Kishan Reddy | వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.27 కోట్లతో అభివృద్ది పనులు.. ఏడాది చివరికి మెరుగైన సౌకర్యాలు: కిషన్‌రెడ్డి
Kishan Reddy | తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని వెల్లడించారు.
Kishan Reddy | త్రినేత్ర.న్యూస్: తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని వెల్లడించారు. ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషనను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అమృత్ భారత్లో భాగంగా రూ.27 కోట్లతో చేపట్టిన రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
అనంతరం మాట్లాడుతూ.. వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణతో పాటు రాష్ట్రంలో 42 రైల్వే స్టేషషన్లను ఏకకాలంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ.27 కోట్లతో వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఎస్కలేటర్, 2 లిఫ్టులు, క్యాంటీన్, దివ్యాంగులకు ఆధునిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. వికారాబాద్ ప్రాంత అభివృద్ధికి రైల్వే కనెక్టివిటీ ఎంతో కీలకమని, ఆధునికీకరణ పనులు పూర్తయిన తర్వాత ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందుతాయని చెప్పారు.
Inspected the Vikarabad Railway Station today, where modernisation works are currently underway at a cost of ₹27 crore.
Highlighted that, as part of the Government of India’s ongoing efforts to strengthen railway infrastructure across Telangana, 40 railway stations are being… pic.twitter.com/20lhnEjel1
— G Kishan Reddy (@kishanreddybjp) August 30, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి




