Sun Transit in Cancer | కర్కాటక రాశిలోకి సూర్యుడు.. జూలై 16 నుంచి కుండపోత వర్షాలు..!
Sun Transit in Cancer | గ్రహాలు తమ గమనాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఆయా రాశుల్లోకి గ్రహాలు ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ ఏడాది జూలై 16న సూర్యుడు( Sun ) మిథున రాశి( Gemini )ని విడిచి కర్కాటక రాశి( Cancer )లోకి ప్రవేశించనున్నాడు. 16 రాత్రి 11.44 గంటల నుంచి ఆగస్టు 17 వరకు అంటే నెల రోజుల పాటు కర్కాటక రాశిలోనే సూర్యుడు( Sun transit in cancer ) సంచరిస్తాడు.
Devotional | Published On Jul 4, 2026, 7.07 am IST
Sun Transit in Cancer | గ్రహాలు తమ గమనాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఆయా రాశుల్లోకి గ్రహాలు ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ ఏడాది జూలై 16న సూర్యుడు( Sun ) మిథున రాశి( Gemini )ని విడిచి కర్కాటక రాశి( Cancer )లోకి ప్రవేశించనున్నాడు. 16 రాత్రి 11.44 గంటల నుంచి ఆగస్టు 17 వరకు అంటే నెల రోజుల పాటు కర్కాటక రాశిలోనే సూర్యుడు( Sun transit in cancer ) సంచరిస్తాడు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఇక సూర్యచంద్రుల మధ్య స్నేహపూర్వక సంబంధం ఉంటుంది కాబట్టి.. ఈ గ్రహ సంచారాన్ని శుభప్రదంగా భావిస్తారు. జీవరాశికి అనుకూలమైనది పరిగణిస్తారు. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశం కారణంగా ముఖ్యంగా వ్యవసాయం, వాతావరణ పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో మంచి పురోగతి ఉంటుందని నమ్మకం. వర్షాలు కూడా సమృద్ధిగా కురిసి సాగుకు అనుకూలంగా ఉంటుందని విశ్వాసం. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు లాభం జరుగుతుందని, తద్వారా వారి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని నమ్ముతుంటారు. ఆహార ఉత్పత్తులు కూడా పెరిగి వినియోగదారుల డిమాండ్‌కు తగ్గట్టు దిగుబడి కూడా ఉంటుందని నమ్మకం.
ఎందుకంటే.. కర్కాటక రాశిని జల రాశిగా పరిగణిస్తారు ఈ రాశి మరి ముఖ్యంగా వర్షపాతం, నదులు, నీటి వనరులు, వ్యవసాయంతో నేరుగా ముడిపడి ఉంటుంది. అందువల్ల, సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించడం చురుకైన రుతుపవనాలను సూచిస్తుంది. కుండపోత వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కాలంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో సాగునీటి ప్రాజెక్టులతో పాటు భూగర్భ జలాల్లో నీటిమట్టం పెరిగి ఖరీఫ్ పంటలకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే, వాస్తవ రుతుపవనాల పరిస్థితి భారత వాతావరణ శాఖ (IMD) యొక్క శాస్త్రీయ సమాచారం వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
సంబంధిత వార్తలు

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
జులై 13, 2026

Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి వారు జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు..!
జులై 12, 2026

Horoscope | జూలై 12 రాశిఫలాలు.. ఈ రాశి వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి..!
జులై 12, 2026
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!



