Bar Council | 700 మంది న్యాయవాదులుగా ఎన్‌రోల్‌మెంట్.. ప్రమాణ స్వీకారం చేయించిన బార్ కౌన్సిల్
Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శనివారం 700 మంది న్యాయశాస్త్ర పట్టభద్రులు న్యాయవాదులుగా ఎన్‌రోల్ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నూతనంగా ఎన్‌రోల్ అయిన న్యాయవాదులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శనివారం 700 మంది న్యాయశాస్త్ర పట్టభద్రులు న్యాయవాదులుగా ఎన్‌రోల్ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నూతనంగా ఎన్‌రోల్ అయిన న్యాయవాదులతో ప్రమాణ స్వీకారం చేయించారు. న్యాయవాద వృత్తిలోకి అడుగుపెడుతున్న యువతకు ఇది కీలక ఘట్టంగా నిలిచింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన తాత్కాలిక ఎన్‌రోల్‌మెంట్ కమిటీ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరిగింది. కమిటీలో తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ సమాల రామ్‌రెడ్డి, వైస్ చైర్మన్ వెంకట్ యాదవ్ చలకాని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు జీ కిరణ్‌కుమార్ ఉన్నారు.
ఈ సందర్భంగా నూతన న్యాయవాదులను ఉద్దేశించి చైర్మన్ సమాల రామ్‌రెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలో నైతిక విలువలు, క్రమశిక్షణ, అంకితభావం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. వృత్తి గౌరవాన్ని కాపాడుతూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని యువ న్యాయవాదులకు సూచించారు. వైస్ చైర్మన్ వెంకట్ యాదవ్ చలకాని మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలో రాణించాలంటే నిరంతరం విజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు వృత్తి పట్ల నిబద్ధత, న్యాయవ్యవస్థ పట్ల గౌరవం కలిగి ఉండాలని సూచించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు జి. కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలో తొలి సంవత్సరాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఈ సమయంలో కష్టపడి పనిచేయడం, వృత్తిపరమైన నైతిక విలువలను పాటించడం, క్షేత్రస్థాయి అనుభవాన్ని సంపాదించుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. యువ న్యాయవాదులకు అవసరమైన సహకారం అందించడంతో పాటు, ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను పారదర్శకంగా, సకాలంలో పూర్తి చేయడం బార్ కౌన్సిల్ బాధ్యతని పేర్కొన్నారు. న్యాయశాస్త్ర పట్టభద్రులు న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించే క్రమంలో అనవసర జాప్యం లేకుండా ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను మరింత సరళీకృతం చేస్తామని బార్ కౌన్సిల్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కార్యక్రమం ముగింపులో నూతనంగా న్యాయవాదులుగా ఎన్‌రోల్ అయిన 700 మందికి శుభాకాంక్షలు తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Anirudh Kavya Maran Reception | అంగరంగ వైభవంగా అనిరుధ్, కావ్య మారన్ రిసెప్షన్
- ●Kavya and Anirudh's wedding reception | కావ్య.. అనిరుధ్ ల రిసెప్షన్ కు సీఎం రేవంత్, కవిత
- ●Telangana Congress | అసమ్మతి జ్వాలలు ఆగేనా?
- ●Bandi Sanjay | బీజేపీ గెలిస్తే కుల సంఘాలకు శాశ్వత భవనాలు
- ●Keethy Suresh | అందుకే సినిమా ప్రమోషన్స్‌లో కనిపించడు - భర్తపై కీర్తి సురేష్ కామెంట్స్
- ●Harish Rao Paddy Procurement Telangana | తుఫాన్ ముప్పు పొంచి ఉన్నా వడ్లు కొనరా?

Anirudh Kavya Maran Reception | అంగరంగ వైభవంగా అనిరుధ్, కావ్య మారన్ రిసెప్షన్

Kavya and Anirudh's wedding reception | కావ్య.. అనిరుధ్ ల రిసెప్షన్ కు సీఎం రేవంత్, కవిత

Telangana Congress | అసమ్మతి జ్వాలలు ఆగేనా?

Bandi Sanjay | బీజేపీ గెలిస్తే కుల సంఘాలకు శాశ్వత భవనాలు



