవారం గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో మనిచరణ్‌కు చెందిన సుమారు 30 మంది కాలేజీకి వచ్చి, ప్రిన్సిపాల్ (Principal) సమక్షంలోనే అమన్‌పై దాడి చేశారు. విచక్షణా రహితంగా చితకబాదినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై బాధితుడి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపాల్ తన సీట్‌లో ఉండగానే విద్యార్థిపై దాడి జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నిస్తున్నారు. కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. 30 మంది కాలేజీలోకి ఎలా వచ్చారని, భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదని యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

PM Modi | పిల్లల్ని డిజిటల్ వ్యసనం నుంచి బయటపడేయాలి.. ఉపాధ్యాయులకు ప్రధాని మోదీ సూచన
సెప్టెంబర్ 5, 2026

Engineering students | లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
సెప్టెంబర్ 5, 2026

JNTU | జేఎన్టీయూలో ఘర్షణ.. కర్రలతో విచక్షణారహితంగా కొట్టుకున్న విద్యార్థులు
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●MK Stalin | తమ్ముడు విజయ్.. మీరు చెప్పింది నిజమే.. పోలీసుల దాష్టీకానికి నా దవడ పగిలింది : ఎంకే స్టాలిన్
- ●Balmoor Venkat | బీఆర్ఎస్ నేతలు బుద్ధి మార్చుకోకపోతే.. ప్రజలే మిమ్మల్ని శుద్ధి చేస్తారు: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన బంగారం ధర.. మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి..
- ●Ponnam Prabhakar | తెలంగాణ ప్రజలకు లైఫ్‌లైన్ ఆర్టీసీ.. జాగ్రత్తగా విలీన ప్రక్రియ: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●BRS | మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తన.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం!
- ●Harish Rao | సిగ్గుచేటు.. ఫేక్ అకౌంట్ గురించి అసెంబ్లీలో చెప్పిన సీఎం రేవంత్: హరీశ్ రావు

MK Stalin | తమ్ముడు విజయ్.. మీరు చెప్పింది నిజమే.. పోలీసుల దాష్టీకానికి నా దవడ పగిలింది : ఎంకే స్టాలిన్

Balmoor Venkat | బీఆర్ఎస్ నేతలు బుద్ధి మార్చుకోకపోతే.. ప్రజలే మిమ్మల్ని శుద్ధి చేస్తారు: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన బంగారం ధర.. మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి..

Ponnam Prabhakar | తెలంగాణ ప్రజలకు లైఫ్‌లైన్ ఆర్టీసీ.. జాగ్రత్తగా విలీన ప్రక్రియ: మంత్రి పొన్నం ప్రభాకర్



