MLA Raja Singh | కాంగ్రెస్ నేతల వాటాల గొడవ తేలకే కొండా సురేఖ రాజీనామా!
MLA Raja Singh | రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక అవినీతికి అద్దు అదుపు లేకుండా పోయిందని.. కాంగ్రెస్ నేతల మధ్య వాటాల వ్యవహారమే కొండా సురేఖ రాజీనామా వరకు తీసుకెళ్లిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
- రేవంత్ సీఎం అయ్యాక అవినీతి ఆగడం లేదు
- అంతా ఇష్టమొచ్చినట్లు దోచుకుంటున్నరు
- ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
MLA Raja Singh | త్రినేత్ర.న్యూస్: రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక అవినీతికి అద్దు అదుపు లేకుండా పోయిందని.. కాంగ్రెస్ నేతల మధ్య వాటాల వ్యవహారమే కొండా సురేఖ రాజీనామా వరకు తీసుకెళ్లిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని.. ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. అందుకే ఇష్టమొచ్చినట్టు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇటీవల చోటుచేసుకున్న మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌పై స్పందిస్తూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి జరుగుతోంది. మంత్రులు,పెద్ద నేతలు, చిన్న నేతలు, అధికారులనే తేడా లేకుండా అవినీతి నడుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అవినీతి ఆగడం లేదు. గతంలో కేసీఆర్ అప్పులు చేసి పాలించి ఫాంహౌస్‌లో కూర్చున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చింది. కేవలం పేపర్‌లో మాత్రమే నిధులు ఇస్తున్నట్టు చెప్తారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం జీరో. దీంతో మంత్రులకు, నేతలకు అర్థమైంది.
కొండా సురేఖ ఓఎస్డీ అరెస్టు ఘటన నుంచే అసలు కథ మొదలైంది. అప్పటి నుంచే మంత్రి పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు జరిగాయి. తాజాగా డబ్బుల వాటాకు సంబంధించి కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతోనే ఈ వ్యవహారం ఢిల్లీ వరకు వెళ్లింది. నేతల లంచాల డబ్బుల వాటాల వ్యవహారం ఢిల్లీ పెద్దలకు తెలిసింది. ఈ వ్యవహారమే కొండా సురేఖ రాజీనామా వరకు వెళ్లింది అని రాజాసింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆ డబ్బుల గొడవే కొండా సురేఖ రాజీనామా వరకు వచ్చింది. ఇప్పుడు కొండా సురేఖ ప్రెస్ మీట్‌లో ఏం చెబుతారో చూడాలి. బర్తరఫ్ చేస్తామని అధిష్టానం చెప్పిందట.. దీనిపై ఆమె ఏం అంటారో తెలుస్తుంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Tollywood | మందమర్రి నుంచి చంద్రయాన్‌కు - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ మూవీ
- ●Rambha Oorvasi Menaka Review | రంభ ఊర్వశి మేనక రివ్యూ - విష్ణుప్రియ, రాశీసింగ్లతో అల్లరి నరేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?
- ●Congress Party | కేసీఆర్ రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ నిరసన ర్యాలీ
- ●Harish Rao | సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నడు : హరీశ్‌రావు
- ●Heavy Rain In Delhi | జన్మాష్టమి వేళ ఢిల్లీకి భారీ వర్షం.. ఎయిర్‌పోర్ట్‌లోకి నీరు.. తొమ్మిది విమానాలు దారి మళ్లింపు
- ●Razor Blades | బ్లేడ్లు మింగిన బాలుడు.. తొలగించిన ఉస్మానియా వైద్యులు..

Tollywood | మందమర్రి నుంచి చంద్రయాన్‌కు - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ మూవీ

Rambha Oorvasi Menaka Review | రంభ ఊర్వశి మేనక రివ్యూ - విష్ణుప్రియ, రాశీసింగ్లతో అల్లరి నరేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?

Congress Party | కేసీఆర్ రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ నిరసన ర్యాలీ

Harish Rao | సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నడు : హరీశ్‌రావు




