Vishnu Priya | సెన్సార్ చిక్కుల్లో రంభ ఊర్వశి మేనక – విష్ణుప్రియ, రాశీ సింగ్ పాత్రలపై అభ్యంతరాలు
అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక మూవీకి సెన్సార్ అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ సినిమాలో విష్ణుప్రియ, రాశీసింగ్, ప్రిషాసింగ్ పాత్రలను చూపించిన విధానంపై సెన్సార్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.
Entertainment | Published On Aug 30, 2026, 12.17 pm IST
Vishnu Priya అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక మూవీ రిలీజ్‌కు ముందే చిక్కుల్లో పడింది. ఈ సినిమాలో విష్ణుప్రియ, రాశీసింగ్‌తో పాటు ప్రిషా సింగ్ పాత్రలను చూపించిన విధానంపై సెన్సార్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు సమాచారం. సెన్సార్ అడ్డంకుల కారణంగా ఈ సినిమా రిలీజ్‌పై అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. సెప్టెంబర్ 4న విడుదల కావాల్సిన రంభ ఊర్వశి మేనక వాయిదాపడే అవకాశం ఉందని అంటున్నారు.
ఇంద్రలోకం...
సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న రంభ ఊర్వశి మేనక సినిమాకు చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించారు. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో సురభి హీరోయిన్‌గా నటించింది. ఓ యువకుడి కోసం ఇంద్రలోకం నుంచి భూమిపైకి రంభ ఊర్వశి మేనక దిగివస్తారు? ఆ తర్వాత ఎదురైన పరిణామాలతో ఫన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు.
అప్సరసలు...
ఈ సినిమాలో రంభగా రాశీసింగ్, ఊర్వశిగా విష్ణుప్రియ, మేనకగా ప్రిషా సింగ్ కనిపించబోతున్నారు. అప్సరసలుగా పురాణాలు పేర్కొన్న రంభ ఊర్వశి మేనకలను అభ్యంతకరకరంగా సినిమాలో చూపించారంటూ సెన్సార్ సభ్యులు పేర్కొన్నట్లు సమాచారం. వారి పాత్రలకు సంబంధించిన డైలాగ్స్ విషయంలో చాలానే మార్పులు సూచించినట్లు చెబుతున్నారు.
లాంగ్ గ్యాప్ తర్వాత...
సెన్సార్ అభ్యంతరాలపై మేకర్స్ రివైజింగ్ కమిటీకి వెళ్లినట్లు చెబుతున్నారు. సోమవారం సెన్సార్ సర్టిఫికెట్‌పై క్లారిటీ రానున్నట్లు తెలిసింది. లాంగ్ గ్యాప్ తర్వాత ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్ కథాంశంతో అల్లరి నరేష్ చేసిన సినిమా ఇది. అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి రాజేష్ దండా ఈ సినిమాను నిర్మించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Taapsee | నాలుగేళ్ల తర్వాత తెలుగు సినిమాలో తాప్సీ – బాలీవుడ్లో ఆఫర్లు తగ్గడమే కారణమా?
ఆగస్టు 29, 2026

Pragya Jaiswal | ప్రగ్యా జైస్వాల్‌ను ఆటాడుకుంటున్న అక్కినేని ఫ్యాన్స్ – బర్త్‌డే పోస్ట్ వివాదం
ఆగస్టు 29, 2026

Nani Paradise | డల్లాస్ గడ్డపై మారుమోగిన తెలంగాణ జానపదం – ప్యారడైజ్ నుంచి ఏషనాగుల సాంగ్ రిలీజ్
ఆగస్టు 29, 2026
తాజావార్తలు
- ●IAS Officer | వెటర్నరీ ఆఫీసర్ నియామక పరీక్షలో అక్రమాలు.. ఐఏఎస్ అధికారి అరెస్ట్
- ●Nepal Flash Floods | 750కి చేరిన మృతుల సంఖ్య.. సుమారు 3 వేల మంది గల్లంతు
- ●JHCHBS | భవన్స్‌లో ఎన్నికలు.. బౌన్సర్ల పహారాలో జూబ్లీహిల్స్ క్లబ్
- ●NEET PG | నీట్ పీజీ పరీక్ష.. మద్యం తాగి వచ్చిన విద్యార్థి.. అనుమతించని సిబ్బంది
- ●Gas Leak | సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై గ్యాస్ లీక్.. 24 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ మళ్లింపు
- ●Mohan Bhagwat | ముస్లింలు లేకుండా హిందూ రాజ్యం అనే భావనే లేదు: భాగవత్

IAS Officer | వెటర్నరీ ఆఫీసర్ నియామక పరీక్షలో అక్రమాలు.. ఐఏఎస్ అధికారి అరెస్ట్

Nepal Flash Floods | 750కి చేరిన మృతుల సంఖ్య.. సుమారు 3 వేల మంది గల్లంతు

JHCHBS | భవన్స్‌లో ఎన్నికలు.. బౌన్సర్ల పహారాలో జూబ్లీహిల్స్ క్లబ్

NEET PG | నీట్ పీజీ పరీక్ష.. మద్యం తాగి వచ్చిన విద్యార్థి.. అనుమతించని సిబ్బంది



