త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Legislative Council Session | పాట‌లు పాడుతూ.. శాస‌న మండ‌లిలో కొన‌సాగుతున్న‌ బీఆర్ఎస్ ఆందోళ‌న‌

Legislative Council Session | శాస‌న మండ‌లి స‌మావేశాలు (Legislative Council Session) నాలుగో రోజు కొన‌సాగుతున్నాయి. బీఆర్ఎస్ (BRS MLCs) స‌భ్యుల ఆందోళ‌న‌ల న‌డుమే స‌భ కొన‌సాగుతున్న‌ది.

G

Telangana | Published On Sep 10, 2026, 10.42 am IST

Legislative Council Session | పాట‌లు పాడుతూ.. శాస‌న మండ‌లిలో కొన‌సాగుతున్న‌ బీఆర్ఎస్ ఆందోళ‌న‌
Advertisement

Legislative Council Session | త్రినేత్ర‌.న్యూస్‌: శాస‌న మండ‌లి స‌మావేశాలు (Legislative Council Session) నాలుగో రోజు కొన‌సాగుతున్నాయి. బీఆర్ఎస్ (BRS MLCs) స‌భ్యుల ఆందోళ‌న‌ల న‌డుమే స‌భ కొన‌సాగుతున్న‌ది. సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబసభ్యులకు అక్రమంగా ప్రభుత్వ భూములు కేటాయించిన వ్యవహారంపై శాసన మండలిలో చర్చకు బీఆర్ ఎస్ ఎమ్మెల్సీల పట్టుప‌ట్టింది. చైర్మ‌న్ అనుమ‌తించ‌క‌పోవ‌డంతో బీఆర్ఎస్ నినాదాలు చేస్తు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్సీ దేశ‌ప‌తి శ్రీనివాస్ (Deshapathi Srinivas) పాట పాడుతూ నిరసన తెలుపుతుండ‌గా.. సహచర ఎమ్మెల్సీలు కోరస్ అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో మీ సీట్ల వ‌ద్ద‌కు వెళ్లి పాట‌ప‌డితే తాము కూడా ఆస్వాదిస్తామంటూ మండలి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి.. ఎమ్మెల్సీ దేశ‌ప‌తికి సూచించారు. మండ‌లిలో ప్ర‌స్తుతం ప్ర‌శ్నోత్తరాలు కొన‌సాగుతున్నాయి.

బీఆర్ఎస్ తీరుపై మంత్రి శ్రీధ‌ర్ బాబు (Sridhar Babu) అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. గ‌త ప‌దేండ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో ప్ర‌జ‌లు చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నార‌ని.. దేశ‌ప‌తి శ్రీనివాస్ ఇలాగే పాట‌లు పాడితే బాగుంటుండే అంటూ చుర‌క‌లు అంటించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించ‌లేక ఇలా పాట‌లు పాడుతూ స‌భా కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్షాలు లేవ‌నెత్తే ప్ర‌తి స‌మ‌స్య‌కు స‌మాధానం చెప్పేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని చెప్పారు.

 

Advertisement
Advertisement