త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | సింగ‌రేణి కుంభ‌కోణంపై భ‌ట్టి రెస్పాండ‌వ‌డం సంతోష‌మే.. కానీ ఏదేదో మాట్లాడిండు

Bhatti Vikramarka | రెండు నెలల తర్వాత సింగరేణి ఇష్యూపై డిప్యూటీ సీఎం మల్లు భ‌ట్టి విక్రమార్క స్పందించ‌డం సంతోష‌క‌ర‌మ‌ని.. కానీ సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడార‌ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణంపై హరీశ్‌రావు గొంతెత్తితేనే నైని బొగ్గు బ్లాక్ టెండర్‌ను రద్దు చేశార‌ని గుర్తు చేశారు. 42 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గుపై అనేక మంది అనుమానాలు వ్యక్తం చేశారన్నారు.

S

Telangana | Published On Jul 3, 2026, 7.24 pm IST

Bhatti Vikramarka | సింగ‌రేణి కుంభ‌కోణంపై భ‌ట్టి రెస్పాండ‌వ‌డం సంతోష‌మే.. కానీ ఏదేదో మాట్లాడిండు
Advertisement
  • నైని బొగ్గు బ్లాక్ టెండ‌ర్ ర‌ద్దు చేసి మిగ‌తా తొమ్మిదింటిని ఎందుకు వ‌దిలేశారు
  • 42 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బొగ్గుపై అనుమానాలున్న‌య్‌
  • రూ.1600 కోట్ల కుంభకోణం జరిగింది
  • ఇందులో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రమేయం ఉంది
  • మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ తీవ్ర ఆరోప‌ణ‌లు

Bhatti Vikramarka | త్రినేత్ర‌.న్యూస్‌: రెండు నెలల తర్వాత సింగరేణి ఇష్యూపై డిప్యూటీ సీఎం మల్లు భ‌ట్టి విక్రమార్క స్పందించ‌డం సంతోష‌క‌ర‌మ‌ని.. కానీ సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడార‌ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణంపై హరీశ్‌రావు గొంతెత్తితేనే నైని బొగ్గు బ్లాక్ టెండర్‌ను రద్దు చేశార‌ని గుర్తు చేశారు. కానీ మిగిలిన 9 టెండర్ల‌ను ఎందుకు రద్దు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. శుక్ర‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 42 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గుపై అనేక మంది అనుమానాలు వ్యక్తం చేశారన్నారు.

సింగరేణిలో ఏం జరుగుతుందని యాజమాన్యం, కార్మికులు ఆందోళనలో ఉన్నారు. కుంభకోణంపై మా నాయకుడు హరీష్ రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కుంభకోణంపై భ‌ట్టి విక్రమార్క ఏదేదో మాట్లాడారు. 130 సంవత్సరాల అనుభవం క‌లిగిన ఆర్థిక వనరు అయిన‌ సింగరేణి నేడు తల్లడిల్లుతోంది. సింగరేణిలో ప్రభుత్వ పెద్దలు కొందరు ఇన్వాల్వ్‌ అయ్యారు. సైట్ విజిట్ సర్టిఫికెట్‌తో వేల కోట్ల రూపాయల నష్టం చేశారు అని కొప్పుల ఆరోపించారు.

శ్రీరాంపూర్ టెండర్ 10 శాతం మైనస్‌కు వెళ్లడం ఏంటి?

కేసీఆర్ హయాంలో సింగరేణి కార్మికులకు మరిన్ని సౌకర్యాలు పెంచేందుకు కృషి చేశారు. మైనస్ 12తో రూ.600 కోట్లతో OCP 3 మైల్ టెండర్‌ను పిలిచారు. దీన్ని కేసీఆర్ హయాంలో 22 శాతం ప్లస్ కోడ్ చేసి టెండర్ పిలిచారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సింగరేణిలో రూ.300 కోట్ల రూపాయల నష్టం జరిగింది. శ్రీరాంపూర్ టెండర్ 10 శాతం మైనస్‌కు వెళ్లడం ఏంటి? ఈ ప్ర‌భుత్వం సింగరేణితో పాటు సోలార్ కుంభకోణానికి పాల్పడింది. సోలార్ టెండర్‌లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. ఒక్కో మెగావాటుకు 4 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. ఆనాడు పవర్ ఉత్పత్తి పెంచాలని కేసీఆర్ ఆలోచన చేసి 600 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మించారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇచ్చారు అని కొప్పుల ఈశ్వ‌ర్ గుర్తు చేశారు.

పాకిస్థాన్ స‌రిహ‌ద్దులో పెట్టడం ఎందుకు?

రాజస్థాన్ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ ఒప్పద్దం చేసుకుంది. 1400 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను పాకిస్థాన్ బోర్డర్‌లో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది. ఏయే డివిజన్‌లో ఎంత బొగ్గు ఉందో మా నాయకుడు హరీష్ రావు క్షేత్ర స్థాయిలో వెళ్లి చూస్తే అక్కడ బొగ్గు లేదు. ఇందులో 1600 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రమేయం ఉంది. జరుగుతున్న పరిణామాలపై అధికారులు మాట్లాడితే వారిని బదిలీ చేశారు అని మాజీ మంత్రి కొప్పుల మండిప‌డ్డారు.

గురుకుల అవినీతిపై అడ్లూరి స‌మాధానం చెప్పాలి..

అడ్లూరీ లక్షణ్‌ను నేను ఒక్కటే అడుగుతున్న. గురుకుల పాఠశాల తీసుకొచ్చిన చరిత్ర కేసీఆర్ అని గుర్తుపెట్టుకో. గురుకుల పాఠశాల టెండర్‌లో కుంభకోణం జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. అవినీతి జరిగిందో లేదో మంత్రులు జవాబు చెప్పాలి. గురుకుల ఓపెన్ టెండర్‌తో చేనేత కార్మికులకు లిట్ క్యాప్ వాళ్ళకి టెండర్ రాకుండా పోయింది. గుజరాత్ వారికి 1800 కోట్ల రూపాయల టెండర్ ఒక్కరికే ఎందుకు కట్టబెట్టారో మంత్రి అడ్లూరీ సమాధానం చెప్పాలి. లెదర్ పరిశ్రమ అంటే మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువ ఉంటారు. అడ్లూరి మాదిగల నోరు కొట్టారు. గన్‌పార్క్ వద్ద కూర్చునే అర్హత ఆయ‌న‌కు లేదు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన ప్రతి పైసా వారికే ఖర్చు కావాలని మేం ఆనాడే ఆలోచన చేశాం. గ‌న్‌పార్క్ వద్దకు మమ్మల్ని అనుమతిస్తే మంత్రుల బండారం బయటపడేది అని కొప్పుల ఈశ్వ‌ర్ పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement