Batti Vikramarka | మారిషస్‌లో తెలుగును ప్రమోట్ చేసేందుకు సహకరిస్తాం
Batti Vikramarka | మారిషస్ దేశంలో తెలుగు భాష, సంస్కృతి, పురాణ ఇతిహాసాలను ప్రమోట్ చేసేందుకు ఆ దేశానికి అన్ని విధాలా సహకరిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.
- ప్రజాభవన్‌లో మారిషస్ బృందం భేటీలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
Batti Vikramarka | త్రినేత్ర.న్యూస్: మారిషస్ దేశంలో తెలుగు భాష, సంస్కృతి, పురాణ ఇతిహాసాలను ప్రమోట్ చేసేందుకు ఆ దేశానికి అన్ని విధాలా సహకరిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో శనివారం మారిషస్ పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల మంత్రి లచ్మునా రాజ్ పెంటియా బృందం ఉప ముఖ్యమంత్రితో భేటీ అయింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ - మారిషస్ మధ్య సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయని గుర్తు చేశారు.
ఇరు దేశాల మధ్య ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ప్రజల మధ్య స్నేహపూర్వ సంబంధాలున్నామని పేర్కొన్నారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల ద్వారా తెలంగాణకు మారిషస్‌తో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. మారిషస్‌లోని తెలుగు సమాజం అక్కడి గొప్ప బహుళ సాంస్కృతిక సమాజంలో ముఖ్యమైన భాగంగా ఉందన్నారు.
రామ భజనం..
మారిషస్ ప్రభుత్వం చేపడుతున్న రామ భజనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భట్టి విక్రమార్క చెప్పారు. విద్య, సాంస్కృతిక పరిశోధన, కళలు, భాష, సాంస్కృతిక అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. మారిషస్‌లోని తెలుగు కల్చరల్ సెంటర్‌లో లక్షలాదిమంది తెలుగు ప్రవాసులు తమ సంస్కృతి, సంప్రదాయాలను, భాష పరిరక్షణ చేస్తున్నారని మారిషస్ మంత్రి తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజం పట్ల తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు, తెలుగు భాష, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు చేస్తున్న కృషి పట్ల వారు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Volkswagen | వోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు.. 2030 నాటికి లక్ష ఉద్యోగాలు కట్..
- ●IndiGo plane hits pole | ల్యాండింగ్ వేళ పోల్‌ను ఢీ కొట్టిన విమానం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన
- ●SIR | ముసాయిదా ఓటర్ల జాబితా.. కాంగ్రెస్ ఎంపీ పేరు మాయం
- ●Stock Markets | 500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. 23,900 పైన నిఫ్టీ..
- ●Travel Bus | అనంతపురంలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన ప్రాణ నష్టం
- ●NIC Recruitment | నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్‌లో టెక్నికల్ అసిస్టెంట్లు..

Volkswagen | వోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు.. 2030 నాటికి లక్ష ఉద్యోగాలు కట్..

IndiGo plane hits pole | ల్యాండింగ్ వేళ పోల్‌ను ఢీ కొట్టిన విమానం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

SIR | ముసాయిదా ఓటర్ల జాబితా.. కాంగ్రెస్ ఎంపీ పేరు మాయం

Stock Markets | 500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. 23,900 పైన నిఫ్టీ..







