TG NEET UG Ranks | KNRUHS నీట్ యూజీ 2026 స్టేట్ ర్యాంక్ జాబితా విడుదల.. టాపర్‌గా సహ్యు
TG NEET UG Ranks | వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) సంబంధించి నీట్ యూజీ 2026 ర్యాంక్‌లు శనివారం విడుదలయ్యాయి. ర్యాంక్‌ల వారీగా అర్హత సాధించిన జాబితాను సంబంధిత అధికారులు విడుదల చేశారు.
TG NEET UG Ranks త్రినేత్ర.న్యూస్: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) సంబంధించి నీట్ యూజీ 2026 ర్యాంక్‌లు శనివారం విడుదలయ్యాయి. ర్యాంక్‌ల వారీగా అర్హత సాధించిన జాబితాను సంబంధిత అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలోని వైద్య, దంత వైద్య (ఎంబీబీఎస్, బీడీఎస్) కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు మొత్తం 38,021 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. టాపర్‌గా వీరియగారి సహ్యు 705 మార్కులతో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 13 సాధించారు. బుర సాయి శరణ్ 701 మార్కులతో AIR 19, కందాగట్ల హనీష్ 700 మార్కులతో AIR 21 సాధించి సత్తా చాటారు. మహిళా అభ్యర్థుల్లో కొంపెల్ల సాయి గాయత్రి తేజోఅరుణిమ 693 మార్కులతో AIR 83 గా నిలిచారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ జాబితాను కేంద్ర వైద్యసేవల డైరెక్టర్ జనరల్ (డీజీహెచ్‌ఎస్) అందించిన సమాచారం ఆధారంగా రూపొందించారు.
తెలంగాణలో 85% రాష్ట్ర కోటా కింద ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) సీట్లలో 2026-27 అకాడమిక్ ఇయర్‌కు సంబంధించి ప్రవేశాలు కల్పించనున్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించిన తర్వాత, అర్హత ప్రకారం అన్ని ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను వెల్లడిస్తారు. అభ్యంతరాలుంటే వాటిని స్వీకరించిన అనంతరం, అడ్మిషన్ నిబంధనల ప్రకారం తుది మెరిట్ జాబితాను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు.
ప్రత్యేక కేటగిరీల మెరిట్ జాబితాలు..
ప్రత్యేక కేటగిరీల (NCC, CAP, PMC, PWD, SCCL (ఎంబీబీఎస్ కోసం మాత్రమే), ఆంగ్లో ఇండియన్ (బీడీఎస్ కోర్సు కోసం మాత్రమే)) మెరిట్ జాబితా విషయానికి వస్తే.. అవసరమైన సర్టిఫికెట్లను సమర్పించిన అనంతరం సంబంధిత శాఖల ఆమోదం మేరకు ఆయా కేటగిరీల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను ప్రదర్శిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ KNRUHS లో సందర్శించాలి.

తాజావార్తలు
- ●రీచార్జ్ నుంచి ATM ఛార్జీల దాకా.. మధ్యతరగతి జేబుకు చిల్లులు పెడుతున్న ‘డిజిటల్ దోపిడీ’!
- ●Harish Rao | తెలంగాణ నీటి హక్కులను రక్షించండి.. కేంద్ర జలశక్తి మంత్రికి హరీశ్‌రావు లేఖ
- ●Vijay-Sangeeta | సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక ట్విస్ట్.. పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత
- ●EV Charging Station | ఈవీ చార్జింగ్ స్టేషన్లకు భారీగా డిమాండ్.. స్వయం ఉపాధితో చక్కని ఆదాయం..
- ●Komatireddy | కాంట్రాక్టర్లను వేధించొద్దు.. గనులశాఖ అధికారులకు కోమటిరెడ్డి ఆదేశాలు
- ●Harish Rao | ‘మిషన్ భగీరథ’ అనేది పథకం కాదు.. ప్రజల జీవితాలను మార్చిన మహత్తర ప్రణాళిక

రీచార్జ్ నుంచి ATM ఛార్జీల దాకా.. మధ్యతరగతి జేబుకు చిల్లులు పెడుతున్న ‘డిజిటల్ దోపిడీ’!

Harish Rao | తెలంగాణ నీటి హక్కులను రక్షించండి.. కేంద్ర జలశక్తి మంత్రికి హరీశ్‌రావు లేఖ

Vijay-Sangeeta | సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక ట్విస్ట్.. పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత

EV Charging Station | ఈవీ చార్జింగ్ స్టేషన్లకు భారీగా డిమాండ్.. స్వయం ఉపాధితో చక్కని ఆదాయం..




