Bakki Venkataiah | బాధితులు వస్తే తక్షణమే స్పందించండి.. సామాజిక న్యాయం పాటించండి
Bakki Venkataiah | బాధితులు సమస్యలతో వస్తే అధికారులు, పోలీసులు తక్షణమే స్పందించాలని.. సామాజిక న్యాయం పాటించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కోరారు. పోలీస్ స్టేషన్లు, రెవన్యూ కార్యాలయాలతో పాటు ఎక్కడైనా సరే బాధితుల సమస్యలపై నిర్లక్ష్యం చేయొద్దన్నారు.
- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూముకుంట పౌర హక్కుల దినోత్సవంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశం
త్రినేత్ర.న్యూస్: బాధితులు సమస్యలతో వస్తే అధికారులు, పోలీసులు తక్షణమే స్పందించాలని.. సామాజిక న్యాయం పాటించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కోరారు. పోలీస్ స్టేషన్లు, రెవన్యూ కార్యాలయాలతో పాటు ఎక్కడైనా సరే బాధితుల సమస్యలపై నిర్లక్ష్యం చేయొద్దన్నారు. చట్టప్రకారం తక్షణమే స్పందించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీల పౌరహక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూముకుంటలో శనివారం నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించింది. ఎస్సీ, ఎస్టీలపై ఎలాంటి వివక్ష, సామాజిక అణచివేత, దాడులు, వేధింపులు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరూ సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయం విలువలను పాటించాలి. బాధితులు వచ్చినప్పుడు వారి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దు. చట్టప్రకారం తక్షణమే స్పందించాలి. దాడులు, అవమానాలు, భూవివాదాలు, సామాజిక వివక్షకు సంబంధించిన ఫిర్యాదులపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి.
జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పెండింగ్ భూములు, సంక్షేమ పథకాలు, పౌరహక్కుల ఉల్లంఘన కేసులను జిల్లా కలెక్టర్‌తో సమన్వయం చేసుకుని పరిష్కరించాలి. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలి. ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిరంతరం కృషి చేస్తుంది. బాధితులకు న్యాయం జరిగే వరకు కమిషన్ అండగా ఉంటుంది అని బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, రాంబాబు నాయక్, ఆర్డివో వెంకటరెడ్డి, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్





