Woman Kills Husband | భర్తను చంపి బాత్‌రూమ్ కింద పాతిపెట్టింది..
Woman Kills Husband | ప్రియుడి కోసం కట్టుకున్నోడిని చంపేయడం, పెండ్లి ఇష్టం లేదని చేసుకోబోయేవాడి అడ్డు తొలగించుకోవడం, తరచూ తాగి వచ్చి గొడవపతున్నాడని భర్తలను కాటికి పంపిస్తున్న మహిళల వార్తలు ప్రతిరోజూ కనిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనే మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది..
Woman Kills Husband | త్రినేత్ర.న్యూస్: ప్రియుడి కోసం కట్టుకున్నోడిని చంపేయడం, పెండ్లి ఇష్టం లేదని చేసుకోబోయేవాడి అడ్డు తొలగించుకోవడం, తరచూ తాగి వచ్చి గొడవపతున్నాడని భర్తలను కాటికి పంపిస్తున్న మహిళల వార్తలు ప్రతిరోజూ కనిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనే మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.. భర్తను చంపి బాత్‌రూమ్‌లో (Woman Kills Husband) పాతి పెట్టిన భార్య.. అతడు కనిపించకుండా పోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారితో కసిలి స్వయంగా భర్తకోసం వెతికింది. అయితే 45 రోజుల తర్వాత అసలు విషయం బయటపడింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న దహతోరాకు చెందిన రూబీ శర్మ, సురేంద్ర శర్మ (44) భార్యాభర్తలు. 16 ఏండ్ల క్రితం వివాహమైన వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి అలవాటుపడిన సురేంద్ర శర్మ.. రోజూ తాగివచ్చి భార్యతో గొడవపడేవాడు. దీంతో విసిగిపోయిన ఆమె.. గత నెల తన ఇద్దరు కుమార్కెలను సురేంద్ర పెద్దన్నయ్య ఇంటికి పంపించింది. ఆ తర్వాత భర్తకు ఇష్టమైన ఖీర్ (పరమాన్నం)లో నిద్రమాత్రలు కలిపి తినిపించింది. అతను స్పృహ కోల్పోగానే గొంతు నులిమి హత్య చేసింది. మరుసటి రోజు ఉదయం ఇంట్లోని బాత్‌రూమ్ ఫ్లోర్‌ను (Bathroom floor) తవ్వి భర్త శవాన్ని అందులో పూడ్చేసింది. అంతటితో ఆగకుండా, ఆ ప్రదేశంపై సిమెంట్‌తో ప్లాస్టరింగ్ చేయించి, కొత్తగా టైల్స్ వేయించింది.

45 రోజులపాటు నాటకం..
మే 18 నుంచి సురేంద్ర శర్మ కనిపించకుండా పోవడంతో.. మే 26న పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. చుట్టుపక్కల వారు, బంధువుల ముందు భర్త కనిపించడం లేదంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉండేది. పోలీసులతో కలిసి భర్త కోసం వెతుకుతున్నట్లు నటించింది. ఎంత ప్రయత్నించినా పోలీసులు అతడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. అయితే, సురేంద్ర అన్నయ్య అనిల్ శర్మకు రూబీ ప్రవర్తనపై, ఆమె చెబుతున్న మాటలపై అనుమానం వచ్చింది.
సురేంద్ర శర్మకు సంబంధించి ఓ పాత కేసు విచారణలో భాగంగా శుక్రవారం పోలీసులు వారి ఇంటికి వెళ్లారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన రూబీ భయపడుతూ వారికి కనిపించింది. అనుమానం వచ్చిన పోలీసులు ఇల్లంతా తనిఖీ చేయగా, బాత్‌రూమ్‌లో కొత్తగా వేసిన టైల్స్, ప్లాస్టరింగ్ వారి దృష్టిలో పడ్డాయి. దీంతో తమదైన శైలిలో ఆమెను విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకుంది. అనంతరం కార్మికుల సహాయంతో బాత్‌రూమ్ ఫ్లోర్‌ను పగలగొట్టి, లోపల కుళ్లిపోయిన స్థితిలో ఉన్న సురేంద్ర శర్మ మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో 45 రోజుల రూబీ నాటకానికి తెరపడింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Laptop | ఆఫీస్ పనికోసం ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా.. ఈ 5 మోడల్స్‌పై లుక్కేయండి..
- ●Kashi Vishwanath temple | కాశీ విశ్వనాథ్ ఆలయం వద్ద కాల్పుల కలకలం.. ముగ్గురికి గాయాలు
- ●Kavitha | కవితకు ఈసీ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చుకోవాల్సిందే!
- ●Bandla Ganesh | ఆస్తి వేలం కేసులో బండ్ల గణేష్‌కు షాకిచ్చిన హైకోర్టు
- ●Colombia vs Ghana | కొలంబియాకు ప్రీక్వార్టర్స్ బెర్త్..
- ●Heavy Rains | నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..

Laptop | ఆఫీస్ పనికోసం ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా.. ఈ 5 మోడల్స్‌పై లుక్కేయండి..

Kashi Vishwanath temple | కాశీ విశ్వనాథ్ ఆలయం వద్ద కాల్పుల కలకలం.. ముగ్గురికి గాయాలు

Kavitha | కవితకు ఈసీ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చుకోవాల్సిందే!

Bandla Ganesh | ఆస్తి వేలం కేసులో బండ్ల గణేష్‌కు షాకిచ్చిన హైకోర్టు






