Revanth Reddy | బేగంపేట ఎయిర్‌పోర్టుకు కూడా వెళ్లలేకపోతున్న రేవంత్.. సీఎం కోసం ఎంసీహెచ్ఆర్డీలో హెలిప్యాడ్
Revanth Reddy | రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్‌కు వెళ్లడం ఎప్పుడో మానేసిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) .. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచే అధికారిక కార్యకలాపాలు కానిచ్చేస్తున్నారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్‌కు వెళ్లడం ఎప్పుడో మానేసిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) .. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచే అధికారిక కార్యకలాపాలు కానిచ్చేస్తున్నారు. అధికారులతో సమావేశాలు, అతిథులతో భేటీలు అన్నీ అక్కడే నిర్వహిస్తున్నారు. ఎక్కువ మందితో సమావేశాలు నిర్వహించాల్సి వస్తే బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (CCC) లేదా జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రానికి (MCR HRD) వెళ్తున్నారు. మంత్రి మండలి సమావేశం అయితే తప్ప సెక్రటేరియట్ వైపు కన్నెత్తి చూడటం లేదు.
ఇటీవల జిల్లాల పర్యటనలతో బిజీగా ఉన్న సీఎం రేవంత్.. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో వెళ్తున్నారు. ప్రతీసారి అంతదూరం ఎందుకు వెళ్లాలని అనుకున్నారో ఏమో.. తన నివాసానికి దగ్గరలో ఉన్న ఎంసీహెచ్ఆర్డీలో హెలిప్యాడ్ (Helipad) నిర్మింపజేసుకున్నారు. ఇకపై అక్కడి నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లనున్నారు. తాజాగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ పర్యటనకు కూడా అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయానికి కూడా వెళ్లేందుకు ముఖ్యమంత్రి ఇబ్బంది పడుతున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

సీఎం పర్యటన ఇలా..
ప్రజా ప్రతినిధిగా ఎన్నికై సీఎం రేవంత్ రెడ్డి శనివారం నాటికి 20 ఏండ్లు పూర్తి చేసుకున్నారు. 2006, జూలై 4న మిడ్జిల్ (Midjil) జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలకు `కృతజ్ఞత వందన సభ`తో సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలుపనున్నారు. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం మిడ్జిల్ వెళ్తున్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
ముందుగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఊర్కొండ మండలం ఊర్కొండపేట ఆంజనేయుడిని దర్శించుకున్నారు. అనంతరం అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. ఆలయ ఆవరణలో నాటి అనుచరులు, ముఖ్యనేతలతో సమావేశమవుతారు.
అక్కడి నుంచి మిడ్జిల్ మండలం వెల్జాల ఎక్స్‌రోడ్డుకు చేరుకుని స్థానిక నేత గోపాల్ రెడ్డి, బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత మిడ్జిల్ బహిరంగ సభలో పాల్గొంటారు.

సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం






