త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SSC Exams | ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌ల షెడ్యూలు ఖ‌రారు.. మార్చి 18 నుంచి ఎగ్జామ్స్‌?

SSC Exams | ఇప్ప‌టికే ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్షల తేదీల‌ను ప్ర‌క‌టించిన అధికారులు.. మ‌రో బోర్డ్ ఎగ్జామ్స్ (Board Exam) షెడ్యూల్ ఖ‌రారు చేశారు. వ‌చ్చే మార్చి 18వ తేదీ నుంచి పదో తరగతి (SSC Exams) వార్షిక పరీక్షలను నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ రూపొందించింది.

G

Telangana | Published On Nov 22, 2026, 7.02 am IST

SSC Exams | ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌ల షెడ్యూలు ఖ‌రారు.. మార్చి 18 నుంచి ఎగ్జామ్స్‌?
Advertisement

SSC Exams | త్రినేత్ర న్యూస్‌: ఇప్ప‌టికే ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్షల తేదీల‌ను ప్ర‌క‌టించిన అధికారులు.. మ‌రో బోర్డ్ ఎగ్జామ్స్ (Board Exam) షెడ్యూల్ ఖ‌రారు చేశారు. వ‌చ్చే మార్చి 18వ తేదీ నుంచి పదో తరగతి (SSC Exams) వార్షిక పరీక్షలను నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ రూపొందించింది. ప్ర‌భుత్వం అనుమ‌తి తెలిపిన వెంట‌నే అధికారికంగా షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌నుంది.

మార్చి 18న‌ ప్రారంభ‌మ‌య్యే ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 10న ముగుస్తాయి. అంటే ప్రధాన పరీక్షలు ముగియ‌డానికి 24 రోజుల సమయం ఉంది. పదో తరగతిలో ఆరు సబ్జెక్టులకు ఏడు పేపర్లు (సైన్స్‌లో బ‌యాల‌జీ, ఫిజిక్స్‌కు వేర్వేరు పరీక్షలు) ఉండటంతో ఏడు రోజులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సీబీఎస్‌ఈ తరహాలో పరీక్షల మధ్య వ్యవధిని గతేడాది పెంచారు. ఆ విధానాన్ని ఈసారీ కొనసాగిస్తున్నారు. పదో తరగతి పరీక్షలకు దాదాపు 5.25 లక్షల నుంచి 5.50 లక్షల మంది హాజరుకానున్నారు. ఆలస్య రుసుం లేకుండా పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఈ నెల 26 వరకు గడువు ఉంది.

Advertisement
Advertisement