Traffic diversions | రేపే హైదరాబాద్ రన్నర్స్ మారథాన్.. ట్రాఫిక్ మళ్లింపు వివరాలివే
Traffic diversions | రేపు నిర్వహించే హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ రన్ సందర్భంగా ఉదయం 4:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ తెలిపారు.
త్రినేత్ర.న్యూస్: రేపు నిర్వహించే హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ రన్ సందర్భంగా ఉదయం 4:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ తెలిపారు. ఈ పరుగు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై రోడ్ నంబర్ 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలిలోని జి.ఎమ్.సి. బాలాజీ స్టేడియం వరకు కొనసాగుతుందని చెప్పారు. నగర ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితిల దృష్ట్యా ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 కు కాల్ చేయాలని సూచించారు.
ఇదే మారథాన్ రన్ మార్గం
పీపుల్స్ ప్లాజా (నెక్లెస్ రోడ్) - రోటరీ - ఎన్‌టీఆర్ మార్గ్ - ట్యాంక్ బండ్ - చిల్డ్రన్స్ పార్క్ - సెయిలింగ్ క్లబ్ - సోనాబీ మసీదు - బుద్ధ భవన్ - సంజీవయ్య పార్క్- పీపుల్స్ ప్లాజా - రోటరీ - వి.వి. విగ్రహం, ఖైరతాబాద్ - లోక్ భవన్ రోడ్ - సోమాజిగూడ - పంజాగుట్ట ఫ్లైఓవర్ - ఎంజె కాలేజ్ - ఎస్ఎన్‌టి జంక్షన్ - సాగర్ సొసైటీ -కేబీఆర్ పార్క్ - జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ - రోడ్ నంబర్ 45 - కేబుల్ బ్రిడ్జి.
ఇవీ ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లు..
- మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్ వైపు నుంచి వచ్చే వాహనాలు: నెక్లెస్ రోడ్ వైపు అనుమతించరు. నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్, మినిస్టర్స్ రోడ్ వైపు మళ్లిస్తారు.
- పంజాగుట్ట, రాజ్ భవన్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలు: వి.వి. విగ్రహం వద్ద షాదాన్, నిరంకారీ భవన్ మీదుగా రవీంద్ర భారతి వైపు మళ్లిస్తారు.
- ఖైరతాబాద్ ఫ్లైఓవర్, షాదాన్ నుంచి బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనాలు: కె.సి.పి వద్ద తాజ్ కృష్ణా - రోడ్ నం. 10, 12, క్యాన్సర్ హాస్పిటల్ - ఒరిస్సా ఐలాండ్ మీదుగా జూబ్లీహిల్స్ వైపు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలి.
- ఇక్బాల్ మినార్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలు: తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ ప్రారంభ పాయింట్ వద్ద ఫ్లైఓవర్ పైకి మళ్లిస్తారు.
- లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలు: అంబేడ్కర్ విగ్రహం వద్ద తెలంగాణ తల్లి, ఇక్బాల్ మినార్ యు-టర్న్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ ద్వారా లోయర్ ట్యాంక్ బండ్ / కట్ట మైసమ్మ గుడి వైపు మళ్లిస్తారు.
- కర్బాలా వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలు: చిల్డ్రన్స్ పార్క్ వద్ద డీబీఆర్ మీదుగా కవాడిగూడ వైపు మళ్లిస్తారు.
- ముషీరాబాద్, జబ్బార్ కాంప్లెక్స్ నుంచి సెయిలింగ్ క్లబ్ మీదుగా అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలు: కవాడిగూడ ఎక్స్ రోడ్ వద్ద డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు.
- తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలు: అప్పర్ ట్యాంక్ బండ్ వైపు అనుమతించరు. డీబీఆర్ మిల్స్ వద్ద కవాడిగూడ ఎక్స్ రోడ్, గోశాల మీదుగా జబ్బార్ కాంప్లెక్స్ వైపు మళ్లిస్తారు.
- మారథాన్ నెక్లెస్ రోటరీకి చేరుకున్నప్పుడు: బేగంపేట నుంచి రాజ్ భవన్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనాలను గ్రీన్‌లాండ్స్ జంక్షన్ వద్ద డి.కె. రోడ్, అమీర్‌పేట్ వైపు మళ్లిస్తారు.
- బంజారాహిల్స్ వైపు వెళ్లేందుకు: డి.కె. రోడ్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎన్‌ఎఫ్‌సీఎల్ - తాజ్ కృష్ణా, రోడ్ నం. 10, 12, బంజారాహిల్స్ మీదుగా వెళ్లాలి.
- జూబ్లీహిల్స్ వైపు వెళ్లేందుకు: డి.కె. రోడ్, అమీర్‌పేట్, మైత్రివనం, యూసుఫ్‌గూడ, వెంకటగిరి, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా వెళ్లాలి.
- మారథాన్ పంజాగుట్ట ఫ్లైఓవర్ ఎక్కినప్పుడు: పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 వైపు వెళ్లే వాహనాలను ఎన్‌ఎఫ్‌సిఎల్ జంక్షన్ వద్ద బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు (తాజ్ కృష్ణా, రోడ్ నంబర్ 10, 12, క్యాన్సర్ హాస్పిటల్, ఒరిస్సా ఐలాండ్ మీదుగా) మళ్లిస్తారు.
- మారథాన్ సాగర్ సొసైటీ జంక్షన్‌కు చేరుకున్నప్పుడు: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వచ్చు వాహనాలను బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 వైపు అనుమతించరు. ఎన్‌టిఆర్ భవన్ వద్ద కుడివైపునకు మళ్లించి క్యాన్సర్ హాస్పిటల్, జహీరా నగర్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 మీదుగా పంజాగుట్ట వైపు పంపుతారు.
- మారథాన్ ఎన్‌టీఆర్ భవన్ చేరుకున్నప్పుడు: ఫిల్మ్ నగర్, బీవీబీ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వచ్చే వాహనాలను జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నంబర్ 70 వద్ద హార్ట్ కప్ జంక్షన్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 54 మీదుగా రోడ్ నంబర్ 36 వైపు మళ్లిస్తారు.
- సైబరాబాద్ కేబుల్ బ్రిడ్జి నుంచి వచ్చే వాహనాలు: ఫ్లైఓవర్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వైపు అనుమతించరు. ఈ వాహనాలను ర్యాంప్ ద్వారా మెగ్నోలియా బేేకరీ జంక్షన్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 39 మీదుగా రోడ్ నంబర్ 36 వైపు అనుమతిస్తారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●NEET PG Student Suicide | కన్నవారికి కడుపుకోత: చదువుల ఒత్తిడి తట్టుకోలేక నీట్ విద్యార్థిని ఆత్మహత్య
- ●Telangana Seed Act | నకిలీ, నాసిరకం విత్తనాల వల్ల నష్టపోయిన రైతుకు తక్షణమే నష్టపరిహారం
- ●Batti Vikramarka | మారిషస్‌లో తెలుగును ప్రమోట్ చేసేందుకు సహకరిస్తాం
- ●నిజామాబాద్ వేదికగా కల్వకుంట్ల కవిత ‘పాంచజన్య’ వ్యూహం: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త శకానికి తెరలేపుతున్నారా?
- ●Eesha Rebba | కొత్తింట్లో అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్ - అమ్మ పేరు పెట్టానంటూ ఎమోషనల్ పోస్ట్
- ●Telangana Farmers Commission | ఎఫ్టీఎల్ ఆక్రమణలు కూల్చేయండి.. చెరువుల రక్షణకు కొత్త చట్టం

NEET PG Student Suicide | కన్నవారికి కడుపుకోత: చదువుల ఒత్తిడి తట్టుకోలేక నీట్ విద్యార్థిని ఆత్మహత్య

Telangana Seed Act | నకిలీ, నాసిరకం విత్తనాల వల్ల నష్టపోయిన రైతుకు తక్షణమే నష్టపరిహారం

Batti Vikramarka | మారిషస్‌లో తెలుగును ప్రమోట్ చేసేందుకు సహకరిస్తాం

నిజామాబాద్ వేదికగా కల్వకుంట్ల కవిత ‘పాంచజన్య’ వ్యూహం: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త శకానికి తెరలేపుతున్నారా?





