Nepal Flash Floods | 750కి చేరిన మృతుల సంఖ్య.. సుమారు 3 వేల మంది గల్లంతు
Nepal Flash Floods | నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో ఆకస్మిక వరదలు (Nepal Flash Floods) అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. మంచు, రాళ్లు, వరద నీరు కలిసి ల్హెండే, భోటే కొషి, త్రిశూలి నదీ వ్యవస్థను ముంచెత్తడంతో భారీ విపత్తు సంభవించింది.
International | Published On Aug 30, 2026, 11.42 am IST
Nepal Flash Floods | త్రినేత్ర.న్యూస్: నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో ఆకస్మిక వరదలు (Nepal Flash Floods) అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. మంచు, రాళ్లు, వరద నీరు కలిసి ల్హెండే, భోటే కొషి, త్రిశూలి నదీ వ్యవస్థను ముంచెత్తడంతో భారీ విపత్తు సంభవించింది. ఎక్కడ చూసిన బురద, నేలమట్టమైన ఇండ్లు, కొట్టుకొచ్చిన వాహనాలే కనిపిస్తున్నాయి. ఆకస్మిక వరదలతో పెద్ద సంఖ్యలో జనం గల్లంతయ్యారు. నేపాల్, టిబెట్‌లో (Tibet) మృతుల సంఖ్య (death toll) 750కి చేరింది. సుమారు 3 వేల మంది గల్లంతయ్యారు. ఒక్క నేపాల్‌లోనే (Nepal) ఇప్పటికు 734 మృతదేహాలను వెలికితీశారు. మరో 2,498 మంది గల్లంతయ్యారు. ఈ మేరకు నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ సంస్థ వెల్లడించింది. భారీ బురద, శిథిలాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నప్పటికీ, గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతున్నదని తెలిపింది. తాజా గణాంకాలతో ఈ విపత్తు నేపాల్ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తుల్లో ఒకటిగా మారిందని సంస్థ పేర్కొంది.
మరోవైపు టిబెట్‌లో 16 మంది మరణించగా, 546 మంది గల్లంతయ్యారు. వారిలో 261 మంది విదేశీయులు ఉన్నారు. కాగా, నేపాల్‌లోని రసువా (Rasuwa), నువాకోట్ జిల్లాల్లో ఉన్న 11 జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద 573 మందికిపైగా కార్మికులు సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. మంచు, రాళ్లు, వరద నీరు కలిసి ల్హెండే-భోటే కోశి-త్రిశూలి నదీ వ్యవస్థను ముంచెత్తడంతో భారీ విపత్తు సంభవించింది. 11 ప్రాజెక్టు ప్రాంతాల పరిధిలో తొలుత 934 మంది కార్మికులు గల్లంతవగా, వారిలో 361 మందిని సురక్షితంగా రక్షించారు. చిక్కుకుపోయిన వారిలో భారతీయులతో పాటు నేపాల్, దక్షిణ కొరియా, చైనా, జర్మనీ దేశాల పౌరులు ఉన్నారు.

పొంచి ఉన్న వరద ముప్పు
నేపాల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భోటే కోషి నదిలో (Bhote Koshi River) మరోసారి నీటి మట్టం భారీగా పెరుగుతోందని నేపాల్ విపత్తు నివారణ సంస్థ (NDRRMA) తెలిపింది. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
సంబంధిత వార్తలు

Nepal Flash Floods | ఎప్పటికీ రాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు.. నేపాల్ బాలుడి కన్నీటి గాథ
సెప్టెంబర్ 8, 2026

Nepal Floods | వరదలకు కలుషితమైన నీరు.. నేపాల్ బాధితులను వెంటాడుతున్న అంటు వ్యాధుల ముప్పు
సెప్టెంబర్ 5, 2026

Nepal Floods | నేపాల్ వరదల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు కార్మికులు
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



