త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | అసలు రూట్‌లో కాకుండా డొంక‌ మార్గంలో.. దారిత‌ప్పిన డిప్యూటీ సీఎం కాన్వాయ్‌..

Bhatti Vikramarka | ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. ఒక రూట్‌లో వెళ్లాల్సిన కాన్వాయ్‌ని (Convoy) మ‌రో మార్గంలో పోలీసులు తీసుకెళ్లారు. దీంతో కొద్ది దూరం వెళ్లిన త‌ర్వాత మందుకు వెళ్ల‌డానికి మార్గం లేక‌పోవ‌డంతో డిప్యూటీ సీఎం (Deputy CM) 20 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వ‌చ్చింది.

G

Telangana | Published On Jul 4, 2026, 7.50 am IST

Bhatti Vikramarka | అసలు రూట్‌లో కాకుండా డొంక‌ మార్గంలో.. దారిత‌ప్పిన డిప్యూటీ సీఎం కాన్వాయ్‌..
Advertisement

Bhatti Vikramarka | త్రినేత్ర‌.న్యూస్‌: ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. ఒక రూట్‌లో వెళ్లాల్సిన కాన్వాయ్‌ని (Convoy) మ‌రో మార్గంలో పోలీసులు తీసుకెళ్లారు. దీంతో కొద్ది దూరం వెళ్లిన త‌ర్వాత మందుకు వెళ్ల‌డానికి మార్గం లేక‌పోవ‌డంతో డిప్యూటీ సీఎం (Deputy CM) 20 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ముందుండి కాన్వాయ్‌ని దారిత‌ప్పేలా చేసిన ఎస్ఐపీ ఉన్న‌తాధికారులు చ‌ర్చ‌లు తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న జూలై 1న జ‌రిగింది.

గ‌త బుధ‌వారం రాత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని (Madhira) ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి వెళ్తున్నారు. అయితే అక్క‌డికి వెళ్లాలంటే కోదాడ (Kodad0 మీదుగా పోవాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ కోదాడ బైపాస్‌ మీదుగా దుర్గాపురం స్టేజీ దగ్గర ఉన్న ఖమ్మం బైపాస్‌ నుంచి నేలకొండపల్లి మీదుగా వల్లభికి వెళ్లాలి. దీంతో కాన్వాయ్‌ను వల్లభికి చేర్చే బాధ్యతను ఉన్నతాధికారులు కోదాడ రూరల్‌ ఎస్‌ఐ గోపాల్‌రెడ్డికి అప్పగించారు.

డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ రాత్రి 9 గంటలకు కోదాడ బైపాస్‌ వద్దకు చేరుకుంది. కాన్వాయ్‌ను అనంతగిరి మండలం తమ్మరబండపాలెం మీదుగా డొంక దారిన ఎస్ఐ గోపాల్‌రెడ్డి తీసుకువెళ్లారు. తమ్మరబండపాలెం శివారులోకి వెళ్లగానే రహదారి లేకపోవడంతో కాన్వాయ్‌ ఆగిపోయింది. 20 నిమిషాల‌పాటు అక్క‌డే వేచి ఉండాల్సి వ‌చ్చింది. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఐజీ, డీజీపీని ఆదేశించారు. కాగా, సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు కోదాడ డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డి.. కొండపల్లి నుంచి వల్లభి గ్రామం వైపు కాన్వాయ్‌ను పంపించారు. ఈ ఘటనపై విచారణ చేసిన ఎస్పీ.. కోదాడ రూరల్‌ ఎస్‌ఐ గోపాల్‌రెడ్డిని వీఆర్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Advertisement