Gas Leak | సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై గ్యాస్ లీక్.. 24 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ మళ్లింపు
Gas Leak | మహారాష్ట్రలోని ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే (Samruddhi Expressway)పై భారీ గ్యాస్‌పైప్ లీకేజీ (Gas Leak )కలకలం సృష్టించింది. సమృద్ధి ఎక్స్రెస్‌వేపై ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని గంగాపూర్ తాలూకా తక్లీవాడి సమీపంలో ఉన్న గెయిల్ (GAIL) గ్యాస్ పైప్‌లైన్ నుండి గ్యాస్ లీక్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
Gas Leak | త్రినేత్ర.న్యూస్: మహారాష్ట్రలోని ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే (Samruddhi Expressway)పై భారీ గ్యాస్‌పైప్ లీకేజీ (Gas Leak )కలకలం సృష్టించింది. సమృద్ధి ఎక్స్రెస్‌వేపై ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని గంగాపూర్ తాలూకా తక్లీవాడి సమీపంలో ఉన్న గెయిల్ (GAIL) గ్యాస్ పైప్‌లైన్ నుండి గ్యాస్ లీక్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఎక్స్‌ప్రెస్‌వేలోని 24 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. వాహనాలను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఘటనా స్థలంలో ఫైర్ ఫైటింగ్ వాహనాలను సిద్ధంగా ఉంచారు. గ్యాస్ లీకేజీతో పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వ్యాపించడంతో, ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న గెయిల్ ఇండియా (GAIL pipeline) నిపుణులు లీకేజీ ఉన్న ప్రాతానికి ఇరువైపులా గల వాల్వ్‌లను మూసివేసి పైప్‌లైన్‌లో ఒత్తిడిని తగ్గించారు. ఈ నేపథ్యంలో హదాస్ పింపాల్‌గావ్, మలివాడ (చేనేజ్ 447 నుంచి 470) మధ్య ప్రయాణించే వాహనాలను ధూలే-సోలోపూర్ హైవే వైపు (Traffic Diversion)మళ్లించారు. దీంతో ముంబై (Mumbai) వైపు వెళ్లే వాహనాలు హదాస్ పింపాల్‌గావ్ ఇంటర్‌ఛేంజ్ వద్ద ఎక్స్‌ప్రెస్‌వే దిగి, ధూలే-సోలాపూర్ హైవే ద్వారా ప్రయాణించి, తిరిగి మలివాడ వద్ద సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపైకి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక నాగ్‌పూర్ (Nagpur) వైపు వెళ్లే వాహనాలలు మలివాడ ఇంటర్‌ఛేంజ్ వద్ద ఎగ్జిట్ తీసుకుని, ధూలే-సోలాపూర్ జాతీయ రహదారి గుండా ప్రయాణించి, మళ్లీ హదాస్ పింపాల్‌గావ్ వద్ద ఎక్స్‌ప్రెస్‌వేపైకి ప్రవేశించాలి. త్వరలోనే ఎక్స్‌ప్రెస్‌వేపై సాధారణ ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!
- ●MP Chamala | వచ్చే రెండేళ్లు కూడా ఇలా నాటకాలు వేసుకుని బ్రతకాల్సిందే : ఎంపీ చామల
- ●Mumbai Desalination Plant | సముద్రపు నీరే ఇక తాగునీరు.. రూ.4,007 కోట్లతో ముంబై భారీ ప్రాజెక్ట్.. ఎలా పనిచేస్తుందంటే?
- ●Dhruv Vikram | టాలీవుడ్ డైరెక్టర్‌తో వివాదం - దిగొచ్చిన ధృవ్ విక్రమ్
- ●Bionic Robot Fish | నీటిలో అచ్చం నిజమైన చేపలా ఈదుతున్న రోబో.. వీడియో వైరల్

Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్

Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!

MP Chamala | వచ్చే రెండేళ్లు కూడా ఇలా నాటకాలు వేసుకుని బ్రతకాల్సిందే : ఎంపీ చామల

Mumbai Desalination Plant | సముద్రపు నీరే ఇక తాగునీరు.. రూ.4,007 కోట్లతో ముంబై భారీ ప్రాజెక్ట్.. ఎలా పనిచేస్తుందంటే?






