NEET PG | నీట్ పీజీ పరీక్ష.. మద్యం తాగి వచ్చిన విద్యార్థి.. అనుమతించని సిబ్బంది
NEET PG | దేశవ్యాప్తంగా నీట్ పీజీ (NEET PG) పరీక్ష కొనసాగుతున్నది. రాష్ట్రంలో 17,627 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికోసం 56 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
NEET PG | త్రినేత్ర.న్యూస్: దేశవ్యాప్తంగా నీట్ పీజీ (NEET PG) పరీక్ష కొనసాగుతున్నది. రాష్ట్రంలో 17,627 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికోసం 56 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరుగుతున్న ఈ పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ముగియనుంది. కాగా, రంగారెడ్డి జిల్లా శేరిగూడలో ఓ విద్యార్థి మద్యం తాగి పరీక్ష రాసేందుకు వచ్చాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న అతడిని గుర్తించిన సిబ్బంది ఎగ్జామ్ హాల్‌లోకి అనుమతించలేదు. దేశవ్యాప్తంగా 1300 కేంద్రాల్లో ఈ పీజీ పరీక్ష జరుగుతున్నది. సెప్టెంబర్ 30న ఫలితాలను విడుదల చేస్తారు.
మారిన ఎగ్జామ్ ప్యాటర్న్
ఈ ఏడాది నీట్ పీజీ పరీక్ష విధానంలో ఎన్‌బీఈఎంఎస్ (NBEMS) కీలక మార్పులు ప్రవేశపెట్టింది. గతంలో ఉన్న 200 ప్రశ్నల స్థానంలో ఈసారి మొత్తం ప్రశ్నల సంఖ్యను 180కి తగ్గించారు. మొత్తం పరీక్షను 720 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఇవ్వనుండగా, తప్పు సమాధానానికి 1 మార్కు కోత (నెగెటివ్ మార్కింగ్) విధిస్తారు. ప్రశ్నపత్రాన్ని మొత్తం ఐదు సెక్షన్లుగా విభజించారు. ఒక్కో సెక్షన్‌లో 36 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్‌కు గరిష్టంగా 42 నిమిషాల సమయాన్ని నిర్దేశించారు. కేటాయించిన 42 నిమిషాల సమయం ముగియగానే స్క్రీన్‌పై ఆ సెక్షన్ ఆటోమేటిక్‌గా లాక్ అవుతుంది. అభ్యర్థులు ఒకసారి పూర్తి చేసిన సెక్షన్‌కు తిరిగి వెళ్లే అవకాశం ఉండదు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Obscene Content | టీచర్లు, విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు అసభ్యంగా మార్ఫింగ్.. కాలేజీ స్టూడెంట్ అరెస్ట్
సెప్టెంబర్ 4, 2026

Anganwadi Teachers | రంగారెడ్డి జిల్లాలో 125 అంగన్వాడీ టీచర్ పోస్టులు.. వచ్చేనెల 10 వరకు దరఖాస్తులు
ఆగస్టు 31, 2026

NEET PG | నీట్-పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలి
ఆగస్టు 30, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



