Harish Rao | ఐటీ పార్క్ నిర్మించాల్సిన చోట డంప్ యార్డా?.. ఆ జీవోను వెంటనే వెనక్కితీసుకోండి: హరీశ్ రావు
Harish Rao | ఐటీ పార్క్ (IT Park) నిర్మించాల్సిన చోట డంపింగ్ యార్డ్ (Dumping Yard) ఏర్పాటు చేస్తారా? అంటూ కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్‌లోని 86 ఎకరాల్లో డంప్ యార్డు (Siddapur Dumping Yard) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో నం. 641 తీసుకురావడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్: ఐటీ పార్క్ (IT Park) నిర్మించాల్సిన చోట డంపింగ్ యార్డ్ (Dumping Yard) ఏర్పాటు చేస్తారా? అంటూ కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్‌లోని 86 ఎకరాల్లో డంప్ యార్డు (Siddapur Dumping Yard) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో నం. 641 తీసుకురావడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. వెంటనే ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిద్ధాపూర్‌లో (Siddapur) డంప్ యార్డు ఏర్పాటు నిర్ణయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న స్థానిక రైతులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హైదరాబాద్‌లో తన నివాసంలో హరీశ్ రావుని కలిసి వినతిపత్రం అందజేశారు. డంప్ యార్డు వల్ల తాము ఏ విధంగా నష్టపోతున్నామో వివరిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పక్షాన పోరాడాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. రైతుల వినతిపై స్పందించిన హరీశ్ రావు ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.
పచ్చని వ్యవసాయ భూముల మధ్య, జనావాసాలకు సమీపంలో డంప్ యార్డు ఏర్పాటు చేయాలనుకోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది చెప్పారు. సిద్దాపూర్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న దాదాపు 20 గ్రామాలు ఈ డంప్ యార్డు వల్ల తీవ్రంగా నష్టపోతాయని చెప్పారు. ఈ గ్రామాల ప్రజలంతా పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి అవసరమైన కూరగాయలను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారని వెల్లడించారు. డంప్ యార్డు ఏర్పాటు చేయాలనుకుంటున్న స్థలానికి ఆనుకుని ఉన్న గుట్ట చెరువు నీటితోనే ఈ ప్రాంత రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు.
334 ఎకరాల్లో ఐటీ పార్క్..
చెరువు పక్కనే డంప్ యార్డు పెడితే ఆ నీరు పూర్తిగా కలుషితమై, సాగు నీటితో పాటు తాగునీటికీ తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎంతో ప్రసిద్ధి చెందిన జహంగీర్ పీర్ దర్గా (Jahangir Peer Dargah) కూడా ఇక్కడే ఉండటంతో, ఆ కాలుష్యం స్థానికులతో పాటు భక్తులకు కూడా శాపంగా మారుతుందని చెప్పారు. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో ఇదే ప్రాంతంలో, డంప్ యార్డుకు (Dump Yard) కేటాయించిన సర్వే నంబర్లు 252, 278, 361లో ఉన్న 334 ఎకరాల్లో ఐటీ పార్క్ నిర్మించాలని ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇక్కడ ఐటీ పార్క్ వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ సంకల్పించిందని వెల్లడించారు.
లేదంటే ఉద్యమిస్తాం..
కానీ, ఉపాధి కల్పించాల్సిన భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) డంప్ యార్డు ఏర్పాటు చేసి స్థానిక ప్రజల బతుకులను చిదిమేయాలని చూడటం శోచనీయమని చెప్పారు. యువతకు అవకాశాలు కల్పించాల్సిన చోట కాలుష్యాన్ని, రోగాలను ఇవ్వడమే ప్రజాపాలనా? ప్రభుత్వం డంప్ యార్డులను ఏర్పాటు చేయాలనుకుంటే ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగని చోట, జనావాసాలు, గ్రామాలు లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. కానీ ఇలా పచ్చని పల్లెలను, పొలాలను, రైతులను ఆగమాగం చేయడం ఏమాత్రం తగదని హితవుపలికారు. ప్రభుత్వం వెంటనే సిద్దాపూర్ డంప్ యార్డు నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నష్టపోతున్న ఆ 20 గ్రామాల ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని, స్థానిక రైతులకు అండగా నిలబడి పోరాడుతుందని హెచ్చరించారు.
తాజావార్తలు
- ●Monsoon | బలహీనంగానే నైరుతి రుతుపవనాలు.. ధరల పెరుగుదలపై పెరుగుతున్న ఆందోళన
- ●Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్
- ●Suicide | నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. భార్యకు వీడియో కాల్లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లిన భర్త
- ●Cristiano Ronaldo | ఇదే నా చివరి ప్రపంచకప్.. ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో
- ●Indian Railways | పిల్లలతో రైలు ప్రయాణం ? ఈ రైల్వే నిబంధన తెలియకపోతే జరిమానా తప్పదు..
- ●Bikers Perform Stunts | రెచ్చిపోయిన ఆకతాయిలు.. అంబులెన్స్‌కు దారివ్వకుండా

Monsoon | బలహీనంగానే నైరుతి రుతుపవనాలు.. ధరల పెరుగుదలపై పెరుగుతున్న ఆందోళన

Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్

Suicide | నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. భార్యకు వీడియో కాల్లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లిన భర్త

Cristiano Ronaldo | ఇదే నా చివరి ప్రపంచకప్.. ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో






