Kishan Reddy | పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. రాజకీయంగా వాడుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్: కిషన్ రెడ్డి
Kishan Reddy | ఇరాన్, అమెరికా యుద్ధం ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని (Petrol Diesel Price Hike) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయని చెప్పారు.
Kishan Reddy | త్రినేత్ర.న్యూస్: ఇరాన్, అమెరికా యుద్ధం ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని (Petrol Diesel Price Hike) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయని చెప్పారు. ఇది ప్రజల మీద భారం వేసేందుకు కాదన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని వెల్లడించారు.
క్రూడాయిల్ దిగుమతికి భారీగా ఖర్చవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. పని పాటలేని కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు దీనిని రాజకీయంగా వాడుకుంటున్నాయని విమర్శించారు. ప్రజలు ఈ లాంటి మాటలకు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై సగటున రూ.3 పెరిగిన విషయం తెలింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.50కు చేరగా, డీజిల్ రూ.98.70కి పెరిగింది. ఇక ఢిల్లీలో పెట్రోల్ రూ.97.77, డీజిల్ రూ.90.67, కోల్‌కతాలో పెట్రోల్ రూ.108.74, డీజిల్ రూ.95.13, ముంబైలో పెట్రోల్ రూ.106.68, డీజిల్ రూ.93.14, చెన్నైలో పెట్రోల్ రూ.103.67, డీజిల్ రూ.95.25గా ఉన్నాయి.
సీఎన్‌జీ కూడా..
మరోవైపు సంకుచిత సహజ వాయువు(సీఎన్‌జీ) రేట్లు కూడా పెరిగాయి. ఢిల్లీతో పాటు ముంబైలోనూ కిలోకి రూ.2 పెంచారు. పెరిగిన ధరలతో ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.87కి చేరింది. అయితే మిగతా నగరాల్లో మాత్రం సీఎన్‌జీ రేట్లలో మార్పు కనిపించడం లేదు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ
- ●Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ

Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం






