Argentina vs Cabo Verde | ముగిసిన కాబో వెర్డే పోరాటం
Argentina vs Cabo Verde | ఫిఫా ప్రపంచకప్‌లో కాబో వెర్డే పోరాటం ముగిసింది. తొలిసారిగా విశ్వకప్ బరిలోకి దిగిన జట్టు.. అందరి అంచనాలను ఆఫ్రికన్ దేశం తలకిందులు చేసింది. తొలి ప్రయత్నంలోనే మాజీ చాంపియన్లకు సైతం షాక్ ఇస్తూ రౌండర్ ఆఫ్ 32లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో మాజీ చాంపియన్ అర్జెంటీనాతో పోరాడి ఓటమిపాలైంది.
- నాకౌట్‌లో అర్జెంటీనాపై పోరాడి ఓడిన జట్టు
- ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో విజయం సాధించిన మాజీ చాంపియన్
- అర్జెంటీనాను వణికించిన బ్లూ షార్క్స్ జట్టు
- 3-2 తేడాతో రౌండ్ ఫ్రీకార్టర్స్‌లోకి అర్జెంటీనా
Argentina vs Cabo Verde | ఫిఫా ప్రపంచకప్‌లో కాబో వెర్డే పోరాటం ముగిసింది. తొలిసారిగా విశ్వకప్ బరిలోకి దిగిన జట్టు.. అందరి అంచనాలను ఆఫ్రికన్ దేశం తలకిందులు చేసింది. తొలి ప్రయత్నంలోనే మాజీ చాంపియన్లకు సైతం షాక్ ఇస్తూ రౌండర్ ఆఫ్ 32లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో మాజీ చాంపియన్ అర్జెంటీనాతో పోరాడి ఓటమిపాలైంది. ఓ దశలో అర్జెంటీనాను ఓడించినంత పని చేసినా.. ఎక్స్‌ట్రా టైమ్‌లో తలవంచాల్సి వచ్చింది. తొలిసారి బరిలోకి దిగిన ఈ చిన్న దేశం జట్టు అసాధారణ పోరాట పటిమతో ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. 120 నిమిషాలపాటు జరిగిన ఉత్కంఠభరిత పోరులో అర్జెంటీనా 3-2తో విజయం సాధించి ప్రీక్వార్టర్స్ (రౌండ్ ఆఫ్-16)లోకి అడుగుపెట్టింది. మ్యాచ్‌లో రెండుసార్లు వెనుకబడిన కాబో వెర్డే ప్రతిసారీ స్కోరును సమం చేస్తూ డిఫెండింగ్ ఛాంపియన్లకు గట్టి సవాల్ విసిరింది. చివరకు అదనపు సమయంలో క్రిస్టియన్ రొమెరో గోల్ అర్జెంటీనాకు ఊరటనిచ్చింది. ప్రపంచకప్‌లో తన 30వ మ్యాచ్ ఆడిన లియోనెల్ మెస్సీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలి గోల్ చేయడం ద్వారా ప్రపంచకప్ చరిత్రలో 20 గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. మ్యాచ్‌లో గెలిచింది అర్జెంటీనా అయినా.. అందరి ప్రశంసలు అందుకున్నది మాత్రం కాబో వెర్డే జట్టే. అర్జెంటీనా ఎటాక్‌ను తట్టుకొని.. ప్రతి ఎదురుదెబ్బకు ధైర్యంగా బదులిచ్చింది. చివరకు అదృష్టం కలిసిరాకపోవడంతో ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.
మెస్సీ మరో మైలురాయి
మ్యాచ్ ఆరంభం నుంచే అర్జెంటీనా బంతిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మెస్సీ తొలి ప్రయత్నం ఫ్రీకిక్‌తో గోల్‌కు ప్రయత్నించగా.. గోల్‌కీపర్ వోజిన్హా సులభంగా అడ్డుకున్నాడు. నహుయెల్ మోలినా, ఎంజో ఫెర్నాండెజ్‌కు అవకాశాలు వచ్చినా గోల్స్‌గా మార్చలేకపోయారు. అయితే, కాబో వెర్డే మాత్రం ఏమాత్రం బెదరలేదు. కట్టుదిట్టమైన డిఫెన్స్‌తో అర్జెంటీనాను నిలువరించింది. మిడ్‌ఫీల్డ్‌లో కెవిన్ పినా జట్టుకు అండగా నిలిచాడు. బంతి ఎక్కువసేపు అర్జెంటీనా ఆధీనంలో ఉన్నా స్పష్టమైన అవకాశాలు మాత్రం చాలా తక్కువగానే వచ్చాయి. 29వ నిమిషంలో లిసాండ్రో మార్టినెజ్ అందించిన అద్భుతమైన లాంగ్ పాస్‌ను మెస్సీ చక్కగా నియంత్రించి, వోజిన్హాపై నుంచి బంతిని లిఫ్ట్ చేస్తూ గోల్ సాధించాడు. దీంతో ప్రపంచకప్ చరిత్రలో 20 గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా మెస్సీ కొత్త రికార్డు నెలకొల్పాడు.
వోజిన్హా అద్భుత ప్రదర్శన..
ఈ మ్యాచ్‌లో కాబో వెర్డే గోల్‌కీపర్ వోజిన్హా ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. కొన్ని సందర్భాల్లో బంతిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు రెండో ప్రయత్నం చేయాల్సి వచ్చినా.. ఒత్తిడికి ఏమాత్రం లొంగలేదు. అర్జెంటీనా ఆటగాళ్లు తనపై ఒత్తిడి తీసుకొచ్చే వరకు ప్రశాంతంగా బంతిని కాళ్ల వద్దే ఉంచి.. సరైన సమయంలో సహచరులకు పాస్ చేశాడు. ఒక దశలో మెస్సీనే పెనాల్టీ బాక్స్‌లోకి ఆహ్వానించినట్టుగా ఆడడం కాబో వెర్డే ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. విరామం అనంతరం కాబో వెర్డే మరింత దూకుడుగా ఆడింది. మొదట డెరాయ్ డువార్టే దూరం నుంచి కొట్టిన షాట్‌ను ఎమిలియానో మార్టినెజ్ అడ్డుకున్నాడు. అయితే, కొద్ది సేపటికే ర్యాన్ మెండెస్ కుడివైపు నుంచి ఇచ్చిన అద్భుతమైన పాస్‌ను డువార్టే టూ టచ్‌ల్లోనే గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు. ఈ గోల్ తర్వాత అర్జెంటీనా కొంతసేపు తడబడింది. మెస్సీకి లభించిన సువర్ణావకాశం వృథా కాగా.. వోజిన్హా మరో కీలక సేవ్‌తో అర్జెంటీనాను నిరాశపరిచాడు. మరోవైపు కాబో వెర్డే కట్టుదిట్టమైన డిఫెన్స్‌తో పాటు అవకాశం వచ్చినప్పుడల్లా ఎదురుదాడి చేసింది.
అదనపు సమయంలోనూ తగ్గని పోరాటం
అదనపు సమయం ప్రారంభమైన మూడు నిమిషాల్లోనే మెస్సీ కార్నర్‌తో ప్రత్యర్థి బాక్స్‌లో గందరగోళం నెలకొంది. బంతి లిసాండ్రో మార్టినెజ్ వద్దకు చేరగా.. బలంగా కొట్టి అర్జెంటీనాకు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. ఇక మ్యాచ్ ముగిసిందని అందరూ భావించిన వేళ కాబో వెర్డే మరోసారి తన సత్తా ఏంటో చాటుకుంది. ఎడమవైపు నుంచి బంతిని అందుకున్న లారోస్ కబ్రాల్ లోపలికి కట్ చేస్తూ అద్భుతమైన కర్లింగ్ షాట్‌ను టాప్ కార్నర్‌లోకి పంపించాడు. అది షాటా, క్రాసా అన్నది పక్కన పెడితే.. ఆ గోల్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. దీంతో స్కోరు మరోసారి 2-2గా మారింది. మ్యాచ్ పెనాల్టీ దిశగా మ్యాచ్ సాగుతున్న సమయంలో అర్జెంటీనాకు అదృష్టం కలిసి వచ్చింది. అదనపు సమయం చివర్లో నికోలాస్ గొంజాలెజ్ సాధించిన కార్నర్‌ను మెస్సీ బాక్స్‌లోకి పంపాడు. క్రిస్టియన్ రొమెరో హెడ్డర్ ప్రయత్నించగా.. కాబో వెర్డే డిఫెండర్ డినే బోర్జెస్ చేతికి బంతి తాకి దిశ మారి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. అదే మ్యాచ్ విజేతను నిర్ణయించింది.
అయినా, కాబో వెర్డే చివరి వరకు పోరాటం ఆపలేదు. కబ్రాల్ తీసిన అద్భుతమైన ఫ్రీకిక్‌ను ఎమిలియానో మార్టినెజ్ అద్భుతంగా అడ్డుకున్నాడు. చివరి నిమిషాల్లో అర్జెంటీనా మరో గోల్ కోసం ప్రయత్నించకుండా ఆధిక్యాన్ని కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టింది. చివరి విజిల్ మోగిన వెంటనే అర్జెంటీనా ఆటగాళ్లలో సంబరాల కంటే ఊరట పొందడమే కనిపించింది. ఈ విజయంతో రౌండ్ ఆఫ్-16కు చేరిన అర్జెంటీనా జట్టు.. ఈజిప్ట్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయి ఇంటిబాట పట్టిన కాబో వెర్డే అద్భుత ప్రదర్శనతో యావత్ క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. టోర్నీలో అత్యల్ప ర్యాంకింగ్‌తో బరిలోకి దిగిన ఈ జట్టు గ్రూప్ దశ దాటుతుందని కూడా ఊహించలేదు. ప్రపంచ ఛాంపియన్లను 120 నిమిషాల పాటు తీవ్ర ఒత్తిడిలోకి నెట్టి ఫుట్‌బాల్ ప్రపంచం మన్ననలు పొందింది. రౌండ్ ఆఫ్ 16లో చోటు దక్కించుకోకపోయినా.. 2026 ప్రపంచకప్‌లో చిరస్థాయిగా గుర్తుండిపోయే జట్లలో కాబో వెర్డే ఒకటిగా నిలిచిపోయింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Egypt vs Australia | పెనాల్టీ షూటౌట్లో ఫరోస్ జోరు..
జులై 4, 2026

Preity Zinta | డీప్‌ఫేక్ కంటెంట్‌పై హైకోర్టును ఆశ్రయించిన ప్రీతి జింతా.. వెబ్సైట్లకు మార్గదర్శకాలపై కోర్టు ఆదేశాలు
జులై 3, 2026

Chandralok Complex | చంద్రలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిమాపక భద్రతా లోపాలు.. నోటీసులు జారీ చేసిన ఫైర్ శాఖ
జులై 3, 2026
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | అసలు రూట్లో కాకుండా డొంక మార్గంలో.. దారితప్పిన డిప్యూటీ సీఎం కాన్వాయ్..
- ●Divorce for Snoring | రాత్రిళ్లు నీ గురక భరించలేపోతున్నా.. భర్తను విడాకులు కోరిన భార్య
- ●Egypt vs Australia | పెనాల్టీ షూటౌట్లో ఫరోస్ జోరు..
- ●Sun Transit in Cancer | కర్కాటక రాశిలోకి సూర్యుడు.. జూలై 16 నుంచి కుండపోత వర్షాలు..!
- ●Police Recruitment | పోలీసు శాఖలో 5 వేల కొలువులు.. త్వరలో నోటిఫికేషన్
- ●Horoscope | జూలై 4 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అదృష్టం అంతగా కలిసిరాదు!

Bhatti Vikramarka | అసలు రూట్లో కాకుండా డొంక మార్గంలో.. దారితప్పిన డిప్యూటీ సీఎం కాన్వాయ్..

Divorce for Snoring | రాత్రిళ్లు నీ గురక భరించలేపోతున్నా.. భర్తను విడాకులు కోరిన భార్య

Egypt vs Australia | పెనాల్టీ షూటౌట్లో ఫరోస్ జోరు..

Sun Transit in Cancer | కర్కాటక రాశిలోకి సూర్యుడు.. జూలై 16 నుంచి కుండపోత వర్షాలు..!



