త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bakka Judson | కొండా సురేఖ‌ రేవంత్‌నే కేర్ చేయ‌ద్‌.. ఇగ క‌డియం ఎంత‌

Bakka Judson | తెలంగాణ‌లో చంద్ర‌బాబు కాంగ్రెస్ న‌డుస్తోందని.. రేవంత్‌, సీత‌క్క‌, క‌డియం, వేం న‌రేంద‌ర్‌రెడ్డి వంటి వాళ్లంతా సంచార జీవుల‌ని కాంగ్రెస్ బ‌హిష్కృత నేత బక్క జడ్సన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. వాళ్లు నెత్తి మీద ట్రంక్ పెట్టె వెట్టుకొని ఏ పార్టీ ప‌చ్చ‌గుంటే అండ్ల చేరుతార‌ని విమ‌ర్శించారు.

S

Telangana | Published On Jul 27, 2026, 4.58 pm IST

Bakka Judson | కొండా సురేఖ‌ రేవంత్‌నే కేర్ చేయ‌ద్‌.. ఇగ క‌డియం ఎంత‌
Advertisement
  • ఆమె రెండు పార్టీల‌కోయొచ్చి కొంత వీకైంది.. లేదంటే పీసీసీ, సీఎం రేసుల ఉంటుండే..
  • క‌డియమైతే దుర్మార్గుడు.. వ‌రెస్ట్‌ఫెలో
  • తెలంగాణ‌ల బాబు కాంగ్రెస్ న‌డుస్తుంది.. రేవంత్, సీతక్క, కడియం వంటి వాళ్లంతా సంచార జీవులు
  • అస‌లు మందుల సామేల్‌కు టికెట్ ఎందుకియ్యాలే..
  • రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అడుగుతున్న‌డ‌నే రేవంత్ సామేల్‌కు చెప్పి తిట్టిస్తున్నడు
  • కాంగ్రెస్ బ‌హిష్కృత నేత బక్క జడ్సన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Bakka Judson | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ‌లో చంద్ర‌బాబు కాంగ్రెస్ న‌డుస్తోందని.. రేవంత్‌, సీత‌క్క‌, క‌డియం, వేం న‌రేంద‌ర్‌రెడ్డి వంటి వాళ్లంతా సంచార జీవుల‌ని కాంగ్రెస్ బ‌హిష్కృత నేత బక్క జడ్సన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. వాళ్లు నెత్తి మీద ట్రంక్ పెట్టె వెట్టుకొని ఏ పార్టీ ప‌చ్చ‌గుంటే అండ్ల చేరుతార‌ని విమ‌ర్శించారు. కొండా సురేఖ రేవంత్‌నే కేర్ చేయ‌ద‌ని.. ఇగ క‌డియం ఎంత అని అన్నారు. క‌డియం శ్రీ‌హ‌రి అనేటోడు దుర్మార్గుడ‌న్నారు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అడుగుతున్నాడని రేవంత్ రెడ్డి మందుల సామేల్‌కు చెప్పి తిట్టిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఈమేర‌కు ఆయ‌న సోమ‌వారం ఓ వార్తా చాన‌ల్‌తో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు.

రాజ‌య్య మీద అన్ని కొండాలు జెప్పి ప‌ద‌వి గుంజిండు..

క‌డియం దుర్మార్గుడు. గ‌తంల టీడీపీల ఉండే. ప్ర‌ణ‌య్‌భాస్క‌ర్‌ను కూడా అణ‌గ‌దొక్కిండు. చాలా ఇబ్బంది బెట్టిండు. ద‌యాక‌ర్‌రావును మంత్రి కాకుండా చేసిండు. చాలా గ‌లీజ్‌గాడు. వ‌రెస్ట్‌ఫెలో. కాంగ్రెస్‌కెళ్లి రాజ‌య్య ఎమ్మెల్యేగా గెలిచి ఇంకా మూడేండ్లు ఉండ‌గా రాజీనామా చేసి బీఆర్ఎస్‌కు పోయిండు. అక్క‌డ ఉప‌ముఖ్య‌మంత్రి అయిండు. ఈన అక్క‌డికి బ‌త‌క‌నీకి పోయిండు. రాజ‌య్య మీద అన్ని కొండాలు జెప్పి ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఊడ‌వీక్కున్న‌డు. త‌ర్వాత మొన్న‌డిదాకా ప‌సునూరి ద‌యాక‌ర్ సిట్టింగ్ ఎంపీ. కేసీఆర్‌కు చెప్పి ఆయ‌న టికెట్ కోసి.. ఆ టికెట్ గుంజి ఈన బిడ్డ‌కు ఇప్పిచ్చిండు. మ‌ళ్లా లాస్ట్‌డే బీఫామ్‌, పైస‌ల‌న్ని ఎత్క‌పోయి కాంగ్రెస్‌కొచ్చిండు. కాంగ్రెస్ బీఫామ్ తీసుకున్న‌రు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కోసిండు.. సిట్టింగ్ ఎంపీని కోసిండు. అంటే వీళ్లు క్రిమినల్స్ కాకుంటే ఏంద‌బ్బా? అని ఆయ‌న‌ ప్ర‌శ్నించారు.

వాళ్ల ముందు రేవంత్ న‌త్తింగ్‌..

మందుల సామేల్ గానీ.. క‌డియం గానీ.. ఎవ‌డ‌న్న గానీ బ‌త్కొచ్చినోళ్ల‌ను పెంచుకున్న‌ట్టుంది ఈరోజు ప‌రిస్థితి. కొండ సురేఖ వాళ్లు రెండు పార్టీల‌కువోయొచ్చి కొంత వీకైర్రు గానీ.. 2009ల రాజీనామా చేయ‌కుండా అట్లే ఉంటే ఈరోజు పీసీసీ, సీఎం రేసుల ఉండేది ఆమె. రేవంత్ ఆమె ద‌రిదాపుళ్ల‌కు పోయే ప‌రిస్థితి ఉండ‌క‌పోవు. అంత ప‌వ‌ర్‌ఫుల్ ఆమె. సీత‌క్క అంటే చంద్ర‌బాబు నాయుడు గ్యాంగ్ గ‌దా.. ఆమెను డిస్ట్ర‌బ్ చేయ‌డు. ఈమే కాంగ్రెస్ గ్యాంగ్ క‌దా.. కాబ‌ట్టి ఈమెను డిస్ట్ర‌బ్ చేయాలే. ఆమె మంత్రి ప‌ద‌వి తీసేయాలే. ఆయ‌న‌కింకా తెల్వ‌దు.. ఆమెను ఏమ‌న్నా తోల్‌దీస్త‌ది. అస‌లు రేవంత్‌రెడ్డినే కేర్ చేయ‌రు. సీఎం అయిండు కాబ‌ట్టి గౌర‌వం అంతే. వాళ్ల ముందు రేవంత్ న‌త్తింగ్ అని జ‌డ్స‌న్ వ్యాఖ్యానించారు.

సామేల్‌కు ఎందుకియ్యాలే టికెట్‌?

నెత్తిమీద ట్రంక్ పెట్టె వెట్టుకొని ఏ పార్టీ ప‌చ్చ‌గుంటే అండ్లకోత‌రు. దాన్ని ఆక్ర‌మిస్త‌రు. అస‌లొల్ల‌ను ఎల్ల‌గొడుత‌రు. కాంగ్రెసోళ్లు ఉన్నంక ఈ బ‌తుకొచ్చేటోళ్ల‌కు టికెట్ ఎందుకియ్యాలంటున్నా. మందుల సామేల్ అనేటోనికి ఎందుకియ్యాలే టికెట్‌. ఎవ‌రు మందుల సామేల్‌? ఆయ‌న‌కు ఏం సంబంధం? ఎప్పుడ‌న్నా జెండా ప‌ట్టిండా? ఇయ్యాళ ఆయ‌న గురించి మాట్లాడ‌డం నా దుర‌దృష్టం. 30 ఏండ్లుగా కాంగ్రెస్‌లో కూడిసినోళ్ల‌ను బ‌య‌టికెళ్ల‌గొట్టి ఈ బ‌త్కొచ్చినోళ్ల‌ను నెత్తిమీద వెట్టుకున్న‌రు. వాళ్ల‌తోటి తిట్లెందుకు వ‌డుత‌రు ఈరోజు. ఒరిజిన‌ల్ కాంగ్రెసోళ్లు ఎవ్వ‌ల‌న‌న్నా ఏమ‌న్నా అన్న‌రా? బ‌త్కొచ్చినోళ్ల‌తోనే ప్రాబ్ల‌మ్స్ ఇయ్యాళ అని బ‌క్క జ‌డ్స‌న్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement